సర్వసభ్య సమావేశము
దైవికమైన తల్లిదండ్రుల పాఠాలు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దైవికమైన తల్లిదండ్రుల పాఠాలు

తల్లిదండ్రులు వారి ప్రశస్తమైన పిల్లలను పరలోకానికి తిరిగి నడిపించడానికి వారి పరలోక తండ్రితో భాగస్వామ్యంలో ప్రవేశిస్తారు.

మీరు ఎప్పుడైన క్రొత్తగా పుట్టిన బిడ్డను మీ చేతులలో పట్టుకున్నారా? ఒక ప్రత్యేకమైన ప్రేమ బంధమును తెస్తూ, క్రొత్తగా పుట్టిన ప్రతిబిడ్డను చూసిన జనులు యాంత్రికంగా ప్రేమను అనుభూతి చెందుతారు, అది వారి తల్లిదండ్రుల యొక్క హృదయాలను ప్రేమతో నింపగలదు.1 ఒక మెక్సికన్ రచయత ఇలా వ్రాసారు, “ఒక క్రొత్తగా పుట్టిన బిడ్డ తన తండ్రి యొక్క వేలును తన చిన్న వేలితో మొదట గట్టిగా నొక్కినప్పుడు, అతడు శాశ్వతంగా అతడిని పట్టుకున్నాడని నేను నేర్చుకున్నాను.”2

తల్లిదండ్రులుగా ఉండుట జీవితము యొక్క మిక్కిలి అసాధారణమైన అనుభవాలలో ఒకటి. తల్లిదండ్రులు వారి ప్రశస్తమైన పిల్లలను పరలోకానికి తిరిగి నడిపించడానికి వారి పరలోక తండ్రితో భాగస్వామ్యంలో ప్రవేశిస్తారు.3 మన పిల్లల పెంపకం వారసత్వాన్ని వదలడానికి మనకు సహాయపడటానికి లేఖనాలలో కనుగొనబడినవి మరియు జీవిస్తున్న ప్రవక్తల చేత బోధించబడిన పాఠములను పంచుకోవాలని నేను కోరుతున్నాను.

సువార్త సంస్కృతి యొక్క ఉన్నత స్థితిని అధిరోహించుట

మనము మన కుటుంబాలతో సువార్త సంస్కృతి యొక్క ఉన్నత స్థితిని అధిరోహించాలి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించారు: “కుటుంబాలు పరలోకము నుండి నడిపింపును పొందడానికి అర్హత కలిగియున్నాయి. తల్లిదండ్రులు వ్యక్తిగత అనుభవము, భయము, లేదా సానుభూతి నుండి సమృద్ధిగా ఉపదేశించలేరు.”4

మన సాంస్కృతిక నేపథ్యములు, పిల్లల పెంపకం రీతులు, మరియు వ్యక్తిగత అనుభవాలు తల్లిదండ్రులుగా ఉండటానికి విలువైన అనుభవాలు అయినప్పటికినీ, ఈ సామర్ధ్యములు మన పిల్లలు పరలోకమునకు తిరిగి వెళ్ళుటకు సహాయపడటానికి సరిపోవు. మనకు మరింత ఉన్నతమైన “విలువలు మరియు ఆచరణలకు”5 ప్రవేశము కావాలి, ప్రేమ, అంచనాల రెండిటి సంస్కృతి, అక్కడ మనం మన పిల్లలతో “ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానాలలో” 6 సంభాషిస్తాము. అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ సువార్త సంప్రదాయాన్ని ఇలా వర్ణించారు, “జీవితము యొక్క విశిష్టమైన విధానము, విలువల వర్గము, అంచనాలు, మరియు ఆచరణలు. … ఈ సువార్త సంస్కృతి రక్షణ ప్రణాళిక నుండి, దేవుని ఆజ్ఞలు, మరియు జీవిస్తున్న ప్రవక్తల బోధనల నుండి … వచ్చును. అది మన కుటుంబాలను పెంచే విధానంలో మరియు మన వ్యక్తిగత జీవితాలను జీవించే విధానములో మనల్ని నడిపిస్తుంది.”7

