సర్వసభ్య సమావేశము
దేవుని పిల్లల నిత్య గుర్తింపు ద్వారా దేవుని కుటుంబాన్ని చూడడం
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దేవుని పిల్లల నిత్య గుర్తింపు ద్వారా దేవుని కుటుంబాన్ని చూడడం

విశ్వాసం యొక్క కంటితో, మనల్ని మరియు మన కుటుంబాలను ఆశతో మరియు ఆనందంతో చిన్నవి చేసి, వీక్షించగలమని నేను నమ్ముతున్నాను.

మా చిన్న కుమార్తె బర్కిలీ చిన్నగా ఉన్నప్పుడు, నేను చదివే కళ్లద్దాలు ఉపయోగించడం ప్రారంభించాను―అన్నిటినీ జూమ్ ఇన్ చేసి పెద్దవిగా చూపే రకం. ఒక రోజు, మేము కలిసి ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఆమెను ప్రేమతోపాటు విచారంగా కూడా చూశాను, ఎందుకంటే అకస్మాత్తుగా ఆమె మరింత పెద్దదిగా అనిపించింది. నేను అనుకున్నాను, “సమయం ఎక్కడికి పోయింది? ఈమె చాలా పెద్దదైపోయింది!”

కన్నీటిని తుడిచివేయడానికి నా కళ్లద్దాలను పైకి ఎత్తినప్పుడు, నేను గ్రహించాను, “ఓహ్ ఆగండి—ఆమె పెద్దది కాదు; ఈ అద్దాలు అలా ఉన్నాయి! ఫర్వాలేదు!”

కొన్నిసార్లు మనం చూడగలిగేదంతా మనం ఇష్టపడే వారి యొక్క అతి దగ్గరి, పెద్ద దృశ్యం మాత్రమే. ఈ రాత్రి, దృశ్యం తగ్గించి, వేరే దృష్టితో చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను—పెద్ద చిత్రం, మీ పెద్ద కథనంపై దృష్టి సారించే నిత్య దృష్టితో.

మానవజాతి అంతరిక్షంలోకి ప్రవేశించిన సమయంలో, మానవరహిత రాకెట్‌లకు కిటికీలు లేవు. కానీ చంద్రుని వద్దకు అపోలో 8 మిషన్ ద్వారా వెళ్ళినప్పుడు, వ్యోమగాములు ఒక కిటికీని కలిగి ఉన్నారు. అంతరిక్షంలో తేలియాడుతున్నప్పుడు, వారు మన భూమిని చూసే శక్తికి ఆశ్చర్యపోయారు మరియు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఈ అద్భుతమైన చిత్రాన్ని తీశారు. వారి అనుభవానికి సొంత పేరు పెట్టేటంతటి శక్తివంతమైన సంచలనాన్ని ఆ వ్యోమగాములు అనుభవించారు: స్థూలదృష్టి ప్రభావం.

చిత్రం
భూమిని అంతరిక్షం నుండి చూసినట్లుగా.

NASA

క్రొత్త కోణం నుండి చూడటం ప్రతి దానిని మారుస్తుంది. ఒక అంతరిక్ష యాత్రికుడు ఇలా అన్నాడు, “మీరు ప్రతిదానిని నిర్వహించదగినదిగా భావించే పరిమాణానికి వస్తువులను ఇది తగ్గిస్తుంది. … మనము దీనిని చేయగలము. భూమిపై శాంతి—సమస్యే కాదు. ఇది జనులకు ఆ రకమైన సామర్థ్యమునిస్తుంది … ఆ రకమైన శక్తినిస్తుంది.”1

మానవులుగా, మనకు భూసంబంధమైన దృక్కోణం ఉంది, కానీ దేవుడు విశ్వం యొక్క గొప్ప అవలోకనాన్ని చూస్తారు. ఆయన సమస్త సృష్టిని, మనందరినీ చూస్తారు మరియు నిరీక్షణతో నిండి ఉన్నారు.

