సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పించుట నా విశేషావకాశము.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, సాధారణమైన విధానములో మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవలెనని మేము అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బాల్లర్డ్‌లను మనము ఆమోదించవలెనని ప్రస్తావించబడినది.

సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులిసెస్ సోరెస్.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, దానిని సూచించవచ్చును.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.

ముందుగా ప్రకటించబడినట్లుగా, ప్రధాన అధికారి డెబ్బదిగా సేవ చేయడానికి అలెగ్జాండర్ దూషకుకు మేము ఒక పిలుపును పొడిగించాము.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించండి.

అదే విధంగా ఈ సంవత్సరములో ఇతర ప్రాంతీయ డెబ్బదులు ఎవరైతే తమ సేవను పూర్తి చేస్తారో వారిని ప్రశంసాపూర్వకంగా గుర్తిస్తున్నాము మరియు వారి పేర్లు సంఘ వెబ్‌సైట్‌లో చూడగలరు.

వారి అత్యుత్తమ సేవ కొరకు మాతో కలిసి ఈ సహోదరులకు ప్రశంశను తెలుపగోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

ఈ వారము ప్రారంభంలో, వార్తలలో ప్రకటించబడిన ఇద్దరు క్రొత్త ప్రాంతీయ డెబ్బదులతో కలిపి, ఇతర ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రస్తుతము నియమించబడిన ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడినది.

సమ్మతించు వారందరు, పైకెత్తబడిన చేతితో తెలియజేయవచ్చును.

వ్యతిరేకించు వారెవరైనా.

సహోదర సహోదరీలారా, సంఘ నాయకత్వము తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

రోజర్ బోస్చి మరియు కిర్ట్ ఎల్. హోడ్జెస్

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

హెన్రీ జె. ఐరింగ్ మరియు యంగ్ జూన్ క్వాన్.