యేసు క్రీస్తు ఈ సువార్త సంస్కృతికి కేంద్రము. మన కుటుంబాలలో సువార్త సంస్కృతిని అవలంబించడం అనేది విశ్వాసం అనే విత్తనం వర్ధిల్లగలిగే సారవంతమైన వాతావరణాన్ని సృష్టించుటకు చాలా కీలకమైనది. ఉన్నత స్థితికి అధిరోహించడానికి, “యేసు క్రీస్తు యొక్క సంఘ బోధనలకు వ్యతిరేకమైన వ్యక్తిగత లేదా కుటుంబ ఆచారాలు లేదా ఆచరణలను వదిలి వేయమని”8 అధ్యక్షులు ఓక్స్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులారా, మనవంతుగా సువార్త సంస్కృతిని స్థాపించడానికి పిరికితనంగాఉంటే అపవాది మన ఇళ్లలో లేదా ఇంకా ఘోరంగా, మన పిల్లల హృదయాలను ప్రభావితం చేయడానికి అనుమతించవచ్చు.

సువార్త సంస్కృతి మన కుటుంబంలో ప్రబలమైన సంస్కృతిగా చేయడానికి మనము ఎంపిక చేసినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన ప్రభావము 9 ద్వారా, మన ప్రస్తుతపు పిల్లల పెంపకం రీతులు, సంప్రదాయాలు, మరియు ఆచరణలు వేరు చేయబడతాయి, సమలేఖనం చేయబడతాయి, శుద్ధి చేయబడతాయి, మరియు మెరుగుపరచబడతాయి.

గృహమును సువార్త శిక్షణా కేంద్రముగా చెయ్యండి.

గృహము “సువార్త శిక్షణ యొక్క కేంద్రముగా”10 ఉండవలెనని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు. సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యమేదనగా “పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల మన పరివర్తనను హెచ్చించడం మరియు వారి వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే.”11 మన గృహాలలో ఉన్నతమైన సువార్త సంస్కృతిని స్థాపించడానికి మనకు సహాయపడగలుగునట్లు ప్రవక్తలు మరియు అపొస్తులుల చేత వివరించబడిన మూడు కీలకమైన పిల్లల పెంపకం బాధ్యతలను మనము పరిగణిద్దాం.

మొదటిది: నిస్సంకోచంగా బోధించండి

యేసు క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతము గురించి పరలోక తండ్రి ఆదాముకు బోధించారు. “ఈ సంగతులను నిస్సంకోచముగా ఈలాగు చెప్పుచు నీ పిల్లలకు బోధించమని”12 ఆయన అతడికి బోధించారు. మరొక మాటలలో, నిస్సంకోచంగా, ఉదారంగా, మరియు నిర్బంధము లేకుండా ఈ విషయాలను బోధించమని పరలోక తండ్రి ఆదాముకు బోధించారు.13 “ఆదాము హవ్వలు దేవుని నామమును స్తుతించి, సమస్తమును వారి కుమారులు, కుమార్తెలకు తెలియజేసిరి,” 14 అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి.

మనం మన పిల్లలతో అర్ధవంతమైన సమయాన్ని గడిపినప్పుడు వారికి ఉదారంగా మనం బోధిస్తున్నాము. సంఘము లభ్యముగా చేసిన వనరులను ఉపయోగిస్తూ, “డిజిటల్ సాధనాలు” వంటి సున్నితమైన విషయాలను చర్చించినప్పుడు, మనము నిర్భంధము లేకుండా బోధిస్తున్నాము.15 రండి, నన్ను అనుసరించుడి ఉపయోగిస్తూ మన పిల్లలతో లేఖనాలను మనం చదివి, ఆత్మను బోధకునిగా అనుమతించినప్పుడు మనము స్వేచ్ఛగా బోధిస్తున్నాము.

రెండవది: మంచి మాదిరిగల శిష్యత్వము

యోహాను గ్రంథములో, ఆయన ప్రవర్తన గురించి కొందరు యూదులు ప్రశ్నించినప్పుడు, యేసు తన మాదిరియైన, తన తండ్రివైపు ఆసక్తిని మరల్చారని మనము చదువుతాము. ఆయన ఇలా బోధించారు, “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.”16 తల్లిదండ్రులారా, మన పిల్లలకు మంచి మాదిరిగా ఉండటానికి మనము ఏమి చేయాల్సి యున్నది? శిష్యత్వము.

