సర్వసభ్య సమావేశము
ఆ దినమున క్రీస్తునందు నిలిచియుండుము
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఆ దినమున క్రీస్తునందు నిలిచియుండుము

“ఆ దినమున నిలిచియుండటానికి” యేసు క్రీస్తు దానిని మనకు సాధ్యపరుస్తారు.

అది చాలా స్పష్టమైన, ప్రత్యక్షమైన ఉపమానాలతో, చిక్కైన ప్రశ్నలతో, మరియు లోతైన సిద్ధాంతముతో నిండిన రోజు. “సున్నము కొట్టిన సమాధులను పోలి యుండి, వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్న,”1 వారిని ఘాటుగా మందలించిన తరువాత, యేసు ఆత్మీయ సిద్ధపాటు మరియు శిష్యత్వము గురించి మరి మూడు ఉపమానాలను బోధించారు.వీటిలో ఒకటి పదిమంది కన్యకల ఉపమానము.

“పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.

వీరిలో అయిదుగురు బుద్ధిలేనివారు, అయిదుగురు బుద్ధిగలవారు.

బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని, తమతో పాటు నూనెను తీసికొనిపోలేదు:

కానీ బుద్ధిగల వారు తమ దివిటీలతో పాటు సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.

పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి.

అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.

అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని.

బుద్ధిలేని ఆ కన్యకలు లేచి మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారి నడిగిరి.

అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకుపోయి కొనుక్కొనుడని చెప్పిరి.

వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి: అంతట తలుపు వేయబడెను.”

“ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడిగెను.”2

“అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”3

“మనుష్యకుమారుడు వచ్చు ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”4

పెండ్లి కుమారుని రాకడకు సంబంధించి ఆలోచన రేకెత్తించే క్రింది ప్రశ్నలను అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ అడిగారు:5 “ఆయన రాకడ దినము రేపే అయితే? మన అకాల మరణము ద్వారా లేదా ఆయన ఊహించని రాకడ ద్వారా ప్రభువును మనము రేపే కలుసుకుంటామని ఎరిగిన యెడల—ఈరోజు మనము ఏమి చేస్తాము?”6

ప్రభువు యొక్క రాకడ కొరకు ఆత్మీయ సిద్ధపాటు ఆవశ్యకమైనది మాత్రమే కాదు కానీ నిజమైన శాంతి మరియు సంతోషాన్ని కనుగొనడానికి ఏకైక మార్గమని నేను వ్యక్తిగత అనుభవము నుండి నేర్చుకున్నాను.

“నీకు కాన్సరు ఉంది” అనే పదాలను నేను మొదటిసారి విన్నప్పుడు అది ప్రస్పుటమైన వసంతకాల దినము. నా భర్త, నేను దిగ్భ్రాంతి చెందాము! ఆ వార్తను జీర్ణించుకొంటూ మౌనంగా మేము ప్రయాణిస్తున్నప్పుడు, నా హృదయం మా ముగ్గురు కుమారులవైపు మరలింది.

నా మనస్సులో నేను “నేను చనిపోతున్నానా?” అని పరలోక తండ్రిని అడిగాను.

“అంతా సవ్యంగా ఉంటుంది” అని పరిశుద్ధాత్మ మెల్లగా అన్నది.

అప్పుడు “నేను బ్రతుకుతానా?” అని అడిగాను.

మరలా, జవాబు వచ్చింది, “అంతా సవ్యంగా ఉంటుంది.”

నేను కలవరపడ్డాను. నేను జీవిస్తానా లేక చనిపోతానా నాకు ఒకే సమాధానం ఎందుకు వచ్చింది?

అప్పుడు హఠాత్తుగా నేను జ్ఞాపకము చేయబడినప్పుడు నా ప్రతి అణువు సంపూర్ణమైన శాంతితో నింపబడింది: మేము ఇంటికి త్వరగా వెళ్ళి ఎలా ప్రార్థించాలో మా పిల్లలకు నేర్పాల్సినవసరం లేదు ఎందుకనగా మేము ఇదివరకే వాళ్ళకు బోధించాము. వారు ప్రార్థన నుండి జవాబులు, ఓదార్పును ఎలా పొందాలో ఎరుగుదురు. మేము త్వరగా ఇంటికి వెళ్ళి లేఖనాలు లేదా జీవించియున్న ప్రవక్తల మాటలను వారికి బోధించాల్సినవసరం లేదు. ఆ మాటలు ఇదివరకే పరిచయమైన బలము మరియు జ్ఞానము యొక్క ఆధారముగా ఉన్నాయి. మేము త్వరగా ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపము, పునరుత్థాఃనము, పునఃస్థాపన, రక్షణ ప్రణాళిక, నిత్య కుటుంబాలు, లేదా యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని వారికి బోధించాల్సినవసరం లేదు.

