సర్వసభ్య సమావేశము
మనం ఆయన బిడ్డలము.
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మనం ఆయన బిడ్డలము.

మనము అదే దైవిక పుట్టుకను కలిగియున్నాము మరియు యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా అదే అపరిమితమైన సాధ్యతను కలిగియున్నాము.

ఇశ్రాయేలుకు క్రొత్త రాజును అభిషేకించడానికి యెష్షయి ఇంటికి ప్రవక్త సమూయేలును ప్రభువు పంపినప్పుడు అనుభవము మీకు గుర్తుందా? సమూయేలు యెష్షయి మొదటి పుత్రుడైన ఎలియాబును చూసాడు. ఎలియాబు, ఎత్తైనవాడు, మరియు ఒక నాయకుని రూపము కలిగియున్నాడు. సమూయేలు సరైన ఆధారము లేకుండా ఊహించాడు. అతడు ఊహించినది సరికాదు, మరియు ప్రభువు సమూయేలుకు బోధించాడు: “అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము; … మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”1

సౌలును దీవించడానికి ప్రభువు శిష్యుడైన అననీయను పంపినప్పుడు అనుభవము మీకు గుర్తుందా? సౌలు యొక్క ఖ్యాతి అతడికి ముందుగానే వెళ్ళింది, మరియు అననీయ సౌలు గురించి, అతడి క్రూరత్వము, పరిశుద్ధులను కనికరము లేకుండా హింసించుట విన్నాడు. అననీయ విన్నాడు మరియు సౌలుకు అతడు పరిచర్య చేయకూడదని త్వరగా ఊహించాడు. అతడి ఊహ సరికాదు, మరియు ప్రభువు అననీయకు బోధించాడు: “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.”2

ఈ రెండు సందర్భాలలో సమూయేలు మరియు అననీయకు గల ఇబ్బంది ఏమిటి? వారు తమ కన్నులతో చూసారు మరియు చెవులతో విన్నారు, ఫలితంగా, రూపము మరియు వినిన దానిపై ఆధారపడి వారు ఇతరులపై తీర్పు ఇచ్చారు.

వ్యభిచారములో పట్టబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు చూచినప్పుడు, వారు ఏవిధంగా చూసారు? చెడిపోయిన స్త్రీ, మరణానికి అర్హురాలైన పాపి. యేసు ఆమెను చూచినప్పుడు, ఆయన ఆమెను ఎలా చూసారు? శారీరక బలహీనతకు తాత్కాలికంగా లొంగిపోయిన ఒక స్త్రీ, కానీ పశ్చాత్తాపము మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా తిరిగి బలము పొందగలదు. పక్షవాతముతో రోగియైన సేవకుడుగల శతాధిపతిని జనులు చూసినప్పుడు, వారు ఎలా చూసారు? బహుశా వారు ఒక చొరబాటుదారుడు, ఒక విదేశీయుడు, తృణీకరించబడిన వానిగా వారు చూసారు. యేసు అతడిని చూసినప్పుడు, ఆయన అతడిని ఎలా చూసాడు? తన ఇంటి సభ్యుని శ్రేయస్సు కొరకు శ్రద్ధ వహించే వ్యక్తి, నిష్కపటముతో మరియు విశ్వాసముతో ప్రభువును వెదికిన వాడు. రక్తస్రావ రోగముతో ఉన్న స్త్రీని జనులు చూచినప్పుడు, వారు ఆమెను ఎలా చూసారు? బహుశా అపరిశుద్ధురాలైన స్త్రీ, వెలివేయబడాల్సిన బహిష్కృతురాలు. యేసు ఆమెను చూచినప్పుడు, ఆయన ఆమెను ఎలా చూసారు? అనారోగ్యంతో ఉన్న స్త్రీ, ఒంటరిగా మరియు ఆమె నియంత్రించలేని పరిస్థితుల కారణంగా పరాధీనురాలై, ఆమె స్వస్థత పొంది మరలా చేర్చబడాలని కావాలని ఆశించింది.

