సర్వసభ్య సమావేశము
ఒక హీరో కంటే ఎక్కువ
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


హీరో కంటే ఎక్కువ

యేసు క్రీస్తు మన హీరో మాత్రమే కాదు, ఆయన మన ప్రభువు మరియు రాజు, మానవజాతి రక్షకుడు మరియు విమోచకుడు.

1856 నుండి 1860 వరకు, వేలాది మంది కడవరి దిన పరిశుద్ధుల అగ్రగాములు సాల్ట్ లేక్ వ్యాలీకి ప్రయాణిస్తున్నప్పుడు 1,000 మైళ్లకు (1,600 km) పైగా చేతి బండ్లలలో తమ వస్తువులను లాగారు. నూట అరవై ఏడు సంవత్సరాల క్రితం, ఈ వారం 1856, అక్టోబర్ 4 న,ఎడ్వర్డ్ మార్టిన్ మరియు జేమ్స్ విల్లీ నేతృత్వంలోని రెండు చేతి బండ్ల కంపెనీలు ఇప్పటికీ సాల్ట్లేక్ నుండి వందల మైళ్ల దూరంలో ఉన్నాయని, శీతాకాలం వేగంగా వస్తోందని తెలుసుకుని అధ్యక్షుడు బ్రిగం యంగ్ ఆశ్చర్యపోయారు.1 మరుసటి రోజు, అధ్యక్షుడు యంగ్ ఈరోజు మనము సమావేశమైన స్థలానికి దగ్గరలో, పరిశుద్ధుల ముందు నిలబడి ఇలా ప్రకటించారు: “మన సోదరులు మరియు సోదరీమణులలో చాలా మంది చేతి బండ్లతో మైదానాల్లో ఉన్నారు, మరియు వారిని ఇక్కడకు తీసుకురావాలి. … ఇప్పుడే వెళ్లి ఆ వ్యక్తులను మైదానంలోకి తీసుకురండి.”2

కేవలం రెండు రోజుల తర్వాత, మొదటి రక్షక బృందాలు చేతి బండ్ల అగ్రగాములను వెతకడానికి బయలుదేరాయి.

ప్రధాన రక్షక బృందం రాకముందు విల్లీ కంపెనీ సభ్యుడు నిరాశతో కూడిన పరిస్థితిని వివరించాడు. అతను ఇలా పంచుకున్నాడు: “అన్నీ కోల్పోయినట్లు కనిపించి మరియు జీవించడానికి స్వల్పము మిగిలియున్నట్లు అనిపించిన సమయములో, … స్పష్టమైన ఆకాశం నుండి పిడుగులా, దేవుడు మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. ఒక రక్షక బృందం, ఆహారం మరియు సామాగ్రిని తీసుకురావడం … కనుచూపు మేరలో కనిపించింది … మమ్మల్ని రక్షించినందుకు మేము దేవునికి ఏవిధముగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము.”3

ఈ రక్షకులు అగ్రగాములకు హీరోలుగా ఉన్నారు, విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సాధ్యమైనంత ఎక్కువ మందిని సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అలాంటి వారిలో ఎఫ్రాయిము హాంక్స్ ఒక హీరో.

అక్టోబరు మధ్యలో, చేతి బండ్ల కష్టాల గురించి తెలియక, హాంక్స్ ఒక పర్యటన తర్వాత సాల్ట్లేక్‌లోని తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, రాత్రి సమయంలో, అతను ఈవిధముగా పిలిచిన ఒక స్వరంతో మేల్కొల్పబడ్డాడు, “చేతి బండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మరియు మీరు కావలెను; మీరు వెళ్లి వారికి సహాయం చేస్తారా?”

