సర్వసభ్య సమావేశము
సముద్రము యొక్క ద్పీపములపై రక్షకుని యొక్క స్వస్థపరచు శక్తి
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సముద్రము యొక్క ద్పీపములపై రక్షకుని యొక్క స్వస్థపరచు శక్తి

దేవాలయ దీవెనల ద్వారా, రక్షకుడు వ్యక్తులను, కుటుంబాలను, మరియు రాజ్యాలను స్వస్థపరచును.

1960 ప్రారంభంలో లైయిలో వున్న హవాయి సంఘ కళాశాలలో మా నాన్న బోధించారు, అక్కడే నేను పుట్టాను. హావాయి పేరు “కిమో,” అని నాకు పేరు పెట్టమని నా ఏడుగురు అక్కలు మా అమ్మనాన్నల్ని బలవంతపెట్టారు. జపానుతో కలిపి, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని సంఘ సభ్యత్వానికి చాలా సేవలందిస్తున్నప్పుడు లైయి హవాయి దేవాలయం సమీపంలో మేము నివసించాము.1 ఈ సమయమందు, జపనీయ పరిశుద్ధుల గుంపులు దేవాలయ దీవెనలు పొందడానికి హవాయికి రావడం ప్రారంభించారు.

ఈ సభ్యులలో అందమైన ద్వీపము ఒకినావా నుండి ఒక సహోదరి ఉన్నది. హవాయి దేవాలయానికి ఆమె ప్రయాణము యొక్క వృత్తాంతము అసాధారణమైనది. రెండు దశాబ్దాల క్రితం, ఆమె సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేయబడిన బౌద్ధ మత వివాహములో పెండ్లి చేసుకున్నది. కేవలం కొన్ని నెలల తరువాత, జపాన్, హవాయిలోని పెరల్ హార్బర్‌పై దాడి చేసి, అమెరికా‌ను జపాన్‌తో వివాదంలోకి నెట్టివేసింది. మిడ్‌వే మరియు ఇవో జిమా వంటి ముఖ్యమైన యుద్ధాల నేపథ్యంలో, ఊహించని రీతిలో యుద్ధం యొక్క నిరంతర విజయాలు, అపజయాలు జపనీస్ దళాలను ఆ దేశం ద్వీప నివాసమైన ఒకినావా ఒడ్డుకు వెనక్కి నెట్టివేసింది, ఇది జపాన్ యొక్క ప్రధానమైన మరియు ముఖ్యమైన భూభాగాల ముందు మిత్రరాజ్యాల దళాలకు వ్యతిరేకంగా రక్షించబడే చివరి ప్రాంతము

1945లో మూడు నెలలపాటు ఒకినావా యుద్ధము తీవ్రస్థాయిలో జరిగింది. 1,300 అమెరికన్ యుద్ధనౌకల నౌకాదళము ద్వీపాన్ని చుట్టుముట్టింది మరియు బాంబు దాడి చేసింది. సైనిక మరియు పౌర ప్రాణనష్టం అపారమైనది. ఈ రోజు ఒకినావాలోని ఒక గంభీరమైన స్మారక చిహ్నం యుద్ధంలో మరణించిన 240,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల పేర్లను జాబితా చేస్తుంది.2

హింసాత్మక మరియు స్థిరమైన దాడి నుండి తప్పించుకోవడానికి తీరని ప్రయత్నంలో, ఈ ఒకినావా మహిళ, ఆమె భర్త మరియు వారి ఇద్దరు చిన్న పిల్లలు ఒక పర్వత గుహలో ఆశ్రయం పొందారు. తరువాతి వారాలు మరియు నెలల పాటు వారు మాటలతో వివరించలేని చెప్పలేని దుస్థితిని సహించారు

యుద్ధము మధ్యలో, ఒక ఆశలేని రాత్రి, ఆకలితో అలమటిస్తున్న తన కుటుంబం మరియు అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తతో, హ్యాండ్ గ్రెనేడ్‌తో తన కుటుంబ బాధలను ముగించాలని ఆమె ఆలోచించింది, దానిని స్థానిక అధికారులు ఆ ప్రయోజనం కోసం ఆమెకు మరియు ఇతరులకు ఇచ్చారు. అయినప్పటికీ, ఆమె ఆవిధంగా చేయడానికి సిద్ధమైనప్పుడు, ఒక గాఢమైన ఆత్మీయ అనుభవం విశదపరచబడింది, అది ఆమెకు దేవుని యొక్క వాస్తవికత మరియు ఆమె పట్ల ఆయన ప్రేమ యొక్క స్పష్టమైన భావాన్ని ఇచ్చింది, ఇది ఆమె జీవించడం కొనసాగించడానికి బలాన్ని ఇచ్చింది. తరువాతి రోజుల్లో, ఆమె తన భర్తను బలపరిచింది మరియు కలుపు మొక్కలు, అడవి తేనెటీగ నుండి తేనె మరియు సమీపంలోని ప్రవాహంలో చిక్కుకున్న జీవులతో తన కుటుంబానికి ఆహారమిచ్చింది. గమనార్హమైనది, యుద్ధం ముగిసిందని స్థానిక గ్రామస్తులు వారికి తెలియజేసే వరకు వారు గుహలో ఆరు నెలలు గడిపారు.

