సర్వసభ్య సమావేశము
మన స్థిర సహచరుడు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మన స్థిర సహచరుడు

మీరు, నేను పరిశుద్ధాత్మను మన స్థిరమైన సహవాసిగా కలిగియుండే అవకాశాన్ని కలిగియున్నాము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సమావేశములో మనము సమృద్ధియైన బయల్పాటుతో ఆశీర్వదించబడ్డాము. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సేవకులు సత్యము, ప్రోత్సాహము, మరియు నడిపింపు మాటలను ప్రసంగించారు మరియు ప్రసంగిస్తారు.

పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఈ సమావేశంలో చెప్పబడిన సాక్ష్యముల ద్వారా నేను ముద్రవేయబడ్డాను. మనము ప్రార్థించి, ఆత్మ యొక్క ప్రేరేపణలను ఆలకించినప్పుడు, ముందున్న మిక్కిలి కష్టమైన రోజుల గుండా మనల్ని నడిపించడానికి మనము గొప్ప అంతర్‌జ్ఞానములను మరియు దీవెనలను పొందుతాము.

మరలా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా హెచ్చరించుట మనము విన్నాము, “రాబోవు దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపించే, దారిచూపే, ఆదరించే నిరంతర ప్రభావము లేకుండా, ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు.”1

మా పిల్లలు, మనుమలు, మరియు మా ముని-మనుమలు వారికి ముందున్న కష్టమైన రోజులలో ఆ ముఖ్యమైన నడిపింపును ఎలా కలిగియుండగలరో నేను ఏమి బోధించాలో ధ్యానించడానికి ఆ ప్రవచనాత్మక హెచ్చరిక నన్ను నడిపించింది.

ఈరోజు ఈ సందేశము రాబోయే ఉత్సాహకరమైన దినాలలో నేను వారితో ఉండనప్పుడు వారికి సహాయపడునట్లు నా సంతానముకు ఒక క్లుప్తమైన లేఖ. వారికి సహాయపడునట్లు నేను తెలుసుకొన్న దానిని వారు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

వారు జీవించబోయే రోజులలో పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన ప్రభావమును కలిగియుండటానికి వారికి ఏది అవసరమవుతుందో నేను సరిగా గ్రహించగలిగాను. మరియు ఈ రోజు నేను దాదాపు నాకు వీలైనంత వరకు, నా స్థిరమైన తోడుగా ఉండేందుకు పరిశుద్ధాత్మను ఆహ్వానించిన నా వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడాలని ప్రేరేపించబడినట్లు భావించాను. నేను వారిని ప్రోత్సహించగలనని నా ప్రార్థన.

నేను వారిని హీలమన్ కుమారులైన నీఫై మరియు లీహైలు వారితోపాటు సేవ చేస్తున్న ప్రభువు యొక్క మిగిలిన సేవకుల గురించి ఆలోచించుట మరియు ప్రార్ధించుటతో నేను వాటిని ప్రారంభిస్తాను. వారు భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వారు చెడ్డ స్థలములో సేవ చేస్తున్నారు మరియు వారు భయంకరమైన మోసాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. హీలమన్ గ్రంథములో నుండి ఒక వచనము నుండి నేను ధైర్యము పొందుతున్నాను, మీరు కూడ పొందగలరు.

“‘మరియు డెబ్బది తొమ్మిదవ సంవత్సరమందు అక్కడ ఎక్కువ కలహము ఉండుట మొదలాయెను. కానీ ఇది జరిగెను, నీఫై మరియు లీహై మరియు అనేక బయల్పాటులను ప్రతిరోజు పొందియుండి సిద్ధాంతము యొక్క సత్యమైన అంశములను గూర్చి ఎరిగిన వారి సహోదరులలో అనేకులు జనులకు వారు బోధించిరి, ఎంతగాననగా వారి కలహమునకు అదే సంవత్సరమందు వారు ఒక ముగింపు చేసిరి.”2

ఈ వృత్తాంతము నన్ను ప్రోత్సహించింది అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. హీలమన్ కుమారులు పరిశుద్ధాత్మతో అనేక అనుభవాల పరంపర ద్వారా బోధించబడ్డారు మరియు నడిపించబడ్డారు. మనము ఆత్మ నుండి మనకు అవసరమైన దానిని స్వీకరిస్తూ, వరుస వెంబడి వరస బోధించబడవచ్చని, నేర్చుకోవచ్చని మరియు ఇది నాకు అభయమిచ్చింది, మరియు మనము సిద్ధపడియున్నప్పుడు, మనము మరింత పొందుతాము.