ఆ ప్రశ్న అతని మనసులో మెదలడంతో, అతను సాల్ట్లేక్ పట్టణానికి త్వరత్వరగా తిరిగి వచ్చాడు. మరియు అధ్యక్షుడు హీబర్ సి. కింబల్ అదనపు స్వచ్ఛంద సేవకుల కోసం పిలుపునిచ్చిన మరుసటి రోజు, హాంక్స్ తనంతట తానుగా, కాపాడటానికి బయలుదేరాడు. వేగంగా కదులుతూ, అతను మార్గంలో ఇతర రక్షకులను అధిగమించాడు, మరియు మార్టిన్ కంపెనీకి చేరుకున్న తర్వాత, హాంక్స్ ఇలా గుర్తుచేసుకున్నాడు: “నేను వారి శిబిరంలోకి ప్రవేశించినప్పుడు నా కనుసన్నలలో కలిపించిన దృశ్యం ఎప్పటికీ నా జ్ఞాపకం నుండి తొలగించలేము … [మరియు] మార్టిన్ కంపెనీ దృశ్యాన్ని చూసి ధైర్యముగల వారు కూడ భావావేశానికి లోనవుతారు.”4

ఎఫ్రాయిము హాంక్స్ డేరా నుండి డేరాకు రోగులను ఆశీర్వదిస్తూ రోజులు గడిపాడు. అతను ఇలా వివరించాడు, “అనేక సందర్భాలలో, మేము రోగులకు మందులు ఇచ్చినప్పుడు మరియు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వ్యాధులను గద్దించినప్పుడు, బాధితులు ఒక్కసారిగా కూడి వస్తారు; వారు దాదాపు తక్షణమే స్వస్థత పొందుతారు.”5 ఎఫ్రాయిము హాంక్స్ ఆ చేతి బండి అగ్రగాములకు ఎప్పటికీ ఒక హీరోగా ఉంటాడు.

ఆ అద్భుతమైన రక్షించుట మాదిరిగానే, మన జీవితాలను మరియు చరిత్ర యొక్క గమనాన్ని కూడా ప్రభావితం చేసే సంఘటనలు తరచుగా పురుషులు మరియు మహిళలు—గొప్ప కళాకారులు, శాస్త్రవేత్తలు, వ్యాపార నాయకులు, మరియు రాజకీయ నాయకుల వ్యక్తిగత నిర్ణయాలు మరియు విజయాల ఫలితంగా ఉంటాయి. ఈ అసాధారణ వ్యక్తులు తరచుగా హీరోలుగా గౌరవించబడతారు, వారి అద్భుతకార్యములను గుర్తు చేసుకోవడానికి స్మారక చిహ్నాలు మరియు జ్ఞాపక చిహ్నాలు నిర్మించబడ్డాయి.

నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నా మొదటి హీరోలు క్రీడాకారులు. నా తొలి జ్ఞాపకాలు మేజర్ లీగ్ బేస్‌బాల్ ఆటగాళ్ల చిత్రాలు మరియు గణాంకాలతో బేస్ బాల్ కార్డ్‌లను సేకరించుట. చిన్నతనంలో “హీరోలను ఆరాధించుట” సరదాగా మరియు అమాయకంగా ఉంటుంది … పిల్లలు హాలోవీన్ కోసం తమ అభిమాన సూపర్ హీరోల వలె దుస్తులు ధరించడం వంటివి. అనేకమంది ప్రతిభావంతులైన మరియు విశేషమైన పురుషులు మరియు స్త్రీలను వారి సామర్థ్యాలు మరియు విరాళాల కోసం మనం మెచ్చుకున్నా, మరియు గౌరవించినప్పటికి, వారు ఎంతవరకు గౌరవించబడతారో, అది ఇశ్రాయేలు పిల్లలు సీనాయి ఎడారిలో బంగారు దూడను ఆరాధించడంతో సమానం.

పెద్దలుగా, రాజకీయ నాయకులు, బ్లాగర్లు, ప్రభావితం చేసేవారు, క్రీడాకారులు లేదా సంగీత విద్వాంసులు వంటి “హీరోలను ఆరాధించుట” వలన మనం “గుర్తుకు మించి” 6 కనిపించేలా చేసి, నిజంగా అవసరమైన వాటిని కోల్పోయేటప్పుడు, ఒకప్పటి అమాయకపు చిన్ననాటి వినోదం అడ్డంకిగా మారుతుంది.