కుటుంబము ఇంటికి తిరిగి వచ్చి వారి జీవితాన్ని తిరిగి కట్టడం ప్రారంభించినప్పుడు, ఈ జపనీయ స్త్రీ దేవుని గురించి జవాబులు అన్వేషించడం ప్రారంభించింది. క్రమంగా ఆమె యేసు క్రీస్తుపై విశ్వాసమును మరియు బాప్తీస్మము పొందాల్సిన అవసరతను ప్రేరేపించబడింది. అయినప్పటికినీ, ఆమెకు జన్మనిస్తూ మరణించిన ఆమె తల్లిని కలిపి, యేసు క్రీస్తు మరియు బాప్తీస్మము గురించి జ్ఞానము లేకుండా చనిపోయిన తన ప్రియమైన వారి గురించి చింతించింది.

ఒకరోజు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నుండి ఇద్దరు సహోదరి మిషనరీలు తన ఇంటికి వచ్చి, చనిపోయిన తరువాత ఆత్మ లోకములో యేసు క్రీస్తు గురించి జనులు నేర్చుకొనగలని ఆమెకు బోధించినప్పుడు ఆమె సంతోషాన్ని ఊహించండి. ఆమె తల్లిదండ్రులు మరణము తరువాత యేసు క్రీస్తును అనుసరించడానికి ఎన్నుకొని, దేవాలయములని పిలవబడిన పరిశుద్ధ స్థలములలో వారి తరఫున బాప్తీస్మము అంగీకరించవచ్చనే బోధన చేత ఆమె ఆకర్షించబడింది. ఆమె, ఆమె కుటుంబము రక్షకునికి పరివర్తన చెంది, బాప్తీస్మము పొందారు.

ఆమె కుటుంబము కష్టపడి పనిచేసింది మరియు ముగ్గురు పిల్లలతో చేర్చబడి, అభివృద్ధి చెందసాగారు. వారు సంఘములో విశ్వాసముగా మరియు చురుకుగా ఉన్నారు. తరువాత, ఆమె భర్త ఊహించనిరీతిలో గుండె పోటుతో చనిపోయాడు, అది తన ఐదుగురు పిల్లలకు గృహము మరియు విద్యను అందించడానికి అనేక సంవత్సరాలు రెండు ఉద్యోగాలు చేయడానికి ఆమె బలవంతం చేయబడింది.

ఆమె కుటుంబంలో కొందరు మరియు పొరుగువారు ఆమెను విమర్శించారు. ఒక క్రైస్తవ సంఘములో చేరడానికి ఆమె తీసుకొన్న నిర్ణయంపై ఆమె ఇబ్బందులను నిందించారు. లోతైన విషాదం, కఠినమైన విమర్శలచేత నిరుత్సాహపడకుండా, ఆమె యేసు క్రీస్తునందు తన విశ్వాసమును పట్టుకొన్నది, దేవుడు ఆమెను ఎరుగునని, సంతోషకరమైన రోజులు ముందున్నాయని నమ్ముతూ ముందుకు త్రోసుకొని వెళ్ళడానికి తీర్మానించుకున్నది.3

ఆమె భర్త యొక్క అకాల మరణము తరువాత కొన్ని సంవత్సరాలకు, జపానులో మిషను అధ్యక్షుడు డేవాలయానికి హాజరు కావడం వైపు పని చేయమని జపాను సభ్యులను ప్రోత్సహించడానికి ప్రేరేపించబడ్డాడు. మిషను అధ్యక్షుడు ఒకినావా యుద్ధంలో అమెరికన్ అనుభవజ్ఞుడు, దానిలో ఈ ఒకినావా సహోదరి, ఆమె కుటుంబంలో చాలా బాధలను అనుభవించింది.4 అయినప్పటికినీ, వినయముగల సహోదరి అతడిని గూర్చి అన్నది: “అతను అప్పుడు మేము ద్వేషించే శత్రువులలో ఒకడు, కానీ ఇప్పుడు అతను ప్రేమ మరియు శాంతి సువార్తతో ఇక్కడ ఉన్నాడు. ఇది నాకు, ఒక అద్భుతము.”5