లేబన్ పలకల కోసం యెరూషలేముకు తిరిగి వెళ్ళమని అడగబడిన నీఫై యొక్క వృత్తాంతము చేత అదేవిధంగా నేను ప్రోత్సహించబడ్డాను. అతడు చేసిన ఎంపిక మీరు జ్ఞాపకమున్నదా. అతడు చెప్పాడు: “నేను వెళ్ళి ప్రభువు ఆజ్ఞాపించిన కార్యములను చేయుదును.”3

ప్రభువునుండి వచ్చినవని నాకు తెలిసి నేను ప్రారంభించిన కార్యములు ఇంతకు ముందు చేసిన దానికంటే చాలా కష్టమైనవి, నేను సాధించగలనని అనుకున్న వాటికంటే చాలా కష్టమైన నియామకాలపై నేను ప్రయాణించినప్పుడు ఆ కార్యముపై పరిశుద్ధాత్మతో నీఫై యొక్క అనుభవము అనేకసార్లు నాకు ధైర్యము ఇచ్చింది.

నీఫై తన అనుభవం గురించి చెప్పినది మీకు గుర్తుందా: “మరియు రాత్రి అయ్యుండెను, మరియు నేను వారు తమను ప్రాకారము వెలుపల దాచుకొనునట్లు చేసితిని. మరియు వారు తమను తాము దాచుకొనిన తరువాత నీఫై అను నేను, పట్టణములోనికి జారుకొంటిని మరియు లేబన్ యొక్క ఇంటి వైపు ముందుకు సాగితిని.”

అతడు ఇంకా కొనసాగించాడు: “నేను చేయవలసిన క్రియలేమో ముందుగా ఎరుగక ఆత్మ చేత నడిపించబడితిని.”4

ప్రభువు యొక్క కార్యముపై రాత్రి అంతటా స్థిరంగా ఆత్మ చేత నీఫై నడిపించబడ్డాడని ఎరుగుట ద్వారా నేను ప్రోత్సహించబడ్డాను.

మనకు పరిశుద్ధాత్మ యొక్క స్తిరమైన సహవాసము అవసరము, మరియు మీకు అవసరము. ఇప్పుడు, మనము దానిని కోరతాము, అయినను అనుభవము ద్వారా మీకు తెలిసినట్లుగా దానిని చేయుట అంత సులభము కాదు. మనలో ప్రతిఒక్కరు అనుదిన జీవితాలలో మనం ఆలోచించేవి, మాట్లాడేవి, మరియు చేసే విషయాలు ఆత్మకు భంగం కలిగించవచ్చు.

అటువంటిది సంభవించినప్పుడు, మనc ప్రభువు నుండి నిరాకరణగా భావించవచ్చు. మనము ఒంటరివారిగా భావించడానికి శోధించబడవచ్చు. మనం ప్రతివారము పశ్చాత్తాపపడి, సంస్కారములో పాలుపంచుకున్నప్పుడు, “వారు ఎల్లప్పుడూ ఆయన ఆత్మను వారితో కలిగియుండునట్లు”5 మనము పొందే నిశ్చయమైన వాగ్దానము జ్ఞాపకముంచుకొనుట ముఖ్యమైనది.

ఈరోజు మీరు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని భావించినట్లైతే, ప్రాయశ్చిత్తము మీ జీవితములో పనిచేస్తుందని దానిని మీరు ఒక నిదర్శనంగా తీసుకొనవచ్చును.