ఇశ్రాయేలీయుల కోసం, వాగ్దానం చేయబడిన భూమికి వారి ప్రయాణంలో వారు తమతో తీసుకు వచ్చిన బంగారం సవాలు కాదు, కానీ వారు బంగారాన్ని ఒక విగ్రహంగా మారడానికి అనుమతించారు, అది వారి ఆరాధన వస్తువుగా మారింది. ఎర్ర సముద్రాన్ని చీల్చి, బానిసత్వం నుండి వారిని విడిపించిన యెహోవా నుండి వారి దృష్టిని మరల్చింది. దూడపైన వారి దృష్టి నిజమైన దేవుడిని ఆరాధించే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది.7

హీరో—మన హీరో ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ యేసు క్రీస్తే, మరియు ఆయన బోధనల నుండి మనల్ని దూరం చేసేది ఏదైనా, లేదా ఎవరైనా, లేఖనాల్లో మరియు సజీవ ప్రవక్తల మాటలలో కనుగొనబడినట్లు, నిబంధన మార్గంలో మన పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి పూర్వము, మనం అభివృద్ధి చెందడానికి మరియు ఆయనలాగా మారడానికి మనకు అవకాశాన్ని కలిగిచే పరలోక తండ్రి ప్రతిపాదించిన ప్రణాళిక సవాలు చేయబడిందని స్పష్టమైనప్పుడు, మనము యేసు క్రీస్తు వైపు చూశాము.

మన తండ్రి ప్రణాళికను సమర్థించడంలో యేసు క్రీస్తు నాయకుడు మాత్రమే కాదు, దానిని అమలుపరచడంలో కూడా ఆయన అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తారు ఆయన తండ్రికి ప్రతిస్పందించారు మరియు మనలో ప్రతి ఒక్కరు తమ స్వంతంగా చెల్లించలేని పాపము యొక్క రుణాన్ని చెల్లించడానికి “అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే,”8 సమర్పించుకొనుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

అధ్యక్షుడు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించినట్లుగా, “మన పరలోక తండ్రి ప్రణాళికలో పేర్కొన్న గమ్యం వైపు మర్త్యత్వము ద్వారా మన ప్రయాణానికి అవసరమైన ప్రతిదాన్ని యేసు క్రీస్తు చేసారు.”9

గెత్సేమనే తోటలో, అటువంటి బృహత్తరమైన కార్యమును ఎదుర్కొన్నప్పుడు, రక్షకుడు ధైర్యంగా ఇలా అన్నారు, “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” మరియు ఎప్పటికీ జీవించే లేదా జీవించిన వారందరి పాపాల కోసం నొప్పులు, వ్యాధులు మరియు బాధను తన పైకి స్వయంగా స్వీకరించారు.10 విధేయత మరియు నిబద్ధత యొక్క పరిపూర్ణ చర్యలో, యేసు క్రీస్తు సృష్టి అంతటిలో అత్యున్నతమైన వీరోచితమైన చర్యను ఆయన అద్భుతమైన పునరుత్థానంలో కలిపి పూర్తి చేసారు

మన ఇటీవలి సర్వసభ్య సమావేశములో, అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్ మనకు ఇలా గుర్తు చేశారు: “మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది. ఆయన ప్రాయశ్చిత్తము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన సిద్ధాంతము మరియు స్వస్థత, పురోగతి యొక్క పునస్థాపించబడిన ఆయన సువార్త గురించి మరింత నేర్చుకోండి. ఆయన వైపు తిరగండి! ఆయనను అనుసరించండి!”11 మరియు నేను, “ఆయనను ఎన్నుకోండి” అని జోడిస్తాను.