మిషను అధ్యక్షుని సందేశము విన్న తరువాత, విధవరాలైన సహోదరికి ఏదో ఒకరోజు దేవాలయంలో తన కుటుంబంతో బంధింపబడాలని కోరుకున్నది. అయినప్పటికినీ, ఆర్ధిక నిర్భంధాలు, భాషా ఆటంకాల వలన, అది ఆమెకు అసాధ్యమైనది.

అప్పుడు కొన్ని క్రొత్త పరిష్కారాలు కనపించాయి. జపాన్‌లోని సభ్యులు ఎక్కువమంది ప్రయాణం చేయని సమయంలో హవాయికి వెళ్లేందుకు మొత్తం విమానాన్ని అద్దెకు తీసుకుంటే ఖర్చు సగానికి తగ్గుతుంది.6 ఖర్చును భర్తీ చేయడంలో సహాయపడటానికి, సభ్యులు జపాను పరిశుద్ధులు పాడుతున్నారు అనే పేరుతో వినైల్ రికార్డ్‌లను రికార్డు చేసి విక్రయించారు. కొందరు సభ్యులు గృహాలను కూడా అమ్మేసారు. మిగిలిన వారు ప్రయాణించడానికి వారి ఉద్యోగాలను మానేసారు.7

సభ్యులకు మరొక సవాలు దేవాలయ సమర్పణ జపాను భాషలో లభ్యముగా లేదు. ఎండోమెంట్ ఆచారక్రియను అనువదించడానికి హవాయి దేవాలయానికి ప్రయాణించడానికి ఒక జపాను సహోదరుడిని సంఘ నాయకులు పిలిచారు.8 విశ్వాసులైన అమెరికా సైనికుల చేత బోధించబడి, బాప్తీస్మము పొందిన అతడు యుద్ధము తరువాత మార్పు చెందిన మొదటి వ్యక్తి.9

హవాయిలో నివసిస్తూ, వరము పొందిన సభ్యులు అనువాదము మొదట విన్నప్పుడు, వారు దుఃఖించారు. ఒక సభ్యుడు ఇలా వ్రాసాడు: “మేము దేవాలయానికి అనేకనేక సార్లు వెళ్ళాము. మేము ఆచారక్రియలను ఆంగ్లములో విన్నాము. [కానీ] ఇప్పుడు మేము మా స్వభాషలో [దానిని] విన్నప్పుడు … దానిని అనుభవించినట్లుగా దేవాలయ కార్యము యొక్క ఆత్మను ఎన్నడూ అంతగా మేము అనుభూతిచెందలేదు.”10

అదే సంవత్సరం తరువాత, 161 మంది పెద్దలు మరియు పిల్లలు టోక్యో నుండి హవాయి దేవాలయానికి వెళ్లేందుకు బయలుదేరారు. ఒక జపనీయ సహోదరుడు ఈ ప్రయాణం గురించి ఇలా ఆలోచించాడు: “నేను విమానంలోంచి బయటికి చూస్తూ పెర్ల్ హార్బర్‌ని చూసినప్పుడు, డిసెంబర్ 7, 1941న ఈ ప్రజలకు మన దేశం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే, నేను చాలా భయపడ్డాను. వాళ్లు మమ్మల్ని అంగీకరిస్తారా? నా ఆశ్చర్యానికి వారు నా జీవితంలో ఎప్పుడూ చూడని గొప్ప ప్రేమను మరియు దయను చూపించారు.”11

చిత్రం
జపనీయ పరిశుద్ధులు పూలదండలతో స్వాగతమివ్వబడ్డారు.