ప్రతి సందర్భములో, ప్రభువు ఈ వ్యక్తులను వారు ఏవిధంగా ఉంటారో చూసారు, మరియు ఆ ప్రకారము ప్రతిఒక్కరికి పరిచర్య చేసారు. నీఫై మరియు అతని సహోదరుడు జేకబ్ ప్రకటించినట్లుగా:

“ఆయన అందరిని తన వదకు రమ్మని ఆహ్వానించుచున్నాడు … , నల్లవాడిని, తెల్లవాడిని, దాసుని మరియు స్వతంత్రుని, పురుషుని, స్త్రీని, మరియు ఆయన అన్యులను జ్ఞాపకము చేసుకొనును; అందరూ దేవునికి ఒకేరీతిగా ఉన్నారు.”3

“ఒక జీవి ఆయన దృష్టిలో మరొకదానంత విలువైనదే.”4

మనం కూడా అదేవిధంగా మన కళ్ళు, చెవులు లేదా మన భయాలు మనల్ని తప్పుదారి పట్టించనివ్వకుండా, మన హృదయాలను మరియు మనస్సులను తెరిచి, ఆయన చేసినట్లుగా మన చుట్టూ ఉన్నవారికి ఉచితంగా పరిచర్య చేద్దాం.

కొన్ని సంవత్సరాల క్రితం, నా భార్య ఇసాబెల్లె అసాధారణమైన పరిచర్య నియామకము పొందింది. మా వార్డులో ఒక వృద్ధురాలైన స్త్రీ, ఆరోగ్య సవాళ్ళు గల ఒక సహోదరిని దర్శించమని ఆమె అడగబడింది, ఆమె ఒంటరితనము ఆమె జీవితంలోనికి కఠినత్వాన్ని తెచ్చింది. ఆమె కిటికీలు మూసివేయబడినవి; ఆమె అపార్టుమెంట్ కూరుకుపోయి ఉన్నది; ఆమె సందర్శించబడటానికి ఇష్టపడలేదు మరియు “నేను ఎవరికీ ఏమీ చేయలేను” అని స్పష్టము చేసింది. నిరుత్సాహపడని ఇసాబెల్లె ఇలా జవాబిచ్చింది, “అవును, ఉన్నది! మిమ్మల్ని దర్శించడానికి మమ్మల్ని అనుమతించుట ద్వారా మా కోసం మీరేదైనా చేయవచ్చు. మరియు ఆవిధంగా ఇసాబెల్లె, విశ్వసనీయంగా వెళ్ళింది.

కొంత కాలం తరువాత, ఈ మంచి సహోదరి కాలిపై శస్త్ర చికిత్త జరిగింది, దానికి ఆమెకు ప్రతిరోజు బ్యాండేజీలు మార్చాల్సినవసరమున్నది, అది ఆమె తనకై తాను చేసుకోలేనిది. కొన్ని రోజులు, ఇసాబెల్లె ఆమె ఇంటికి వెళ్ళింది, ఆమె పాదములు కడిగింది, మరియు ఆమె బ్యాండేజీలు మార్చింది. ఆమె ఎన్నడూ కురూపత్వాన్ని చూడలేదు; ఆమె ఎన్నడూ దుర్వాసనను పసిగట్టలేదు. ఆమె ప్రేమ మరియు మృదువైన సంరక్షణ అవసరత గల దేవుని యొక్క అందమైన కుమార్తైను మాత్రమే చూసింది.

సంవత్సరాలకు పైగా, నేను, లెక్కలేనంతమంది ఇతరులు ప్రభువు చూసినట్లుగా చూచె వరముగల ఇసాబెల్లె యొక్క వరము చేత దీవించబడ్డాము. మీరు స్టేకు అధ్యక్షులు లేదా వార్డులో పలుకరించే వారైనప్పటికిని, మీరు ఇంగ్లండ్ యొక్క రాజు లేక గుడిసెలో నివసించినా, మీరు ఆమె భాష లేదా వేరొక భాష మాట్లాడినప్పటికినీ, మీరు ఆజ్ఞలన్నీ పాటించినా లేదా కొన్నిటితో కష్టపడుతున్నప్పటికినీ, ఆమె తన శ్రేష్టమైన ప్లేట్లలలో మరియు తన ఉత్తమమైన భోజనాన్ని మీకు అందిస్తుంది. ఆర్ధిక స్తోమత, శరీరపు రంగు, సాంస్కృతిక నేపథ్యము, జాతీయత, నీతి స్థాయి, సామాజిక స్థితి, లేదా ఏదైనా ఇతర గుర్తింపు లేదా లేబుల్ ఆమెకు ముఖ్యమైనది కాదు. ఆమె తన హృదయముతో చూస్తుంది, ఆమె ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క బిడ్డను చూస్తుంది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు:

“అపవాది లేబుల్స్ నందు సంతోషిస్తాడు ఎందుకనగా అవి మనల్ని విభజిస్తాయి మరియు మన గురించి ఒకరినొకరి గురించి మనం ఆలోచించే విధానాన్ని పరిమితం చేస్తాయి. మనం ఒకరినొకరు గౌరవించడం కంటే లేబుల్‌లను గౌరవించడం ఎంత విచారకరం.