మన సంక్లిష్ట ప్రపంచంలో, జీవితం గందరగోళంగా లేదా అఖండంగా అనిపించినప్పుడు దానికి స్పష్టతని అందించే ప్రయత్నంలో సమాజం యొక్క వీరుల వైపు తిరగడం ఉత్సాహం కలిగిస్తుంది. మనము వారు మద్ధతునిచ్చే దుస్తులను కొనుగోలు చేస్తాము, వారు సమర్థించే రాజకీయాలను స్వీకరిస్తాము, మరియు సామాజిక మాధ్యమంలో పంచుకున్న వారి సూచనలను అనుసరిస్తాము. తాత్కాలిక మళ్లింపు కోసం ఇది మంచిది కావచ్చు, కానీ ఈ రకమైన హీరోల ఆరాధన మన బంగారు దూడ ఆరాధనగా మారకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సరియైన హీరోని ఎన్నుకోవడం శాశ్వతమైన పరిణామాలను కలిగియుంటుంది.

మిషను నాయకులుగా మా సేవను ప్రారంభించడానికి మా కుటుంబం స్పెయిన్‌కు చేరుకున్నప్పుడు, ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ నుండి మేము అనుసరించడానికి ఎంచుకున్న హీరోలకు సంబంధించిన ఒక ఫ్రేము కట్టబడిన వ్యాఖ్యను మేము కనుగొన్నాము. అతను ఇలా అన్నాడు, “మీరు మొదట దేవుని రాజ్యాన్ని ఎన్నుకోకపోతే, చివరికి మీరు ఎంచుకున్న దాని వలన ఎటువంటి తేడా ఉండదు” 12 సహోదరీ సహోదరులారా, రాజుల రాజు అయిన యేసు క్రీస్తును ఎన్నుకోవడం ద్వారా మనం దేవుని రాజ్యాన్ని ఎన్నుకుంటాము. ఏదైనా ఇతర ఎంపిక మాంసం యొక్క చేయి లేదా బంగారు దూడను ఎంచుకోవడంతో సమానం మరియు చివరికి అదే మనల్ని విఫలం చేస్తుంది.

పాత నిబంధన దానియేలు గ్రంథములో, షడ్రక్, మేషాక్ మరియు అబేద్‌నెగోల వృత్తాంతాన్ని మనం చదువుతాము, వీరికి ఏ హీరోని ఎంచుకోవాలో స్పష్టంగా తెలుసు-----మరియు అది రాజు నెబుకద్నెజరు దేవుళ్లలో ఎవరూ కాదు. వాళ్లు నమ్మకంగా ఇలా ప్రకటించారు:

“మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. …

ఒక వేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.”13

అపొస్తలుడైన పౌలు బోధించినట్లుగా, “దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు,”14 మరియు, మనం నమస్కరించడానికి, ఆరాధించడానికి మరియు ఆలింగనం చేసుకోవడానికి ఆహ్వానించబడ్డ అనేకమంది హీరోలు అని పిలవబడే వారిని నేను చేర్చవచ్చు. కానీ దానియేలు ముగ్గురు స్నేహితులకు తెలిసినట్లుగా, విడుదల చేయు హామీ ఇచ్చేవారు ఒక్కరు మాత్రమే ఉన్నారు-----ఎందుకంటే ఆయన ఇప్పటికే అలా చేశాడు మరియు ఎల్లప్పుడూ చేస్తారు.

మనము దేవుని సన్నిధికి అనగా మన వాగ్దాన భూమికి తిరిగి వెళ్లే ప్రయాణంలో, ఇది రాజకీయవేత్త, సంగీతకారుడు, క్రీడాకారుడు లేదా వ్లాగర్ సమస్య కాదు, బదులుగా మన శ్రద్ధను మరియు దృష్టిని మన రక్షకునిపై నిలుపకుండ ఆ స్థానంలో వారిని ప్రాథమిక అంశముగా మార్చడానికి ఎంచుకోవడం.