ఈ గ్రహం యొక్క ఉపరితలంపై నివసిస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నట్లుగా చూడటం ప్రారంభించడం సాధ్యమేనా—ఈ అవలోకన అనుభూతిని అనుభవించడం సాధ్యమేనా? విశ్వాసం యొక్క కంటితో, మనల్ని మరియు మన కుటుంబాలను ఆశతో మరియు ఆనందంతో చిన్నవి చేసి, వీక్షించగలమని నేను నమ్ముతున్నాను.

లేఖనముల ప్రకారం “దృఢమైన” విశ్వాసము గలవారు అనేకులుండిరి, వారి గురించి మొరోనై మాట్లాడాడు, వారు “విశ్వాసపు కంటితో చూచి … వారు తమ కన్నులతో యథార్థముగా చూచి సంతోషించిరి.”2

రక్షకునిపై దృష్టి కేంద్రీకరించడంతో, వారు ఆనందాన్ని అనుభవించారు మరియు క్రీస్తు వలన ప్రతిదీ పని చేస్తుందనే సత్యాన్ని తెలుసుకున్నారు. మీరు చింతిస్తున్న ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది! విశ్వాసపు కంటితో చూసే వారు ఇప్పుడు అది సరిగ్గా జరుగుతుందని భావించవచ్చు.

నేను గొప్ప ఎంపికలు చేయనప్పుడు, ఉన్నత పాఠశాలలో నా సీనియర్ సంవత్సరంలో నేను చాలా నష్టాన్ని ఎదుర్కొన్నాను. మా అమ్మ ఏడుపు చూసి నేను ఆమెను నిరుత్సాహపరిచానా అని ఆశ్చర్యపోవడం నాకు గుర్తుంది. ఆ సమయంలో, ఆమె కన్నీళ్లు చూసి ఆమె నాపై ఆశను కోల్పోయిందని అర్థం చేసుకుని నేను ఆందోళన చెందాను, ఒకవేళ ఆమె నాపై ఆశను కోల్పోతే, బహుశా తిరిగి వచ్చే మార్గం లేదు.

కానీ మా నాన్న చిన్నవిగా చూడటం మరియు దూర దృష్టితో ఆలోచించడం సాధన చేశారు. ఆందోళన అనేది చాలామట్టుకు ప్రేమలాగా అనిపిస్తుంది, కానీ అది కానే కాదు అని మా నాన్న అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు.3 అంతా బాగవుతుందని చూడటానికి ఆయన విశ్వాసపు కన్ను ఉపయోగించారు మరియు ఆయన నిరీక్షణా విధానం నన్ను మార్చివేసింది.

నేను హైస్కూల్ నుండి పట్టభద్రత పొంది BYUకి వెళ్లినప్పుడు, మా నాన్న నేను ఎవరో గుర్తు చేస్తూ ఉత్తరాలు పంపారు. ఆయన నన్ను ప్రోత్సహించు నాయకుడయ్యారు మరియు ప్రతిఒక్కరికీ ప్రోత్సహించు నాయకుడు కావాలి: “మీరు తగినంత వేగంగా పరిగెత్తడం లేదు,” అని మీకు చెప్పని వారు; మీరు చేయగలరని ప్రేమగా గుర్తు చేసేవారు కావాలి.

నాన్న లీహై కలను ఉదహరించారు. లీహై లాగా, కోల్పోయినట్లు భావించే మీ ప్రియమైన వారిని మీరూ వెంబడించరని ఆయనకి తెలుసు. “మీరున్న చోటనే నిలిచి వారిని పిలుస్తారు. మీరు వృక్షము వద్దకు వెళ్లి, చెట్టు వద్ద ఉండి, పండు తింటూ మీ ముఖంపై చిరునవ్వుతో, మీరు ఇష్టపడే వారిని పిలవడం కొనసాగిస్తారు మరియు పండు తినడం సంతోషకరమైన విషయం అని మాదిరి ద్వారా చూపుతారు!”4

నేను చెట్టు వద్ద నిలిచి పండు తింటూ చింతించి ఏడుస్తున్నప్పుడు, విచారంలో ఉన్నపుడు ఈ దృశ్యమాన చిత్రం నాకు సహాయం చేసింది; నిజంగా అది ఎంత ఉపయోగకరంగా ఉంది? బదులుగా, మనం ప్రస్తుతం ఉన్నదానికంటే మెరుగ్గా ఉండాలనే మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ మన సృష్టికర్తపై మరియు ఒకరిపై ఒకరం నిరీక్షణను పెంచుకుందాం.

ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ మరణించిన కొద్దిసేపటికే, అతని కొడుకును ఎక్కువగా ఏది కోల్పోయినట్లు భావిస్తున్నావని ఒక విలేఖరి అడిగాడు. అతను తన తల్లిదండ్రుల ఇంట్లో రాత్రి భోజనాలు అని చెప్పాడు, ఎందుకంటే అతను ఎప్పుడూ తన తండ్రి తనపై నమ్మకం ఉంచినట్లు భావించేవాడు.

మా వయోజన పిల్లలు తమ జీవిత భాగస్వాములతో ఆదివారం రాత్రి భోజనాల కోసం ఇంటికి వచ్చే సమయంలో ఆయన మరణించడం జరిగింది. వారంలో, నేను ఆదివారం వారికి గుర్తు చేయగలిగే విషయాల గురించి నా మనస్సులో జాబితాలను తయారు చేసుకుంటాను: “మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు మరింత సహాయం చేయడానికి ప్రయత్నించండి” లేదా “శ్రద్ధగా వినేవారిగా ఉండటం మర్చిపోవద్దు” వంటివి.

నేను సహోదరుడు మాక్స్‌వెల్ అభిప్రాయం చదివినప్పుడు, నేను జాబితాలను విసిరివేసి ఆ విమర్శనాత్మక స్వరాన్ని నిశ్శబ్దం చేసాను. నేను ప్రతీ వారం నా ఎదిగిన పిల్లలను చూసేది కొద్ది సమయమే కాబట్టి, వారు చేస్తున్న అనేక సానుకూల విషయాలపై దృష్టి కేంద్రీకరించాను. కొన్ని సంవత్సరాల తర్వాత మా పెద్ద కుమారుడు రాయన్ మరణించినప్పుడు, మేము కలిసి గడిపిన సమయం మరింత సంతోషంగా మరియు మరింత సానుకూలంగా ఉందని నేను కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నాను.

మనం ప్రియమైన వారితో సంభాషించే ముందు, “నేను చేయబోయేది లేదా చెప్పేది సహాయకారిగా ఉందా లేదా బాధ కలిగించేదిగా ఉందా” అని మనల్ని మనం ప్రశ్నించుకోగలమా? మన మాటలు మనకున్న మహాశక్తులలో ఒకటి మరియు కుటుంబ సభ్యులు పలక వంటివారు, “నా గురించి మీరు ఏమనుకుంటున్నారో వ్రాయండి!” అని మన ముందు నిలబడి అడుగుతారు. ఈ సందేశాలు, ఉద్దేశపూర్వకంగా ఉన్నా లేకున్నా, ఆశాజనకంగా మరియు ప్రోత్సాహకరంగా ఉండాలి.5

సమస్యలలో ఉన్నవారికి మీరు చెడ్డవారు అని చెప్పటం లేదా వారిని నిరాశపరిచేలా బోధించడం మన పని కాదు. అరుదైన సందర్భాల్లో సరిదిద్దమని మనకు ప్రేరేపణ రావచ్చు, కానీ చాలా తరచుగా మన ప్రియమైన వారికి వారు వినాలని కోరుకునే సందేశాలను మాటల్లో మరియు నిశ్శబ్ద విధానాల్లో తెలియజేద్దాం: ఉదాహరణకు “నువ్వు ఉన్నందున మా కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది.” “ఏమైనప్పటికీ నీ జీవితాంతం నువ్వు ప్రేమించబడతావు” వంటివి.

