సర్వసభ్య సమావేశము
క్రీస్తుతో నిబంధన అనుబంధములో నడుచుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


క్రీస్తుతో నిబంధన అనుబంధములో నడుచుట

మన కోసం గాయపరచబడి మరియు నలుగగొట్టబడిన ఒకరు మనలో మర్త్యత్వమును దాని కార్యమును చేయడానికి అనుమతిస్తారు, కానీ ఆ సవాళ్లును ఒంటరిగా ఎదుర్కోవాలని ఆయన మనల్ని అడగరు.

ఇశ్రాయేలులో నా మంచి స్నేహితుడైన ఇలాన్ ఒక కాలిబాటను నాకు పరిచయం చేసాడు. “అది యేసు బాటగా పిలవబడింది,” “ఎందుకనగా అది నజరేతు నుండి కపెర్నహూము వరకు యేసు నడిచిన బాట అని అనేకమంది నమ్ముతారు.” ఆ దారిలో నడవాలని కోరుతూ అక్కడే, అప్పుడే నిర్ణయించాను, కనుక నేను ఇజ్రాయేలుకు ఒక ప్రయాణాన్ని ప్రణాళిక చేయడం ప్రారంభించాను.

నా ప్రయాణానికి ఆరు వారాల ముందు, నా చీలమండ విరిగింది. నా భర్త గాయము గురించి కంగారుపడ్డాడు; ఒక నెల తరువాత “యేసు కాలిబాటన” ఎలా నడవగలనని నేను చాలా చింతించాను. స్వాభావికంగా నేను మొండిదాన్ని, అందుచేత నేను విమాన టిక్కెట్లు రద్దు చేయలేదు.

ఆ అందమైన జూన్ ఉదయమున మా ఇశ్రాయేలు గైడును కలవడం నాకు గుర్తుంది. నేను వ్యానులో నుండి దిగి క్రచెస్ సెట్ మరియు మోకాలి స్కూటర్‌ని బయటకు తీశాను. మా గైడ్ మాయ, సిమెంటుతో కట్టబడిన నా కాలును చూసి ఇలా అన్నది, “ఈ పరిస్థితిలో, ఈ కాలిబాటలో మీరు నడవలేరని నేను అనుకుంటున్నాను.”

“కాకపోవచ్చు,” అని నేను జవాబిచ్చాను. “కాకపోవచ్చు కానీ ప్రయత్నించకుండా నన్ను ఏదీ ఆపలేదు”. ఆమె నెమ్మదిగా తల ఊపింది, మరియు మేము నడవసాగాము. కాలిబాటను విరిగిన కాలితో నేను నడవగలనని నమ్మినందుకు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను.

నేను ఏటవాలు మార్గంలో మరియు బండరాళ్లను ఆధారం చేసుకొని కొంత సేపు ప్రయాణించాను. అప్పుడు, నా నిబద్ధత యొక్క నిజాయితీని చూసి, మాయ ఒక సన్నని తాడును తీసి, దానిని నా స్కూటర్ హ్యాండిల్‌కు కట్టి, లాగడం ప్రారంభించింది. ఆమె నన్ను కొండల మీదుగా నిమ్మ తోటల గుండా గలిలయ సముద్ర తీరము ఒడ్డుకు లాగింది. ప్రయాణం ముగింపులో, నా ప్రియమైన గైడు కోసం నేను కృతజ్ఞతను వ్యక్తపరిచాను, నేను ఎప్పటికి స్వంతగా సాధించలేని దానిని సాధించడానికి ఆమె నాకు సహాయపడింది.

దేశము గుండా ప్రయాణించమని, ఆయనను గూర్చి సాక్ష్యమివ్వమని ప్రభువు హానోకును పిలిచినప్పుడు హానోకు సందేహించాడు.1 అతడు కేవలము బాలుడు, నోటిమాంద్యముగలవాడు. అతడు ఆ పరిస్థితిలో ప్రయాణించి, ఆయనను గూర్చి ఎలా సాక్ష్యమివ్వగలడు? అతడిలో విరిగిన దాని చేత అతడి కళ్ళు మూయబడినవి. అతడిని ఆపివేసిన దానికి ప్రభువు యొక్క జవాబు సరళమైనది మరియు తక్షణమైనది: “నాతో నడువుము.”2 హానోకు వలె, మన కోసం గాయపరచబడి మరియు నలుగగొట్టబడిన ఒకరు మనలో మర్త్యత్వమును దాని కార్యము చేయడానికి అనుమతిస్తారు, కానీ ఆ సవాళ్లును ఒంటరిగా ఎదుర్కోవాలని ఆయన మనల్ని అడగరని మనము జ్ఞాపకముంచుకోవాలి.4 మన కధ భారమైనది అయినను, లేదా మన బాట యొక్క ప్రస్తుతపు గమనము, ఏమైనప్పటికిని ఆయనతో నడవమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు.5