మనం ఇంట్లో ఉన్నా లేదా సెలవులో ఉన్నా ఆయన దినమును ఆయనను గౌరవించాలని ఎంచుకున్నప్పుడు యేసు క్రీస్తును ఎంచుకుంటాము. లేఖనాలు మరియు సజీవ ప్రవక్తల బోధల ద్వారా మనం ఆయన మాటలను ఎంచుకున్నప్పుడు ఆయనను ఎంచుకుంటాము దేవాలయ సిఫారసు కలిగియుండుట మరియు దాని ఉపయోగానికి తగిన యోగ్యతగా జీవించాలని ఎంచుకున్నప్పుడు మనం ఆయనను ఎన్నుకుంటాము. మనం శాంతి స్థాపకులుగా ఉన్నప్పుడు మరియు వివాదాస్పదంగా ఉండటానికి నిరాకరించినప్పుడు, “ప్రత్యేకించి మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు,” మనం ఆయనను ఎన్నుకుంటాము.15

ఏ నాయకుడు ఎన్నడూ ఎక్కువ ధైర్యం చూపించలేదు, ఏ మానవతావాది దయ చూపించలేదు, ఏ వైద్యుడు ఎక్కువ వ్యాధిని నయం చేయలేదు మరియు ఏ కళాకారుడు యేసు క్రీస్తు కంటే ఎక్కువ సృజనాత్మకతను చూపించలేదు.

మర్త్యమైన పురుషులు మరియు స్త్రీల అద్భుతకార్యములకు అంకితమైన స్మారక చిహ్నాలు మరియు మ్యూజియంలతో, హీరోల ప్రపంచంలో, ఇతరులందరి కంటే ఉన్నతమైన వ్యక్తి ఉన్నారు. యేసు క్రీస్తు మన హీరో మాత్రమే కాదు, ఆయన మన ప్రభువు మరియు రాజు, మానవజాతి రక్షకుడు మరియు విమోచకుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Studies devoted to the Willie and Martin handcart companies include LeRoy R. Hafen and Ann W. Hafen, Handcarts to Zion: The Story of a Unique Western Migration, 1856–1860 (1960); Rebecca Cornwall and Leonard J. Arrington, Rescue of the 1856 Handcart Companies (1981); Howard K. Bangerter and Cory W. Bangerter, Tragedy and Triumph: Your Guide to the Rescue of the 1856 Willie and Martin Handcart Companies, 2nd ed. (2006); and Andrew D. Olsen, The Price We Paid: The Extraordinary Story of the Willie Martin Handcart Pioneers (2006).

  2. బ్రిగం యంగ్ చేసిన” Deseret News, 1856 అక్టో. 15, 252.

  3. Journal History of The Church of Jesus Christ of Latter-day Saints, Aug. 28, 1862, 1901, Church History Library, Salt Lake City లో జార్జ్ ఎ. స్మిత్.

  4. జెన్సన్‌లో ప్రచురించబడిన ఎఫ్రైమ్ కె. హాంక్స్ కథనం, “Church Emigration,” The Contributor 14, no. 1893 (202 మార్చి), -3.

  5. జెన్సన్‌లో ప్రచురించబడిన హాంక్స్ కథనం, “Church Emigration,” 204.

  6. జేకబ్ 4:14

  7. నిర్గమకాండము 32 చూడండి.

  8. 1 తిమోతికి 2:6; మత్తయి 20:28 కూడా చూడండి.

  9. డాలిన్ హెచ్. ఓక్స్, “మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?,” లియహోనా, మే 2021, 75. చూడండి.

  10. లూకా 22:39-44 చూడండి.

  11. రస్సెల్ ఎమ్. నెల్సన్, “జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే,” లియహోనా,2023 మే.

  12. 18వ శతాబ్దపు ఆంగ్ల మతాధికారి విలియం లా ఆపాదించబడింది; నీల్ ఎ. మాక్స్‌వెల్, “Response to a Call,” లో కోట్ చేయబడింది ఎన్సైన్, May 1974.

  13. దానియేలు 3:13--18 చూడండి.

  14. 1 కొరింథీయులకు 8:5.

  15. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Peacemakers Needed,” లియహోనా, మే 2023, 98.