కొన్నిసార్లు మనకు సలహా కంటే సానుభూతి; బోధించేవారి కంటే ఎక్కువగా వినేవారు; “వారు ఇప్పుడు చెప్పినట్లు చెప్పడానికి నేను ఎలా భావించాలి?” అని విని, ఆశ్చర్యంగా అడిగేవారు అవసరం.

గుర్తుంచుకోండి, కుటుంబాలు దేవుడు ఇచ్చిన ప్రయోగశాల, ఇక్కడ మనము విషయాలను గమనిస్తాము, కాబట్టి తప్పులు మరియు తప్పుడు లెక్కలు సాధ్యం మాత్రమే కాదు గానీ సంభవించవచ్చు కూడా. మరియు మన జీవితాల ముగింపులో, ఆ సంబంధాలు, సవాలుతో కూడుకున్న ఆ క్షణాలు కూడా మనం రక్షకునిలా మారడానికి మనకు సహాయపడే విషయాలు అని మనం చూడగలిగితే అది ఆసక్తికరంగా ఉంటుంది కదా? ప్రతి కష్టమైన పరస్పర చర్య దేవుడు ఇష్టపడే విధంగా ఎలా ప్రేమించాలో తెలుసుకోవడానికి ఒక అవకాశం.6

మనము రక్షకుని వైపు తిరిగేటప్పుడు, మనము ఏ పాఠాలను నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామో వాటిని బోధించే శక్తివంతమైన సాధనంగా కుటుంబ సంబంధాలను యెంచి, సమస్యలను చిన్నవిగా చేసి చూద్దాం.

పతనమైన ప్రపంచంలో, పరిపూర్ణమైన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, కొడుకు లేదా కుమార్తె, మనవడు, గురువు లేదా స్నేహితుడిగా ఉండటానికి మార్గం లేదు, కానీ మంచి వ్యక్తిగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి.7 చెట్టు వద్ద ఉండి, దేవుని ప్రేమలో పాలుపంచుకొని, ఆ ప్రేమను పంచుదాం. మన చుట్టూ ఉన్న వ్యక్తులను లేవనెత్తడం ద్వారా, మనము వారితో కలిసి అభివృద్ధి చెందుతాము.

దురదృష్టవశాత్తు, పండు తినడం యొక్క జ్ఞాపకం సరిపోదు; వెలుగుతో నిండిన లేఖనాలను చదవటం ద్వారా, చీకటిని తరిమికొట్టడానికి మన సాధారణ ప్రార్థన శక్తివంతంగా మారే వరకు మనము మోకాళ్లపై ఉండటం ద్వారా మన దృష్టిని సరిచేసి, పరలోకానికి అనుసంధానించే మార్గాల్లో మనం మళ్లీ మళ్లీ పాలుపంచుకోవాలి. ఇలాంటప్పుడు హృదయాలు మృదువుగా మారతాయి మరియు దేవుడు చూసే విధంగా మనం చూడటం ప్రారంభిస్తాము.

ఈ అంత్యదినాల్లో, బహుశా మనం చేసే గొప్ప పని మన ప్రియమైన వారితో అంటే దుష్టలోకంలో జీవిస్తున్న మంచి వ్యక్తులతో కలసి ఉండటం కావచ్చు. మన నిరీక్షణ వారిని వారు చూసుకునే విధానాన్ని మారుస్తుంది మరియు వారు నిజంగా ఎవరో తెలియజేస్తుంది. మరియు ఈ ప్రేమ దృష్టి ద్వారా వారు ఏమి అవుతారో వారు చూస్తారు.

కానీ మనం లేదా మనకు ప్రియమైనవారు కలిసి ఇంటికి తిరిగి రావడం విరోధికి ఇష్టం ఉండదు. మనం కాలానికి మరియు పరిమిత సంవత్సరాలకు కట్టుబడి ఉన్న గ్రహం మీద జీవిస్తున్నందున,8 విరోధి మనల్ని తీవ్ర భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నిస్తాడు. మనం దగ్గరగా చూస్తున్నప్పుడు మన వేగం కంటే మన దిశ ముఖ్యమని చూడటం చాలా కష్టం.