కష్టమైన పరిస్థితిలో ఉన్న యువకుడిని గూర్చి ఆలోచించండి, అతడు ప్రభువును అరణ్యములో కలుసుకున్నాడు. యాకోబు ఇంటి నుండి దూరంగా ప్రయాణించాడు. రాత్రి చీకటిలో, అతడికి కలిగిన స్వప్నము ఒక నిచ్చెన మాత్రమే కాదు కానీ ఐదు వేళ్ళ వాగ్దానమని నేను పిలవడానికి ఇష్టపడే దానిని కలిపి, ముఖ్యమైన నిబంధన వాగ్దానాలను కలిగియున్నది.6 ఆ రాత్రి, ప్రభువు యాకోబు ప్రక్కన నిలబడి, ఆయన యాకోబు తండ్రి యొక్క దేవుడనని, పరిచయం చేసుకొని, తరువాత వాగ్దానమిచ్చారు:

  • నేను నీకు తోడైయుంటాను.

  • నేను నిన్ను కాపాడతాను.

  • ఈ దేశమునకు నేను నిన్ను మరల రప్పించెదను.

  • నేను నిన్ను విడువను.

  • నేను నీకు చెప్పినది నెరవేరుస్తాను.7

యాకోబు చేయడానికి ఒక ఎంపికను కలిగియున్నాడు. తన తండ్రి యొక్క దేవునితో పరిచయం పొందడానికి మాత్రమే తన జీవితాన్ని జీవించడానికి అతడు ఎంపిక చేయవచ్చును, లేదా, ఆయనతో ఒడంబడిక చేసిన నిబంధన అనుబంధములో జీవితాన్ని జీవించడానికి అతడు ఎంపిక చేయవచ్చు. సంవత్సరాల తరువాత, యాకోబు ప్రభువు యొక్క నిబంధన వాగ్దానములలో జీవించిన జీవితం గురించి సాక్ష్యమిచ్చాడు: “దేవుడు … నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండెను.”8 ఆయన యాకోబుకు చేసినట్లుగా, ఆయనతో మన జీవితాన్ని కట్టడానికి మనం ఎన్నుకొనిన యెడల, మన శ్రమ దినమున మనలో ప్రతిఒక్కరికి ప్రభువు జవాబిస్తారు. మార్గములో మనతో నడుస్తానని ఆయన వాగ్దానము చేసారు.

ఈ నడవడాన్ని మనము నిబంధన బాట అని పిలుస్తాము—ఆ బాట బాప్తీస్మపు నిబంధనతో ప్రారంభమై, దేవాలయంలో మనము చేసే లోతైన నిబంధనలకు నడిపిస్తుంది. బహుశా మీరు ఆ మాటలను వినియుంటారు మరియు చెక్ బాక్సుల గురించి ఆలోచించారు. బహుశా మీరు చూసేదంతా అవసరతల మార్గము కావచ్చు. నిశితంగా పరిశీలిస్తే మరింత ఆకర్షణీయమైన విషయం తెలుస్తుంది. అది ముఖ్యమైనది అయినప్పటికినీ ఒక నిబంధన ఒక ఒప్పందము గూర్చినది మాత్రమే కాదు. ఇది ఒక సంబంధము గూర్చినది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “నిబంధన మార్గము అంతా దేవునితో మన సంబంధము గూర్చినది.”9

ఒక వివాహ నిబంధనను పరిశీలించండి. వివాహ తేది ముఖ్యమైనది, అయితే ఆ తర్వాత కలిసి జీవించిన జీవితం ద్వారా ఏర్పడిన సంబంధం కూడా అంతే ముఖ్యమైనది. దేవునితో నిబంధన అనుబంధానికి కూడా అదే వర్తిస్తుంది. షరతులు ఏర్పరచబడినవి, మరియు మార్గము వెంట అంచనాలు ఉంటాయి. మరియు ఇంకా ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వసిస్తూ, మన ప్రక్కన ఆయనతో “ముందుకు సాగుటకు”10 మనం చేయగలిగినట్లుగా హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో, రావాలని మనలో ప్రతి ఒక్కరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన స్వకాలములో, ఆయన స్వంత విధానములో తరచుగా ఆ దీవెనలు వస్తాయని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి: 38 సంవత్సరాలు,11 12 సంవత్సరాలు,12 వెంటనే.13 మీ కాలిబాట డిమాండు చేసినట్లుగా, అదేవిధంగా ఆయన సహాయం ఉంటుంది.14