తల్లిదండ్రులుగా, మనము మొదటి ఆజ్ఞను చర్చించినప్పుడు దేవునిని మొదటగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను మనం బోధించవచ్చు, కానీ లోకసంబంధమైన అంతరాయాలను మనము ప్రక్కన పెట్టి, ప్రతివారము విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినప్పుడు, దానికి మాదిరిగా మనమున్నాము. సిలెస్టియల్ వివాహము యొక్క సిద్ధాంతము గురించి మనము మాట్లాడినప్పుడు దేవాలయ నిబంధనల యొక్క ప్రాముఖ్యతను మనం బోధించగలము, కానీ మనం మన నిబంధనలు గౌరవించి, మన సహవాసిని మర్యాదగా చూచినప్పుడు దానికి మాదిరిగా ఉంటాము.

మూడవది: అమలు చేయడానికి ఆహ్వానించుట

యేసు క్రీస్తునందు విశ్వాసము మన పిల్లల సాక్ష్యములలో ప్రధానమైనదిగా ఉండాలి, మరియు ప్రతి బిడ్డకు ఈ సాక్ష్యములు వ్యక్తిగత బయల్పాటు ద్వారా రావాలి.17 వారి సాక్ష్యములను నిర్మించడంతో మన పిల్లలకు సహాయపడటానికి, సరైన దానిని ఎంపిక చేయడానికి, వారి కర్తృత్వమును ఉపయోగించడానికి మనము వారిని ప్రోత్సహిస్తాము18 మరియు దేవుని యొక్క నిబంధన బాటపై జీవిత కాలము కొరకు వారిని సిద్ధపరచాలి.19

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తను గూర్చి అతడు లేక ఆమె స్వంత సాక్ష్యమును గూర్చి బాధ్యతను తీసుకొని, దాని కొరకు పని చేసి, అది ఎదుగునట్లు దాని పోషించడానికి, అవిశ్వాసులు మరియు స్త్రీ, పురుషుల తప్పుడు తత్వాలతో దానిని కలుషితం చేయకుండునట్లు అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించమని మన పిల్లలలో ప్రతిఒక్కరిని ప్రోత్సహించుట తెలివైన పని .20

నీతిగల, ఉద్దేశ్యపూరితమైన పిల్లల పెంపకం

తల్లిదండ్రులుగా మన పరలోక తండ్రి యొక్క దైవిక ఉద్దేశములు, మోషేకు ఇవ్వబడిన బయల్పాటులో తెలియజేయబడినవి: “ఏలయనగా నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది.”21 అధ్యక్షులు నెల్సన్ చేర్చారు, “నిత్యత్వములో గొప్ప ఆశీర్వాదాలను మీరు కోల్పోకుండా సహాయం చేయడానికి, మీ కర్తృత్వమును ఉల్లంఘించకుండా దేవుడు తాను చేయగలిగినదంతా చేస్తారు.”22

తల్లిదండ్రులుగా, మనము మన పిల్లల సంరక్షణలో దేవునికి ప్రతినిధులుగా ఉన్నాము. 23 మన పిల్లలు ఆయన దైవిక ప్రభావాన్ని అనుభవించే వాతావరణము సృష్టించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.