ఆ క్షణములో ప్రతి కుటుంబ గృహ పాఠము, లేఖన అధ్యయన సమావేశము, విశ్వాసముతో చేయబడిన ప్రార్థన, ఇవ్వబడిన దీవెన, పంచుకోబడిన సాక్ష్యము, చేసి పాటించబడిన నిబంధన, హాజరైన ప్రభువు యొక్క మందిరము, ఆచరించబడిన సబ్బాతు దినము ముఖ్యమైనది—ఓహ్, అది చాలా ముఖ్యమైనది! ఈ సమయంలో ఈ శ్రమ కోసం ఆత్మీయంగా సిద్ధపడటానికి మాకు చాలా ఆలస్యమయ్యింది. మాకు ప్రతి ఒక్క బొట్టు, అవసరము, మరియు ఇప్పుడు అది అవసరము!

యేసు క్రీస్తు మరియు ఆయన పునఃస్థాపించబడిన సువార్త వలన, నేను చనిపోతే, నా కుటుంబము ఓదార్చబడుతుంది, బలపరచబడుతుంది, మరియు ఒకరోజు పునఃస్థాపించబడుతుంది. నేను జీవిస్తే, సహాయం పొందడానికి, బలపరచబడటానికి, మరియు నన్ను స్వస్థపరచడానికి ఈ భూమి మీద గొప్ప శక్తికి ప్రవేశాన్ని నేను కలిగి ఉంటాను. చివరికి, యేసు క్రీస్తు వలన, అంతా సవ్యంగా ఉండవచ్చును.

“సరే” ఎలా కన్పిస్తుందో సిద్ధాంతము మరియు నిబంధనలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం నుండి మనము నేర్చుకుంటాము:

“ఆ దినమున నేను మహిమతో వచ్చునప్పుడు, పదిమంది కన్యకలను గూర్చి నేను చెప్పిన ఉపమానము నెరవేర్చబడును.

“ఏలయనగా జ్ఞానము కలిగి, సత్యమును స్వీకరించి, పరిశుద్ధాత్మను తమ మార్గదర్శిగా పొందినవారు మోసగించబడలేదు—వారు నరకబడి అగ్నిలో వేయబడరు, కానీ వారు ఆ దినమున నిలిచియుందురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”7

“ఆ దినమున నిలిచియుండటానికి” యేసు క్రీస్తు దానిని మనకు సాధ్యపరుస్తారు. ఆ దినమున నిలిచియుండటం అనగా మనము చేయాలని కోరబడిన వాటి సంఖ్యను పెంచడం అని అర్ధము కాదు. ఒక భూతద్దము గురించి ఆలోచించండి. దాని ఉద్దేశము వస్తువులను పెద్దవిగా చేయడం మాత్రమే కాదు. అది వెలుగును ఎక్కువ శక్తివంతంగా చేయడానికి దానిని సమకూర్చి, కేంద్రీకరిస్తుంది. మన ప్రయత్నాలను సరళీకృతం చేసి, దృష్టిసారించాలి, యేసు క్రీస్తు యొక్క వెలుగును సమకూర్చు వారిగా ఉండాలి. మనకు మరింత పరిశుద్ధమైన, బయలపరచే అనుభవాలు కావాలి.

వాయువ్య ఇజ్రాయేల్‌లో ఉన్న ఒక అందమైన పర్వత శ్రేణిని తరచుగా “సతత హరిత పర్వతం (ఎప్పుడూ పచ్చని ఆకులుగల చెట్లతో)” అని పిలవబడుతుంది. కర్మేలు పర్వతం8 చిన్న మంచు బిందువుల కారణంగా సంవత్సరం పొడుగునా పచ్చగా ఉంటుంది. పోషణ ప్రతిరోజు జరుగుతుంది. “కర్మేలు మంచు బిందువుల వలే,9 మన ఆత్మలను “నీతిని గూర్చిన వాక్యములతో”10 “చిన్న మరియు సాధారణమైన వస్తువులతో”9 పోషించడానికి మనము కోరినప్పుడు, మన సాక్ష్యములు, మన పిల్లల సాక్ష్యములు జీవిస్తాయి!