చేరుకున్న తర్వాత, హవాయి సభ్యులు జపనీయ పరిశుద్ధులకు లెక్కలేనన్ని పూలదండలతో స్వాగతం పలికారు, అదే సమయంలో జపనీయ సంస్కృతికి క్రొత్తదైన ఆచారము, ఆలింగనం మరియు బుగ్గలపై ముద్దులు ఇచ్చిపుచ్చుకున్నారు. హవాయిలో మార్పు చెందిన 10 రోజులు గడిపిన తర్వాత, జపనీయ పరిశుద్ధులు హవాయి పరిశుద్ధులు పాడిన “అలోహా ఓ” యొక్క జాతుల నేపథ్యంలో వారి వీడ్కోలు పలికారు.12

జపాను సభ్యుల కొరకు ఏర్పాటు చేయబడిన రెండవ దేవాలయ ప్రయాణము విధవరాలైన ఒకినావా సహోదరిని కలిపియున్నది. ఆమె తన బ్రాంచిలో సేవ చేసిన మిషనరీల ఉదారమైన బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె 10,000-మైలు (16,000-కిమీ) ప్రయాణం చేసింది. దేవాలయంలో ఉండగా, ఆమె తన తల్లి బాప్తీస్మానికి ప్రతినిధిగా ఉండి మరియు చనిపోయిన తన భర్తతో బంధింపబడినప్పుడు ఆమె ఆనందబాష్పాలు కార్చింది.

1980లో టోక్యో జపాను దేవాలయం సమర్పించబడే వరకు జపాను నుండి హవాయి వరకు దేవాలయ విహారయాత్రలు క్రమం తప్పకుండా కొనసాగాయి, ఇది ఉపయోగంలో ఉన్న 18వ దేవాలయంగా మారింది. ఈ సంవత్సరం నవంబరులో, జపానులో ఒకినావోలో 186వ దేవాలయము సమర్పించబడుతుంది. ఇది ఈ మహిళ మరియు ఆమె కుటుంబం ఆశ్రయం పొందిన సెంట్రల్ ఒకినావాలోని గుహ నుండి దగ్గరలో ఉంది.13

నేను ఒకినావా నుండి ఈ అద్భుతమైన సోదరిని ఎప్పుడూ కలవనప్పటికినీ, ఆమె వారసత్వం ఆమె నమ్మకమైన సంతానం ద్వారా కొనసాగుతుంది, వీరిలో అనేకమందిని నేను ఎరిగి ప్రేమిస్తున్నాను.14

పసిఫిక్‌లో రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవజ్ఞుడైన మా నాన్న, ఒక యౌవన మిషనరీగా జపాన్‌లో సేవ చేయమని నాకు పిలుపు వచ్చినప్పుడు చాలా సంతోషించారు. టోక్యో దేవాలయం ప్రతిష్ఠించబడిన స్వల్పకాలంలోనే నేను జపాన్ చేరుకున్నాను మరియు దేవాలయం పట్ల వారి ప్రేమను ప్రత్యక్షంగా చూశాను.

ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క విశ్వాసులైన శిష్యులకు మన పరలోక తండ్రి నుండి వరములు దేవాలయ నిబంధనలు. దేవాలయము ద్వారా, మన పరలోక తండ్రి వ్యక్తులు మరియు కుటుంబాలను రక్షకునికి మరియు ఒకరినొకరికి బంధిస్తున్నారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గత సంవత్సరం ప్రకటించారు:

“బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసి—మరియు వాటిని పాటించే—ప్రతీవ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు.

“దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి—మన శ్రమలు, శోధనలు మరియు బాధలను సరిగా ఎదిరించడానికి మనల్ని బలపరిచే శక్తి. ఈ శక్తి మన మార్గాన్ని సులువుగా చేస్తుంది.”15

దేవాలయ దీవెనల ద్వారా, వ్యక్తులను, కుటుంబాలను, మరియు రాజ్యాలను—ఒకసారి బద్ధ శత్రువులుగా ఉన్న వారిని కూడా రక్షకుడు స్వస్థపరచును. పునరుత్థానుడైన ప్రభువు మోర్మన్ గ్రంథములో సంఘర్షణతో కూడిన సమాజానికి, ఆయన నామమును ఘనపరచు వారందరికి ఇలా ప్రకటించారు, “నీతి యొక్క కుమారుడు తన రెక్కల యందు స్వస్థతతో లేచును.”16

“సముద్ర ద్వీపములలో”18 ఉన్నవారిని కలిపి “రక్షకుని యొక్క జ్ఞానము ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలందరి మధ్య వ్యాపించు సమయము వచ్చుననే”17 ప్రభువు యొక్క వాగ్దానము యొక్క కొనసాగుతున్న నెరవేర్పును చూచుటకు నేను కృతజ్ఞతను కలిగియున్నాను.

రక్షకుడైన యేసు క్రీస్తు గురించి మరియు ఈ కడవరి దినాలలో ఆయన ప్రవక్త, అపొస్తులుల గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. భూమి మీద బంధింపబడినది పరలోకంలో బంధించుటకు పరలోక శక్తి గురించి నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను.