తల్లిదండ్రులుగా మనం ప్రక్కన కూర్చొని మన పిల్లల ఆత్మీయ జీవితాలను గమనించాలని పరలోకపు తండ్రి ఎన్నడూ ఉద్దేశించలేదు. ఒక వ్యక్తిగత అనుభవంతో ఉద్దేశ్యపూర్వకమైన తల్లి దండ్రులుగా ఉండే ఆలోచనను నేను మీకు వివరిస్తాను. గౌటమాలాలో ఒక చిన్న బ్రాంచిలో ప్రాధమికకు నేను హాజరైనప్పుడు, నా తల్లిదండ్రులు గోత్రజనకుని దీవెనల విలువ గురించి నాకు బోధించసాగారు. మా అమ్మ తనకు విలువైన గోత్రజనకుని దీవెనను పొందే అనుభవాన్ని పంచుకోవడానికి సమయాన్ని తీసుకొన్నది. గోత్రజనకుని దీవెనకు సంబంధించిన సిద్ధాంతమును ఆమె నాకు బోధించింది, మరియు ఆమె వాగ్దానము చేయబడిన దీవెనలను గూర్చి సాక్ష్యమిచ్చింది. ఆమె ఉద్దేశ్యపూరితమైన పిల్లల పెంపకం నా గోత్రజనకుని దీవెన పొందాలనే కోరికను కలిగియుండటానికి నన్ను ప్రేరేపించింది.

నాకు 12 ఏళ్ళప్పుడు, నా తల్లిదండ్రులు ఒక గోత్రజనకుని అన్వేషించడానికి నాకు సహాయపడ్డారు. మేము నివసించిన జిల్లాలో ఏ గోత్రజనకుడు అక్కడ లేరు కనుక అది అవసరమైనది. 156 కిలోమీటర్ల (97 మైళ్ళ) దూరంలోని స్టేకులో ఉన్న గోత్రజనకుని వద్దకు నేను ప్రయాణించాను. నన్ను దీవించడానికి గోత్రజనకుడు నా తలపై తన చేతులుంచినప్పుడు నాకు స్పష్టంగా జ్ఞాపకమున్నది. నా పరలోక తండ్రి నన్ను ఎరుగునని, సందేహము లేకుండా, శక్తివంతమైన ఆత్మీయ నిర్ధారణ ద్వారా నేనెరుగుదును.

ఒక చిన్న నగరము నుండి 12 సంవత్సరాల బాలునిగా నాకు అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది, ప్రభావవంతమైనది. మా అమ్మ, నాన్న యొక్క ఉద్దేశ్యపూరితమైన పిల్లల పెంపకం వలన నా హృదయం నా పరలోక తండ్రివైపు తిరిగింది, మరియు నేను వారికి శాశ్వతంగా కృతజ్ఞత కలిగియుంటాను.

మాజీ ప్రాధమిక ప్రధాన అధ్యక్షురాలైన సహోదరి జాయ్ డి. జోన్స్ ఇలా బోధించారు: “మన పిల్లల్లో పరివర్తన దానంతటదే వచ్చేవరకు మనం వేచియుండలేము. ఆకస్మిక పరివర్తన అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క నియమము కాదు.”24 మన ప్రేమ మరియు ప్రేరేపించబడిన ఆహ్వానాలు మన పిల్లలు వారి కర్తృత్వమును ఎలా ఉపయోగించాలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. అధ్యక్షులు నెల్సన్ నొక్కి చెప్పారు, “నీతిగల, ఉద్దేశ్యపూరితమైన పిల్లల పెంపకమును ఏ ఇతర పని అధిగమించదు!”25

ముగింపు

తల్లిదండ్రులారా, ఈ ప్రపంచం మన పిల్లల ఆసక్తి కోసం కోసం పోటీపడే తత్వాలు, సంస్కృతులు మరియు ఆలోచనలతో నిండి ఉన్నది. గొప్ప మరియు విశాలమైన భవనము ప్రతిరోజు చాలా ప్రస్తుతపు మీడియా చానళ్ళను ఉపయోగిస్తూ దాని సభ్యత్వమును ప్రచారంం చేస్తుంది. “కానీ ఆయన కుమారుని యొక్క బహుమానమందు,“దేవుడు ఒక అధిక శ్రేష్ఠమైన మార్గమును సిద్ధపరచియున్నారు”26 అని ప్రవక్త మొరోనై బోధించాడు.

నిబంధనలు ద్వారా దేవునితో భాగస్వాములుగా ఉండి మరియు మన పిల్లల సంరక్షణలో ఆయన ప్రతినిధులుగా మారినప్పుడు, ఆయన మన ఉద్దేశాలను పరిశుద్ధపరుస్తారు, మన బోధనలను ప్రేరేపిస్తారు, మరియు “మన పిల్లలు వారి యొక్క పాపముల యొక్క నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో మన సంతానము తెలుసుకొనునట్లు”27 మన ఆహ్వానాలను పదును పెడతారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. కీర్తనలు 127:3 చూడండి.