నీచమైన మరియు దయనీయమైన పరిస్థితులలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. యేసు క్రీస్తు మనము ఉన్న స్థలములో, మన ప్రస్తుత పరిస్థితులో మనల్ని కలుసుకుంటారు. అందుకే గెత్సేమనే తోట, సిలువ, మరియు సమాధి ఉన్నాయి. జయించడానికి మనకు సహాయపడటానికి రక్షకుడు పంపబడ్డారు.15 కానీ మనము ఉన్నచోటే ఉండటం మనం కోరుకునే విడుదలను తీసుకొనిరాదు. ఆయన యాకోబును మట్టిలో వదిలివేయనట్లుగానే, మనము ఉన్నచోటు నుండి మనలో ఎవరినీ వదలిపెట్టాలని ఆయన ఉద్దేశించలేదు.

ఆయనను అనుసరించు వారికి ఉన్నతమైన, మెరుగైన స్థితిని పొందేందుకు సహాయం చేస్తాడు. ఆయన ఉన్నచోటుకు మనల్ని పైకెత్తడానికి ఆయన మనలో పనిచేస్తారు16 ఈ ప్రక్రియలో, మనం ఆయనలా మారడానికి వీలు కల్పిస్తారు. యేసు క్రీస్తు మనల్ని పైకెత్తడానికి వచ్చారు.17 మనం మారడానికి ఆయన సహాయపడాలని కోరుతున్నారు. అందుకే దేవాలయమున్నది.

మనకి ఉన్నతస్థితిని ఇచ్చేది గమనము మాత్రమే కాదు; అది మన సహవాసియైన––మన రక్షకుడని మనము జ్ఞాపకముంచుకోవాలి. మరియు ఇది నిబంధన సంబంధానికి కారణము.

నేను ఇశ్రాయేలులో ఉన్నప్పుడు, నేను పశ్చిమ గోడను సందర్శించాను. ఇశ్రాయేలులో యూదులకు, అది అత్యంత పరిశుద్ధమైన స్థలము. అది వారి దేవాలయములో మిగిలి ఉన్నది. చాలా మంది ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించినప్పుడు వారి శ్రేష్టమైన దుస్తులు ధరిస్తారు; వారి దుస్తుల ఎంపిక దేవునితో వారి సంబంధానికి వారి భక్తికి చిహ్నం. వారు లేఖనము చదవడానికి, ఆరాధించడానికి, మరియు వారి ప్రార్థనలు కుమ్మరించడానికి వారు గోడను సందర్శిస్తారు. వారి మధ్యలో ఒక దేవాలయం కోసం చేసిన అభ్యర్థన వారి ప్రతి రోజును, వారి ప్రతి ప్రార్థనను, ఒడంబడిక గృహం కోసం ఈ కోరికను హరిస్తుంది. వారి భక్తిని నేను మెచ్చుకుంటున్నాను.

నేను ఇజ్రాయేలు నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, నిబంధనల గురించి నా చుట్టూ ఉన్న సంభాషణలను నేను ఎక్కువ నిశితంగా విన్నాను. నేను నిబంధన మార్గమును ఎందుకు నడవాలి? అని జనులు అడగటం నేను గమనించాను. నిబంధనలు చేయడానికి నేను ఒక గృహములో ప్రవేశించాలా? నేను పరిశుద్ధమైన వస్త్రము ఎందుకు ధరించాలి? ప్రభువుతో ఒక నిబంధన అనుబంధములో నేను పెట్టుబడి పెట్టాలా? ఈ మంచి, ముఖ్యమైన ప్రశ్నలకు జవాబు సరళమైనది: అది మీరు యేసు క్రీస్తుతో మీరు ఏ స్థాయి సంబంధాన్ని అనుభవించాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడియున్నది.18 మనలో ప్రతిఒక్కరు ఈ లోతైన వ్యక్తిగత ప్రశ్నలకు మన స్వంత జవాబును కనుగొనాలి.