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ చెప్పినట్లుగా: “మన జీవితాలలో అతి కష్టమైన సమయాలు కలిగినప్పుడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, లేదా ఆయన మన ప్రార్థనలు వినరనే భయానికి మనము లోబడకూడదు. ఆయన మనల్ని ఆలకించును. ఆయన మనల్ని చూస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు.”6

ఈ అభయము నాకు సహాయపడింది. నేను ప్రభువుకు దూరమైనట్లు భావించినప్పుడు, నా ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైనట్లు కనబడినప్పుడు, పశ్చాత్తాపపడటానికి అవకాశాల కోసం నా జీవితాన్ని పునఃసమీక్షించమన్న అధ్యక్షులు నెల్సన్ సలహాను అనుసరించడం నేను నేర్చుకున్నాను. ఆయన మనకు ఇలా జ్ఞాపకం చేసారు, “నిర్మలత్వమునకు మార్గము అనుదిన పశ్చాత్తాపము మరియు నిర్మలత్వము శక్తిని ఇస్తుంది.”7

పరిశుద్ధాత్మను అనుభవించుట మీకు కష్టమైనదిగా మీరు కనుగొన్న యెడల, మీరు పశ్చాత్తాపపడి, క్షమాపణ పొందాల్సినది ఏదైనా ఉన్నదా అని మీరు లోతుగా ధ్యానించవచ్చు.8 శుద్ధి చేయబడటానికి మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి విశ్వాసముతో మీరు ప్రార్థించవచ్చును, తద్వారా పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము కొరకు దాదాపుగా అర్హత పొందవచ్చు.

పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును పొందాలని మీరు కోరిన యెడల, మీరు దానిని సరైన కారణముల కొరకు తప్పక కోరాలి. మీ ఉద్దేశములు ప్రభువు యొక్క ఉద్దేశముగా ఉండాలి. మీ ప్రేరణలు చాలా స్వార్ధమైనవి అయితే, ఆత్మ యొక్క ప్రేరేపణలు పొందడం, గ్రహించడం మీరు కష్టమైనదిగా కనుగొంటారు.

నాకు, మీకు ముఖ్యమైనది రక్షకుడు కోరిన దానిని కోరడం. మన ప్రేరేపణలు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ చేత ప్రేరేపించబడాలి. మన ప్రార్థనలు “నేను కోరేదంతా మీరు కోరినట్లుగా ఉండాలి. మీ చిత్తము జరుగును గాక.”

రక్షకుని త్యాగమును మరియు నాకోసం ఆయన ప్రేమను జ్ఞాపకముంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. తరువాత, కృతజ్ఞతలు తెలపడానికి నేను పరలోక తండ్రికి ప్రార్థించినప్పుడు, నా ప్రార్థనలు ఆలకించబడినవని, మరియు నా కొరకు శ్రేష్టమైనది పొందుతాననే ప్రేమను, అభయాన్ని అనుభవిస్తున్నాను. అది నా సాక్ష్యమును బలపరుస్తుంది.

పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చే విషయాలన్నిటిలో, మనకు మిక్కిలి ప్రశస్తమైనది, యేసే క్రీస్తు, దేవుని యొక్క జీవిస్తున్న కుమారుడు. రక్షకుడు వాగ్దానమిచ్చారు: “తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.”9

కొన్ని సంవత్సరాల క్రితం, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక తల్లి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె తన కుమార్తై ఇంటికి దూరంగా వెళ్ళిపోయందని ఆమె నాతో చెప్పింది. ఆమె తన కుమార్తై తనతో మాట్లాడిన కొద్ది మాటలను బట్టి ఏదో భయంకరమైన తప్పు జరిగిందని ఆమె గ్రహించింది. ఆమెకు సహాయం చేయమని నన్ను వేడుకొన్నది.

ఆమె కుమార్తై యొక్క గృహ బోధకురాలు ఎవరో నేను కనుగొన్నాను. ఆ పేరును బట్టి అది చాలా కాలం క్రితమని మీరు చెప్పవచ్చును. నేను అతడికి ఫోను చేసాను. అతడు చిన్నవాడు. అయినప్పటికినీ అతడు, అతడి సహచరుడు రాత్రిపూట మేల్కొన్నామని, కుమార్తె పట్ల ఆందోళనతో మాత్రమే కాకుండా, ఆమె విచారం మరియు దుఃఖం కలిగించే ఎంపికలు చేయబోతోందని ప్రేరేపణతో అతడు నాతో చెప్పాడు. ఆ ఆత్మ యొక్క ప్రేరేపణతో, వారు ఆమెను చూడటానికి వెళ్ళారు.