గుర్తుంచుకోండి, “మీరు వేగంగా వెళ్లాలనుకుంటే, ఒంటరిగా వెళ్లండి. మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే, కలిసి వెళ్ళండి.”9 కృతజ్ఞతాపూర్వకంగా, మనం ఆరాధించే దేవుడు కాలానికి కట్టుబడి ఉండడు. మనకు ప్రియమైన వారు నిజంగా ఎవరో మరియు మనం నిజంగా ఎవరమో ఆయన చూస్తారు.10 కాబట్టి, మనం ఒకరితో ఒకరం సహనంగా ఉంటామని ఆశిస్తూ ఆయన మనతో సహనంగా ఉంటారు.

మన తాత్కాలిక నివాసం అయిన భూమి దుఃఖపు ద్వీపంలా అనిపించే సందర్భాలు—నేను ఒక కంటిలో విశ్వాసాన్ని, మరొక కంటిలో దుఃఖాన్ని కలిగియున్న క్షణాలు—ఉన్నాయని నేను ఒప్పుకుంటాను.11 మీకు ఈ అనుభూతి తెలుసా?

మంగళవారం నాడు నాకు ఈ విధంగా అనిపించింది.

దానికి బదులుగా, మన ప్రవక్త మన కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయని వాగ్దానం చేస్తున్నప్పుడు మనం ఆయన నమ్మకమైన వైఖరిని ఎంచుకోగలమా? మనము అలా చేస్తే, అల్లకల్లోలం పెరిగినప్పటికీ మన ఆనందం పెరుగుతుంది. మన పరిస్థితులతో సంబంధం లేకుండా ఇప్పుడు స్థూలదృష్టి ప్రభావాన్ని అనుభవించవచ్చని ఆయన వాగ్దానం చేస్తున్నారు.12

ఇప్పుడు విశ్వాసపు కంటితో, ఈ భూమి మీదకు రాకముందు కలిగి ఉన్న విశ్వాసాన్ని తిరిగి పొందగలము లేదా ప్రతిధ్వనించగలము. ఈ అనిశ్చిత క్షణం గతాన్ని చూస్తుంది, “మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయడానికి; అప్పుడు … నిశ్చయముతో నిలిచియుండడానికి”13 మనల్ని అనుమతిస్తుంది.

ప్రస్తుతం మీ జీవితంలో ఏదైనా కష్టంగా ఉందా, మీరు చింతిస్తున్నది పరిష్కరించబడలేదా? విశ్వాసం యొక్క కన్ను లేకుండా, దేవుడు విషయాలపై పర్యవేక్షణ కోల్పోయినట్లు అనిపించవచ్చు, అది నిజమేనా?

లేదా మీరు ఈ కష్టమైన సమయాన్ని ఒంటరిగా గడపబోతున్నారని లేదా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని మీకు ఎక్కువ భయంగా ఉండవచ్చు, అది నిజమేనా?

రక్షకుడు తన ప్రాయశ్చిత్తం కారణంగా, మీరు అనుభవించే ఏ పీడకలనైనా ఆశీర్వాదంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం ఆయనను ప్రేమించడానికి మరియు అనుసరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, “వేటితో [మనం] శ్రమలను అనుభవించామో అవన్నియు [మన] మేలుకొరకు, పనిచేయునని”14 “మార్చజాలని నిబంధనతో” ఆయన మనకు ఈ వాగ్దానం చేసారు. అవన్నియు.

మరియు మనం నిబంధన సంతానం కాబట్టి, ఇప్పుడు ఈ ఆశాజనక అనుభూతిని మనం కోరవచ్చు!

మన కుటుంబాలు పరిపూర్ణముగా లేనప్పటికీ, మనం ఇతరుల పట్ల మన ప్రేమను స్థిరంగా, మార్పులేని, ఏదేమైనా ఫర్వాలేదనే ప్రేమగా—మార్పుకు మద్దతిచ్చే మరియు ఎదుగుదలకు, తిరిగి రావడానికి అనుమతించే ప్రేమగా మార్చుకునే వరకు పరిపూర్ణం చేసుకోవచ్చు.