లేబుల్స్‌ తీర్పు తీర్చుట మరియు శత్రుత్వమునకు నడిపించగలదు. జాతి, లైంగిక ధోరణి, లింగబేధము, విద్యా సంబంధమైన డిగ్రీలు, సంస్కృతి,లేదా ఇతర ముఖ్యమైన నిర్దేశకముల కారణంగా ఇతరుల పట్ల ఏదైనా దుర్భాష లేదా దురభిమానము మన సృష్టికర్తకు అభ్యంతరకరమైనది!”5

ఫ్రెంచ్ అన్నది నేను కాదు; అది నేను పుట్టినచోటు. తెలుపు అనేది నేను కాదు; అది నా చర్మపు రంగు, లేదా అది లేకపోవడం. ప్రోఫెసరు అంటే నేను కాదు; నా కుటుంబాన్ని పోషించడానికి నేను చేసిన పని అది. ప్రధాన అధికారి డెబ్బది అంటే నేను కాదు; ఈ సమయమందు రాజ్యములో నేను సేవ చేస్తున్న చోటు.

“మొదటిది మరియు ప్రధానమైనది, అధ్యక్షులు నెల్సన్ మనకు జ్ఞాపకం చేసినట్లుగా, నేను “దేవుని యొక్క బిడ్డను.”6 మీరు దేవుని యొక్క బిడ్డగా ఉన్నారు; మరియు మన చుట్టూ ఉన్న వారందరూ ఆవిధంగా ఉన్నారు. ఈ అద్భుతమైన సత్యమును గూర్చి గొప్ప ప్రశంసను మనము పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. అది సమస్తమును మార్చివేస్తుంది!

మనము వేర్వేరు సంస్కృతులలో పెంచబడవచ్చు; మనము వివిధ సామాజిక ఆర్థిక పరిస్థితుల నుండి రావచ్చు; మన జాతీయత, చర్మం రంగు, ఆహార ప్రాధాన్యతలు, రాజకీయ ధోరణి మొదలైన వాటితో సహా మన మర్త్య వారసత్వం చాలా భిన్నంగా ఉండవచ్చు. కానీ మనమందరం మినహాయింపు లేకుండా ఆయన బిడ్డలం. మనము అదే దైవిక పుట్టుకను కలిగియున్నాము మరియు యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా అదే అపరిమితమైన సాధ్యతను కలిగియున్నాము.

సి. ఎస్. లూయీస్ ఈవిధంగా దానిని వివరించాడు: “సాధ్యమైన దేవుళ్ళు మరియు దేవతల సమాజంలో జీవించడం చాలా తీవ్రమైన విషయం, మీరు మాట్లాడగలిగే అత్యంత రసహీనమైన వ్యక్తి ఏదో ఒక రోజు ఒక జీవి కావచ్చు, మీరు చూసినట్లయితే ఇప్పుడు, మీరు ఆరాధించడానికి బలంగా శోదించబడతారు. … సామాన్యులు ఎవరూ లేరు. మీరు ఎన్నడూ కేవలము మర్త్యులతో మాట్లాడలేదు. రాజ్యములు, సంస్కృతులు, కళలు, నాగరికతలు—ఇవి మర్త్యమైనవి, మరియు వారి జీవితం, మనది దోమ జీవితం వంటిది. కానీ వారితో మనం సరదాగా ఉండేది, పని చేసేది, వివాహము చేసుకొనేది, కోపగించేది, మరియు దోచుకునేది అమర్త్యులను.”7

మా కుటుంబము వేర్వేరు దేశాలు, సంస్కృతులలో జీవించే విశేషావకాశాన్ని కలిగియున్నది; మా పిల్లలు వేర్వేరు స్వజాతీయులను వివాహము చేసుకోవడానికి దీవించబడ్డారు. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త గొప్ప సమానత్వ అవకాశాలను కల్పించేదని నేను గ్రహించగలిగాను. మనము దానిని నిజముగా హత్తుకున్నట్లుగా, “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.”8 ఈ అద్భుతమైన సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మరియు మరొకవిధంగా మనల్ని మన అనుబంధాలను బాధించే లేబుల్స్, భిన్నత్వాలు అన్నీ కేవలము “క్రీస్తుయందు హరించవేయబడినవి.”9 మనము అదేవిధంగా ఇతరులు “ఇకమీదట పరజనులును పరదేశులునైయుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులును దేవుని ఇంటివారునై యున్నాము.”10