ఇది రక్షకుని యొక్క కార్యము, మరియు దేవాలయాలు ఆయన పరిశుద్ధ మందిరము.

తిరుగులేని దృఢ విశ్వాసముతో, ఈ సత్యముల గురించి నా సాక్ష్యమును యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. హాంగ్ కాంగ్‌లోని ఈ అందమైన దేవాలయాన్ని 1919, మేలో అధ్యక్షులు హెబెర్ జె. గ్రాంట్ చేత ప్రతిష్ఠించబడింది. ఒక అపొస్తులునిగా, ఆయన 1901 లో జపానులో సంఘాన్ని ప్రారంభించారు. అది పని చేస్తున్న ఐదవ దేవాలయము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల బయట కట్టబడిన మొదటి దేవాలయము.

  2. మార్చి 2, 2023 నాటికి, అక్కడ స్మారక చిహ్నంపై 241,281 పేర్లు చెక్కబడి ఉన్నాయి.

  3. Gordon B. Hinckley, “Keep the Chain Unbroken” (Brigham Young University devotional, Nov. 30, 1999), 4, speeches.byu.edu చూడండి

  4. ఒకినావా యుద్ధంలో డ్వేన్ ఎన్. ఆండర్సన్ గాయపడ్డాడు. అతడు 1962 నుండి 1965 వరకు జపాన్‌లో మిషను అధ్యక్షునిగా సేవ చేసాడు, మరియు 1980 నుండి 1982 వరకు టోక్యో జపాన్ దేవాలయానికి మొదటి అధ్యక్షుడిగా సేవ చేసాడు.

  5. నేను మరియు నా భార్య టోక్యోలో మిషను నాయకులుగా పనిచేస్తున్నప్పుడు నేను ఆమె కుటుంబ సభ్యులను కలిశాను. వారు ఆమె వ్యక్తిగత కుటుంబ చరిత్ర వృత్తాంతముల నుండి ఈ సమాచారాన్ని నాకు అందించారు.

  6. డ్వేన్ ఎన్. ఆండర్సన్, An Autobiography for His Posterity, 102–5, Church History Library, Salt Lake City. చూడండి

  7. డ్వేన్ ఎన్. ఆండర్సన్, 104 చూడండి.

  8. See Edward L. Clissold, “Translating the Endowment into Japanese,” Stories of the Temple in Lā‘ie, Hawai‘i, comp. Clinton D. Christensen (2019), 110–13.

  9. అనువాదకుడు, టాట్సుయ్ సాటో, 1946 జూలై 7న యుఎస్ సర్వీస్‌మెన్, సి. ఎలియట్ రిచర్డ్స్ ద్వారా బాప్తీస్మము పొందారు. టాట్సుయ్ భార్య, చియో సాటో, అదేరోజు బాయిడ్ కె. పాకర్ చేత బాప్తీస్మము పొందింది. విడిగా, నీల్ ఎ. మాక్స్‌వెల్ ఒకినావా యుద్ధంలో పోరాడారు, మరియు శాంతి ఒప్పందం తర్వాత జపాన్‌లో ఒడ్డుకు వెళ్లిన మెరైన్‌ల మొదటి తరంగాలలో ఎల్. టామ్ పెర్రీ కూడా ఉన్నాడు. ఎల్డర్లు, పాకర్, మాక్స్‌వెల్, మరియు పెరీ పన్నెండుమంది అపొస్తలుల సమూహములో సభ్యులయ్యారు.

  10. In Clissold, “Translating the Endowment into Japanese,” 112.

  11. In Dwayne N. Andersen, “1965 Japanese Excursion,” Stories of the Temple in Lā‘ie, Hawai‘i, 114.

  12. See Andersen, “1965 Japanese Excursion,” 114, 117.

  13. అక్టోబర్ 2023 సర్వసభ్య సమావేశము యొక్క ఈ సభలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒసాకా జపాన్ దేవాలయం, సహా 20 కొత్త దేవాలయాలను ప్రకటించారు, ఇది జపాన్‌లో ఐదవ దేవాలయం

  14. 2018 నుండి 2021 వరకు టోక్యోలో మా మిషను సమయంలో, కోవిడ్ మహమ్మారి సవాళ్ల మధ్య, ఆమె కుటుంబం నా పట్ల మరియు నా కుటుంబం పట్ల ప్రేమ మరియు సంరక్షణను అందించింది, దీనికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము.

  15. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవ. 2022, 96.

  16. 3 నీఫై 25:2.

  17. మోషైయ 3:20.

  18. 2 నీఫై 29:7.