ఇప్పుడు, మీరనుకోవచ్చు, “కానీ సహోదరి రైట్, మీకు నా కుటుంబము తెలియదు. మేము నిజంగా కష్టపడుతున్నాము మరియు మీ కుటుంబంలా మాది లేదు.” మీరు చెప్పేది సరైనది. మీ కుటుంబం నాకు తెలియదు. కానీ దేవుడు అంతములేని ప్రేమ, దయ, శక్తి, జ్ఞానము, మరియు మహిమతో ఎరుగును.

మీరు అడిగే ప్రశ్నలు సమాధానాలు కనుగొనాలని బలంగా కోరుకొనే ప్రశ్నలు అవి ఒక వ్యక్తిని చాలా విచారంగా, లేదా ఆందోళనకు గురి చేసేవి. అదేవిధమైన ప్రశ్నలు పరిశుద్ధ లేఖనాలలో కనుగొనబడ్డాయి:

“బోధకుడా, [నా కుటుంబము] నశించిపోవుచున్నది, నీకు చింతలేదా?”12

“నా నిరీక్షణాధారమేది?”13

“ఈ అంధకారము యొక్క మేఘము [నన్ను] కమ్ముట నుండి తీసివేయబడుటకు [నేను] ఏమి చేయుదును?”14

“అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?”15

“[నేను] ప్రతి మంచి సంగతిని పట్టుకొనుట అది ఎట్లు సాధ్యము?”16

“ప్రభువా, నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?” 17

తరువాత చాలా దయగల జవాబులు వచ్చాయి:

“విమోచన కొరకు క్రీస్తు యొక్క శక్తియందు నీవు నమ్ముచున్నావా?”18

“ప్రభువు ఎవరినైనను వారు ఆయన మంచితనము నందు పాలుపొందరాదని ఆజ్ఞాపించెనా?”19

“[ఆయన] ఇది చేయగలరని మీరు నమ్ముచున్నారా?”20

“తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా?”21

“మిమ్ములను సృష్టించిన ఆయన యొక్క విమోచన యందు మీరు విశ్వసించుచున్నారా?”22

“సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?”23

నా ప్రియమైన స్నేహితురాలా, మన ఆత్మీయతను మరొకరికి పంచుకోలేము, కానీ మనము ఆయన వెలుగును పంచుకోగలము. మన దీపములలో నూనె “ఆ దినమున నిలిచియుండటానికి” మనకు సహాయపడుట మాత్రమే కాదు కానీ మనం ప్రేమించే వారిని,“ చేర్చుకొనుటకు చాచిన చేతులతో సిద్ధంగా నిలిచిన రక్షకుని వద్దకు నడిపించే మార్గాన్ని ప్రకాశవంతం చేసే సాధనంగా కూడ ఉంటుంది.24

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము. కన్నీళ్ళు విడుచుట మానుము: నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు, …

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు.”25

యేసు క్రీస్తు “రాబోవు కాలమునందు నమ్మిక.” మనము చేసినది, లేక చేయనిది ఏదీ ఆయన అంతములేని, నిత్య త్యాగము చేరువకు మించినది కాదు. మన కథకు ఎన్నడూ ముగింపు లేకపోవడానికి కారణము ఆయనే.26 అందువలన మనము “క్రీస్తు నందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, మరియు దేవుని యొక్క మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను. ఇప్పుడు మీరు క్రీస్తు వాక్యమను విందారగించుచూ ముందునకు త్రోసుకొని వెళ్ళిపోయి, అంతము వరకు స్థిరముగానుండిన యెడల, ఇదిగో [మనము] నిత్యజీవము పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నాడు.”27

నిత్య జీవము నిత్య సంతోషము. ఈ జీవితంలో సంతోషము, ఇప్పుడు—మన కాలపు సవాళ్ళను లక్ష్యపెట్టకుండా, వాటి నుండి నేర్చుకోవడానికి మరియు చివరకు వాటిని జయించడానికి ప్రభువు యొక్క సహాయము వలన—మరియు రాబోయే జీవితంలో లెక్కలేనంత సంతోషము. కన్నీళ్ళు ఆరిపోతాయి, విరిగిన హృదయాలు బాగు చేయబడతాయి. తప్పిపోయినది కనుగొనబడుతుంది, చింతలు పరిష్కరించబడతాయి, కుటుంబాలు పునఃస్థాపించబడతాయి, మరియు తండ్రికి గల సమస్తము మనదవుతుంది.28

యేసు క్రీస్తు వైపు చూచి జీవించుము29 “(మన) ప్రియమైన ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడునైన” 30 యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన నామములో ఇది నా సాక్ష్యము, ఆమేన్.