  2. Johnny Welch, “The Puppet,” reproduced at inspire21.com/thepuppet; see also Johnny Welch, Lo que me ha enseñado la vida (1996).

  3. అది చాలా కష్టమైన పనిలా కనిపించవచ్చు, కానీ ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ చెప్పినట్లుగా, “పరలోక తండ్రి సహాయముతో మనము ఊహించిన దానికంటే ఎక్కువ పిల్లల పెంపకం వారసత్వాన్ని వదలవచ్చు” (“The Hands of the Fathers,” లియహోనా, July 1999, 18).

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Thou Shalt Have No Other Gods,” Ensign, May 1996, 15.

  5. డాలిన్ హెచ్. ఓక్స్, “The Gospel Culture,” లియహోనా, Mar. 2012, 22.

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 99.

  7. డాలిన్ హెచ్. ఓక్స్, “The Gospel Culture,” 22.

  8. డాలిన్ హెచ్. ఓక్స్, “The Gospel Culture,” 22.

  9. మొరోనై 10:5 చూడండి.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆదర్శ మైన కడవరి దిన పరిశుద్ధులుగా అగుట,” లియహోనా, నవ. 2018, 113.

  11. పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 v.

  12. మోషే 6:58.

  13. See American Dictionary of the English Language, accessed Aug. 15, 2023, webstersdictionary1828.com/Dictionary/freely.

  14. మోషే 5:12.

  15. Taking Charge of Technology” మరియు For the Strength of Youth: A Guide for Making Choices (2022), సువార్త గ్రంథాలయం చూడండి.

  16. యోహాను 5:19.

  17. మత్తయి 16:17--18 చూడండి. Individual Revelation Needed for a Testimony of Jesus Christ,” New Testament Student Manual, 52.

  18. డేల్ జి. రెన్‌లండ్, “నేడు మీరు కోరుకొనుడి,” లియహోనా, 2018నవం, 104: “పిల్లల పెంపకములో మన పరలోక తండ్రి లక్ష్యం ఏమిటంటే ఆయన పిల్లలు సరైనది చేసేలా చేయడం కాదు; ఆయన పిల్లలు సరైన దానిని ఎన్నుకొనేలా చేసి, చివరకు ఆయన వలే మారడం.”

  19. అనుబంధము: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు మీ పిల్లలను సిద్ధపరచుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023, సువార్త గ్రంథాలయం.

  20. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,లియహోనా, నవ. 2022, 97 చూడండి.

  21. మోషే 1:39. ఈ వచనములో, యేసు క్రీస్తు, పరలోక తండ్రిని తరఫున మాట్లాడుచున్నారు.

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Choices for Eternity” (worldwide devotional for young adults, మే 15, 2022), సువార్త గ్రంథాలయం.

  23. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Salvation and Exaltation,” లియహోనా, 2008 మే, 10: “మీ పిల్లల్ని నియంత్రించడానికి ప్రయత్నించకండి చూడండి. బదులుగా వారిని ఆలకించండి, సువార్త నేర్చుకోవడానికి వారికి సహాయపడండి, వారిని ప్రేరేపించండి, మరియు నిత్య జీవము వైపు వారిని నడిపించండి. ఆయన మీకు అప్పగించిన పిల్లల సంరక్షణలో మీరు దేవుని యొక్క ప్రతినిధులు. మీరు బోధించి, ప్రోత్సహించినప్పుడు, ఆయన దైవిక ప్రభావము మీ హృదయాలలో నిలిచియుండ నివ్వండి.”

  24. జాయ్ డి. జోన్స్, “ఆవశ్యకమైన సంభాషణలు,” లియహోనా, మే 2021,12.

  25. రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Sabbath Is a Delight,” లియహోనా, 2015 మే. చూడండి.

  26. ఈథర్ 12:11.

  27. 2 నీఫై 25:26.