మొదట ఆమె తన పరిస్థితి గురించి వారికి చెప్పాలని కోరలేదు. ప్రేరేపణ క్రింద, వారు ఆమెను పశ్చాత్తాపపడమని, ఆమె కొరకు ప్రభువు కలిగియున్న మార్గమును ఎంపిక చేయమని వారు వేడుకున్నారు. అప్పుడు ఆమె, తన జీవితం గురించి వారు తెలుసుకోగల విధానము దేవునినుండి మాత్రమేనని, ఆత్మ చేత గ్రహించిందని నేను నమ్ముతున్నాను. ఒక తల్లి తన ప్రియమైన చింతలను పరలోక తండ్రి మరియు రక్షకుని వైపు మరల్చుకున్నది. ఆ గృహబోధకులకు పరిశుద్ధాత్మ పంపబడింది ఎందుకనగా వారు ప్రభువుకు సేవ చేయడానికి సమ్మతిస్తున్నారు. వారు సిద్ధాంతము మరియు నిబంధనలలో కనుగొనబడిన సలహాను మరియు వాగ్దానమును అనుసరించారు.

“నీ ఆంత్రములు మనుష్యులందరి యెడల, విశ్వాస గృహము యెడల దాతృత్వముతో నిండనీయుము, నీ ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడనీయము; అప్పుడు నీ ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును; మరియు యాజకత్వపు సిద్ధాంతము ఆకాశమునుండి కురియు మంచుబిందువుల వలే నీ ఆత్మమీదకు దిగివచ్చును.

“పరిశుద్ధాత్మ నీ స్థిర సహచరునిగాయుండును, నీ దండము నీతి సత్యముల యొక్క మారని దండముగానుండును; నీ ఏలుబడి నిత్య ఏలుబడిగానుండును, బలవంతము లేకుండా నిరంతరము అది నీ యొద్దకు ప్రవహించును.”10

ప్రభువు తన వాగ్దానమును నెరవేర్చారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు సంఘము యొక్క విశ్వాసులైన నిబంధన సభ్యులకు పరిశుద్ధాత్మ పంపబడుతుంది. ఇప్పుడు, మీ అనుభవాలు ప్రత్యేకమైనవి, మీ విశ్వాసం మరియు మీ కోసం, మీరు ప్రేమించి, సేవ చేసే వారి కోసం బయల్పాటును స్వీకరించే సామర్థ్యానికి ఉత్తమంగా సరిపోయే విధంగా ఆత్మ నడిపిస్తుంది. మీ విశ్వాసము వృద్ధి చెందాలని నా పూర్ణ హృదయముతో నేను ప్రార్థిస్తున్నాను.

తండ్రియైన దేవుడు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ ప్రతీ ప్రార్థనను ఆలకిస్తాడు. మనల్ని నడిపించడానికి, ఆదరించడానికి, మరియు సత్యమును గూర్చి సాక్ష్యమివ్వడానికి పరిశుద్ధాత్మను పంపమని యేసు క్రీస్తు తండ్రికి ప్రార్థించారు. తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుడు జోసెఫ్ స్మిత్‌కు చెట్ల పొదలలో ప్రత్యక్షమయ్యారు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును దేవుని యొక్క వరము మరియు శక్తి చేత అనువదించాడు.

పరలోకపు రాయబారులు యాజకత్వపు తాళపు చెవులను పునఃస్థాపించారు. సమస్త భూమి కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవుని యొక్క ప్రవక్త.

యేసు క్రీస్తు యొక్క సాక్షిగా, ఆయన జీవిస్తున్నారని, ఆయన సంఘమును నడిపిస్తున్నారని నేనెరుగుదును. మీరు నేను పరిశుద్ధాత్మను మన స్థిరమైన సహచరునిగా కలిగియండటానికి మరియు మనం రక్షకుని జ్ఞాపకముంచుకొని, ప్రేమించినప్పుడు, పశ్చాత్తాపపడి, మన హృదయాలలో ఆయన ప్రేమను కలిగియుండనిమ్మని అడిగినప్పుడు ఆ సత్యములు నిర్ధారించబడటానికి అవకాశము కలిగియుంటాము. మనము ఈరోజు, మరియు మన జీవితాలలో ప్రతిరోజు ఆ దీవెనను మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కలిగియుండాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.