మా బహుళ సాంస్కృతిక భాషా విభాగాలలో ఒక దాని బ్రాంచి అధ్యక్షుడు దీనిని, ఎల్డర్ గారిట్ డబ్ల్యు. గాంగ్ చేసినట్లుగా నిబంధనకు చెందిన అని సూచించుట నేను ఈమధ్య విన్నాను.11 ఇది ఎంత అందమైన భావన! రక్షకుని, వారి నిబంధనలను వారి జీవితాల యొక్క కేంద్రముగా చేసుకొని, సువార్తను సంతోషంగా జీవించడానికి ప్రయత్నించే జనులందరి గుంపుకు మనము చెందియున్నాము. కాబట్టి, మర్త్యత్వము యొక్క వక్రీకరించబడిన దృష్టికోణము ద్వారా ఒకరినొకరిని చూచుట కంటె మేలుగా, సువార్త గొప్ప దృష్టికోణముతో మనము విషయాలను చూచునట్లు చేస్తుంది మరియు మన పరిశుద్ధ నిబంధనల యొక్క దోషరహితమైన మార్పు చెందని దృష్టికోణము గుండా ఒకరినొకరిని చూచుటకు మనల్ని అనుమతిస్తుంది. ఆవిధంగా చేయడంలో, మనము ఇతరుల పట్ల మన స్వంత సహజమైన దురభిప్రాయాలు మరియు పక్షపాతములు తీసివేయడం ప్రారంభిస్తాము, ఒక అద్భుతమైన సుగుణమైన క్రమములో అది తిరిగి మన పట్ల వారి దురభిప్రాయాలు మరియు పక్షపాతములు తగ్గించడానికి వారికి సహాయపడతాయి.12 వాస్తవానికి, మన ప్రియమైన ప్రవక్త యొక్క ఆహ్వానమును మనము అనుసరిస్తాము: “నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం ఒకరినొకరం ఎలా ఆదరిస్తామనేది ముఖ్యమైనది! ఇంటివద్ద, సంఘములో, పని వద్ద మరియు ఆన్‌లైన్‌లో మనం ఇతరులతో మరియు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాము అనేది నిజంగా ముఖ్యమైనది. ఈరోజు, ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానంలో ఇతరులతో సంభాషించమని నేను మనల్ని అడుగుతున్నాను.”13

ఈ మధ్యాహ్నాకాలము, ఆ ఆహ్వానపు ఆత్మయందు, నేను మన అద్భుతమైన ప్రాధమిక పిల్లల ప్రతిజ్ఞకు నా ప్రతిజ్ఞను చేర్చాలని కోరుతున్నాను:

అనేకమంది ప్రవర్తించినట్లుగా మీరు చేయని యెడల,

కొందరు జనులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు,

కాని నేను చేయను! నేను చేయను!

అనేకమంది చేసినట్లుగా మీరు మాట్లాడని యెడల,

కొందరు జనులు మీ గురించి మాట్లాడి, నవ్వవచ్చు,

కాని నేను చేయను! నేను చేయను!

నేను మీతో నడుస్తాను. నేను మీతో నడుస్తాను.

ఆవిధంగా మీ పట్ల నా ప్రేమను తెలియజేస్తాను.

యేసు ఎవరి నుండి దూరముగా వెళ్ళిపోలేదు.

ఆయన తన ప్రేమను ప్రతిఒక్కరికి ఇచ్చారు.

కాబట్టి నేను ఇస్తాను! నేను ఇస్తాను!14

మన పరలోకమందున్న తండ్రిగా మనము పిలిచే ఆయన, వాస్తవానికి మన తండ్రి అని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని, ఆయన తన పిల్లలందరిలో ప్రతిఒక్కరిని సన్నిహితంగా ఎరుగునని, ఆయన ప్రతిఒక్కరి గురించి లోతుగా శ్రద్ధ వహిస్తున్నారని, మరియు మనమందరం ఆయనను పోలియున్నామని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఒకరినొకరిని చూసే విధానము ఆయన కుమారుడు, మన రక్షకుడైన, యేసు క్రీస్తు యొక్క అంతిమ త్యాగము మరియు ప్రాయశ్చిత్తము కొరకు మన జ్ఞానమును మరియు ప్రశంస యొక్క ప్రత్యక్ష సూచన. ఆయన వలె, మనము ఇతరులను ప్రేమించాలని నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకనగా అది చేయడానికి సరైన పని, వారు సరైన దానిని చేస్తున్నారని లేదా ఇతరులు “అనుకున్నవిధంగా” కనిపిస్తున్నారని కాదు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.