మన ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడం రక్షకుని కార్యము. ఇది ఆయన కార్యము మరియు ఆయన సమయపాలనైయున్నది. వారు ఇంటికి రాగల నిరీక్షణను మరియు హృదయాన్ని అందించడం మన కార్యము. “ఖండించడానికి మనకు [దేవుని] అధికారం గానీ, విమోచించడానికి ఆయన శక్తి గానీ లేవు, కానీ ఆయన ప్రేమను అమలు చేయడానికి మనకు అధికారం ఉంది.”15 అధ్యక్షులు నెల్సన్ కూడా మన తీర్పు కంటే ఇతరులకు మన ప్రేమ అవసరమని బోధించారు. “[మన] మాటలు మరియు చర్యలలో ప్రతిబింబించే యేసు క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమను వారు అనుభవించాలి.”16

ప్రేమ అనేది హృదయాలను మార్చే విషయం. ఇది అన్నింటికంటే స్వచ్ఛమైన ఉద్దేశ్యం మరియు ఇతరులు దానిని అనుభవించగలరు. 50 సంవత్సరాల క్రితం అందించబడిన ఈ ప్రవచనాత్మక మాటలను గట్టిగా పట్టుకుందాం: “ప్రయత్నం మానుకుంటే తప్ప ఏ ఇల్లు విఫలం కాదు.”17 నిశ్చయంగా, ఎవరు ఎక్కువగా, దీర్ఘకాలం ప్రేమిస్తారో వారే గెలుస్తారు!

భూసంబంధమైన కుటుంబాలలో, దేవుడు మనతో చేసినదానిని మనము చేస్తున్నాము—వారు ప్రయాణించే మార్గాన్ని ఎన్నుకోవడం వారి బాధ్యత అని తెలిసీ మార్గాన్ని సూచిస్తున్నాము మరియు మనకు ప్రియమైనవారు ఆ దిశలో వెళ్తారని ఆశిస్తున్నాము.

మరియు వారు తెర అవతలి వైపుకు వెళ్లి, పరలోకపు ఇల్లు యొక్క ఆ ప్రేమగల గురుత్వాకర్షణకి దగ్గరగా వచ్చినప్పుడు,18 అది సుపరిచితమై, ఇక్కడ వారు ఎలా ప్రేమించబడ్డారో అలా ఉంటుందని నేను నమ్ముతున్నాను.

స్థూలదృష్టి‌ని ఉపయోగించి, ఈ అందమైన గ్రహం మీద మనం ఇష్టపడే మరియు మనతో కలిసి జీవించే వ్యక్తులను భాగస్వామ్య సహచరులుగా చూద్దాం.

మీరు మరియు నేను? మనము దీనిని చేయగలము! మనం పట్టుకోగలము మరియు ఆశతో ఉండగలము! మనం చెట్టు వద్ద ఉండగలము, మన ముఖంపై చిరునవ్వుతో పండ్లను తినగలం మరియు మన కళ్ళలో ఉన్న క్రీస్తు యొక్క కాంతిని వారి చీకటి సమయాల్లో వారు గుర్తుంచుకోగలిగేలా మారనివ్వగలం. వారు మన ముఖాల్లో వెలుగు ప్రత్యక్షపరచబడడాన్ని చూసినప్పుడు, వారు దాని వైపుకు ఆకర్షించబడతారు. అప్పుడు, ప్రేమ మరియు కాంతి యొక్క మూలమైన “ప్రకాశమానమైన వేకువ చుక్క” అయిన యేసు క్రీస్తుపై వారి దృష్టిని మళ్ళీ మరలించేలా మనం సహాయం చేయగలము.19

అన్నీ—ఇవన్నీ—మనం ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా మారబోతున్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను! యేసు క్రీస్తునందు విశ్వాసంతో, చివరికి అంతా బాగానే ఉంటుందని మనం చూద్దాం మరియు ఇప్పుడు అది సవ్యంగా ఉంటుందని భావిద్దాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.