నాది ఇక్కడున్నది: నేను దైవికంగా ఎరిగిన,20 లోతుగా నమ్మిన21 “పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన కుమార్తైగా”19 నేను ఈ మార్గమును నడుస్తాను. నిబంధన యొక్క బిడ్డగా, నేను వాగ్దానము చేయబడిన దీవెనలు పొందడానికి నేను అర్హురాలిని.22 ప్రభువుతో నడవడానికి నేను ఏర్పరచబడ్డాను.23 క్రీస్తు యొక్క సాక్షిగా నిలబడటానికి నేను పిలవబడ్డాను.24 మార్గము అఖండమైనదిగా భావించినప్పుడు, సమర్ధులుగా చేసే కృపతో నేను బలపరచబడ్డాను.25 ఆయన మందిరము లేదా సంఘములో ప్రవేశించిన ప్రతిసారి, నేను ఆయనతో లోతైన నిబంధన సంబంధాన్ని అనుభవిస్తున్నాను. ఆయన ఆత్మతో నేను శుద్ధి చేయబడ్డాను,26 ఆయన శక్తితో వరమివ్వబడ్డాను,27 మరియు ఆయన రాజ్యమును నిర్మించడానికి నియమించబడ్డాను.28 అనుదినము పశ్చాత్తాపము మరియు సంస్కారము యొక్క ప్రక్రియ ద్వారా, నేను దృఢముగా 29 మారడానికి మరియు మేలు చేయడం నేర్చుకుంటున్నాను.30 ఆయన తిరిగి వచ్చిప్పుడు వాగ్దానము చేయబడిన దినము కోసం ఎదురుచూస్తూ, యేసు క్రీస్తుతో ఈ మార్గమున నేను నడుస్తున్నాను. అప్పుడు నేను ఆయనకు బంధింపబడి31 పరిశుద్ధ దేవుని కుమార్తైగా32 పైకెత్తబడతాను.

అందుకే నేను నిబంధన మార్గమును నడుస్తున్నాను.

అందుకే నేను నిబంధన వాగ్దానాలకు నేను కట్టుబడియుంటాను.

అందుకే నేను ఆయన నిబంధన గృహములో ప్రవేశించాను.

ఒక స్థిరమైన జ్ఞాపకంగా అందుకే నేను పరిశుద్ధమైన వస్త్రమును ధరిస్తాను.

ఎందుకనగా నేను ఆయనతో నిబద్ధతకూడిన నిబంధన సంబంధములో జీవించాలని కోరుతున్నాను.

బహుశా మీరు కూడ కోరవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో ప్రారంభించండి.33 మీ పరిస్థితి మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి. జ్ఞాపకముంచుకోండి, మార్గములో వేగము లేదా స్థానము పురోగతి అంత ముఖ్యమైనవి కాదు.34 మీరు నమ్ముతున్న, నిబంధన మార్గములో ఉండే ఒకరిని, వారు తెలుసుకొని రక్షకుని మీకు పరిచయం చేయమని అడగండి. ఆయన యొద్ద నేర్చుకొనుడి. ఆయనతో నిబంధనలో ప్రవేశించుట ద్వారా సంబంధములో పెట్టుబడి పెట్టండి. మీ వయస్సు లేదా మీ పరిస్థితి ముఖ్యమైనది కాదు. మీరు ఆయనతో నడవగలరు.

మేము యేసు కాలిబాటను నడవడం ముగించిన తరువాత, మాయ తన తాడును తిరిగి తీసుకోలేదు. ఆమె దానిని నా స్కూటరుకు కట్టి ఉంచింది. తర్వాత కొన్ని రోజులపాటు, నా టీనేజి మేనల్లుళ్లు మరియు వారి స్నేహితుడు ఒకరి తరువాత ఒకరు నన్ను యెరూషలేము వీధులగుండా లాగారు.35 యేసు యొక్క వృత్తాంతాలలో నేను ఏది మిస్సవకుండా వారు చూసారు. యువతరము యొక్క బలము గురించి నేను గుర్తు చేయబడ్డాను. మేము మీ నుండి నేర్చుకోవచ్చు. మార్గదర్శియైన, యేసు క్రీస్తును తెలుసుకోవడానికి మీరు మంచి కోరికను కలిగియున్నారు. మనల్ని ఆయనతో కట్టిపడేసే తాడు బలాన్ని మీరు విశ్వసిస్తారు. ఆయన వద్దకు ఇతరులను నడిపించే అసాధారణమైన బహుమానమును మీరు కలిగియున్నారు.36

కృతజ్ఞతపూర్వకంగా, మనము మార్గము వెంబడి ప్రోత్సహిస్తూ, కలిసి ఈ బాటను నడుస్తాము.37 మన జీవితాలను యేసు క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, ప్రాముఖ్యమైన దానిని చేయడానికి మనం నడిపించబడతాము. దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. హనోకు ప్రజలు తప్పుదారి పట్టారు, వారు క్రీస్తును తిరస్కరించారు, మరియు “వారు చీకటిలో వారి స్వంత సలహాలను వెతుకుతారు” (మోషే 6:27–28 చూడండి). మానవత్వంపై విశ్వాసం కోల్పోయిన కాలంలో, హనోకు నడిపింపు కోసం ప్రభువు వైపు తిరిగాడు. హనోకుకు ఈ పిలుపు ప్రభువు మనందరికీ విస్తరింపజేసే అదే పిలుపు: “నాతో నడవండి” (మోషే 6:34; మత్తయి 11:28 కూడా చూడండి.) కానీ బహుశా, హనోకు లాగా, మీరు మీ పరిస్థితిలో ఈ మార్గంలో నడవగలరా అని మీకు ఖచ్చితంగా తెలియదు. బహుశా మీరు ఏదో ఒక విధంగా అడ్డుకున్నట్లు భావిస్తారు. మనం నిబంధన మార్గంలో నడవడానికి కారణం మన పరిస్థితి వల్ల కావచ్చు, ఎందుకంటే మనం ఏదో ఒక విధంగా ఆటంకపరచబడుతున్నాము మరియు మనకు ఆయన సహాయం కావాలి.

  2. మోషే 6:23-34 చూడండి.

  3. See “Jesus of Nazareth, Savior and King,” Hymns, no. 181.

  4. ఈథర్ 12:27 చూడండి.

  5. మత్తయి 11:28–30 చూడండి.

  6. మా అమ్మాయిలు ప్రతి ఉదయం వారి పిల్లలకు (నా మనవరాళ్లకు) ఈ ఐదు వేళ్ల వాగ్దానాన్ని మెల్లగా చెప్పాలని కోరుకుంటున్నారు---ఇది ఆయన పిల్లలలో ప్రతిఒక్కరిని దైవికంగా ఎరిగిన పరలోకమందున్న తండ్రిని గుర్తు చేస్తుంది.

  7. ఆదికాండము 28:10--22 చూడండి. అబ్రహాము నిబంధన కూడ ఆ రాత్రికి ముఖ్యమైన ప్రాధాన్యతగా ఉన్నది. అబ్రహాము నిబంధనలోని ఈ అంశాలు మన జీవితాలలో మరియు యేసుక్రీస్తు సువార్తలో ప్రధాన పాత్ర పోషిస్తాయి: (1) నిత్య వారసత్వము యొక్క వాగ్దానము (13 వచనము); (2) నిత్య సంతానము (14 వచనము); మరియు (3) భూమి యొక్క సమస్త దేశాల ఆశీర్వాదము మరియు దీవించే బాధ్యత (14 వచనము).

  8. ఆదికాండము 35:3; వివరణ చేర్చబడినది. యాకోబు తల్లిదండ్రులు అతనిని చంపేస్తానని బెదిరించిన ఏశావు నుండి దూరంగా ఉండమని మరియు నిబంధనలో అతను వివాహం చేసుకోగల వ్యక్తిని కలిసే అవకాశం కోసం ఇంటిని విడిచిపెట్టమని అతడిని ఆదేశించారు (ఆదికాండము 27:41–45; 28:1–2, 5 చూడండి).

  9. రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Everlasting Covenant,” లియహోనా, 2022 అక్టో, 11.

  10. 2 నీఫై 31:20.

  11. యోహాను 5:5, బెతెస్థ కోనేరు వృత్తాంతము చూడండి.

  12. మార్కు 5:25, క్రీస్తు యొక్క అంగీని తాకిన స్త్రీ కథ చూడండి.

  13. మత్తయి 14:31, పేతురు నీటి మీద నడిచే కథ చూడండి.

  14. See “How Firm a Foundation,” Hymns, no. 85.

  15. 1 నీఫై 11:16--33 చూడండి.

  16. ఫిలిప్పియులకు 1:6; 2:13; Words of Mormon 1:7 చూడండి.

  17. యోహాను 12:32 చూడండి.

  18. గైడ్‌పోస్ట్‌లు లేదా సరిహద్దుల గురుతుల వంటి ముఖ్య లక్షణాల ద్వారా మార్గం తరచుగా నిర్వచించబడుతుంది. అది మీరు సరైన కాలిబాటలో ఉన్నారని లేదా సరైన మార్గములో ముందుకు సాగుతున్నారని నిశ్చయపరచే మార్గము. ఒక సంబంధము ముఖ్యమైన లక్షణాలచేత కూడా నిర్వచించబడుతుంది. వీటిలో కొన్ని నిరీక్షణ (యిర్మీయా 29:11; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7); లోబడుట (మోషైయ 3:19; ఆల్మా 7:23; 13:28; ); వినయము, విధేయత, సహనము, లోబడువారు, నమ్మకము (సామెతలు 3:5); మరియు ప్రేమను (రోమా 8:31–39 చూడండి) కలిగి ఉన్నాయి.

  19. Young Women Theme,” Gospel Library, emphasis added; see also బోన్నీ హెచ్. కార్డన్, “ప్రియమైన కుమార్తెలు,” లియహోనా, 2019 నవం, 67.

  20. యోహాను 4:1--29, బావి వద్ద స్త్రీ యొక్క వృత్తాంతము చూడండి.

  21. ఆల్మా 38:1--3 చూడండి.

  22. సంఖ్యాకాండము 6:23--27 చూడండి.

  23. యెహోషువ 24:22 చూడండి.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3, ఎమ్మా స్మిత్ యొక్క వృత్తాంతము చూడండి.

  25. 1 నీఫై 15:9--10 చూడండి.

  26. 2 దినవృత్తాంతములు 20:1–17, ప్రత్యేకంగా 14 వచనము చూడండి.

  27. సిద్ధాంతము మరియు నిబంధనలు 109:1--46 చూడండి.

  28. 1 కొరింథీయులకు 16:11--13 చూడండి.

  29. ఎస్తేరు 4:16, ఎస్తేరు యొక్క వృత్తాంతము చూడండి.

  30. అపొస్తలుల కార్యములు 10:38 చూడండి.

  31. యెషయా 43:1--5 చూడండి.

  32. ద్వితియోపదేశకాండము 28:1--9 చూడండి.

  33. ఏదైనా సంబంధంలో చర్య తీసుకోమనే ఒక పిలుపు ముఖ్యమైనదని మంచి స్నేహితురాలు నాకు గుర్తు చేసింది.

  34. క్రిస్టిన్ ఓల్సన్‌తో సంభాషణ, 2023, సెప్టె.

  35. మాక్ ఓస్వాల్డ్, కామ్‌డెన్ ఓస్వాల్డ్, అష్టన్ మాథేనీ మరియు జాక్ బట్లర్‌లకు, నన్ను ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు.

  36. “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క యువతను భూమిపైన ఉన్న హేతువులలో గొప్ప హేతువైన---ఇశ్రాయేలీయును పోగుచేయుటకు ప్రభువు యొక్క యువత పటాలములో చేరాలని ఇటీవల నేను ఆహ్వానించానని మీరు జ్ఞాపకము చేసుకుంటారు. నేను ఈ ఆహ్వానాన్ని మన యువతకు జారీచేసాను ఎందుకంటే వారు ఇతరులను సమీపించుటకు మరియు వారు నమ్మే సిద్ధాంతాలను ఇతరులను ఒప్పించు రీతిలో పంచుకోగల అసాధారణమైన ప్రతిభను కలిగియున్నారు” (రస్సల్ ఎమ్. నెల్సన్, “సాక్షులు, అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతులు,” లియహోనా, 2019 నవం, 39).

  37. “దేవుని యొక్క రాజ్యము … మృత్యువు అన్ని వైపులా చుట్టుముట్టబడిన ముట్టడి చేయబడిన నగరంలా ఉంది. ప్రతి మనిషికి రక్షించడానికి గోడపై తన స్థలం ఉంటుంది మరియు మరొకరు నిలబడి ఉన్న చోట వేరొకరు నిలబడలేరు, కానీ ‘ఒకరినొకరు ప్రోత్సహించకుండా ఏదీ మనల్ని నిరోధించదు’” (Martin Luther, in Lewis William Spitz, The Renaissance and Reformation Movements [1987], 335).