సర్వసభ్య సమావేశము
మాట, క్రియలలో యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మాట, క్రియల ద్వారా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుట

యేసు క్రీస్తు యొక్క సువార్తతో సామరస్యంగా మన జీవితాలను జీవించడానికి మనము ప్రయాసపడినప్పుడు, మన ప్రవర్తన మన విమోచకుని గూర్చి ఒక సజీవమైన సాక్ష్యముగా ఉంటుంది.

బాప్తిస్మమప్పుడు మనము చేసే వాగ్దానాలలో ఒకటి యేసు క్రీస్తు యొక్క నామాన్ని మనపై తీసుకోవడానికి సమ్మతించుట. ఈ రోజు నా ఉద్దేశ్యమేదనగా మనకు సాధ్యమైనంత తరచుగా యేసే క్రీస్తని మనము మాట, క్రియలో సాక్ష్యమును చెప్పుట ద్వారా ఆయన కుమారుని నామమును మనపై తీసుకొంటున్నామని మనం దేవునికి చూపగలమని మనకు జ్ఞాపకం చేయుట.

ఆయన పునరుత్థానము తరువాత అమెరికాలోని జనులకు పరిచర్య చేస్తూ బోధించినప్పుడు, రక్షకుడు తన సిద్ధాంతాన్ని వారికి బోధించారు:

“నా నామమైన క్రీస్తు యొక్క నామమును మీరు మీపై తీసుకొనవలెనని చెప్పు లేఖనములను వారు చదువలేదా? ఏలయనగా ఈ నామము చేతనే అంత్యదినమున మీరు పిలువబడుదురు;

“మరియు నా నామమును తనపై తీసుకొని, అంతము వరకు స్థిరముగా నిలిచియుండువాడు అంత్యదినమున రక్షించబడును.” 1

“రక్షకుని నామాన్ని మనపై తీసుకొనుట ఇతరులకు మన మాటలు, క్రియల ద్వారా యేసే క్రీస్తని—ప్రకటించడాన్ని, సాక్ష్యమివ్వడాన్ని కలిగియుంటుంది,” 2 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధించారు.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము ఉన్న ప్రతిచోట ప్రభువు, ఆయన నామము యొక్క సాక్షులుగా నిలిచియుండే దీవెనను, విశేషావకాశాన్ని కలిగియున్నాము.3 యేసు క్రీస్తు యొక్క సువార్తతో సామరస్యంగా మన జీవితాలను జీవించడానికి మనము ప్రయాసపడినప్పుడు, మన ప్రవర్తన మన విమోచకుడు, ఆయన నామమును గూర్చి ఒక సజీవమైన సాక్ష్యముగా ఉంటుంది. అంతేకాకుండా, మనము నమ్మే దానిని, భావించే దానిని, లేదా క్రీస్తు గురించి తెలిసిన దానిని ఇతరులతో పంచుకొనుట ద్వారా మాటలో క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాము.

మన మాటలు, క్రియల ద్వారా ప్రభువును గూర్చి మన సాక్ష్యమును మనము వినయంగా పంచుకొన్నప్పుడు, నిజమైన ఉద్దేశము కలిగి, తెరవబడిన హృదయాలు, సమ్మతిగల మనస్సులు గల వారికి యేసే వాస్తవంగా క్రీస్తని పరిశుద్ధాత్మ నిర్ధారిస్తుంది.4 5

ఇటీవలి సంఘ సమావేశాలలో, యేసు క్రీస్తు గురించి మాట్లాడడం ద్వారా మరియు ప్రభువు గురించి స్వచ్ఛమైన సాక్ష్యమివ్వడం ద్వారా, వారు యేసు క్రీస్తు నామమును తమపై తీసుకున్నారని చూపించే సభ్యుల ఉత్తేజకరమైన రెండు ఉదాహరణలను నేను పంచుకోవాలనుకుంటున్నాను.

మొదటి మాదిరి: 2022లో నా భార్య ఎలైన్, నేను స్పైయిన్‌కు వెళ్ళి, అక్కడ సంఘము యొక్క చిన్న విభాగములో ఆదివారపు సమావేశాలకు హాజరయ్యాము. నేను స్టేజిపై మరియు నా భార్య సమూహములో కూర్చున్నది, ఆమె ఒక పెద్ద స్త్రీ దగ్గర కూర్చోవడం నేను గమనించాను. సంస్కార సమావేశము ముగిసినప్పుడు, నేను ఎలైన్ దగ్గరకు నడిచి, తన క్రొత్త స్నేహితురాలిని పరిచయం చేయమని ఆమెను అడిగాను. ఆమె పరిచయం చేసింది, మరియు సంఘ సభ్యురాలుకాని ఈ స్త్రీ, దాదాపు రెండు సంవత్సరాలుగా సంఘాన్ని సందర్శిస్తున్నది. నేను దానిని విన్నప్పుడు, దేవునికి భయపడే ఈ స్త్రీని, తిరిగి రావడానికి, ఇంత కాలం మన సమావేశాలకు హాజరు కావడానికి కారణం ఏమిటని నేను అడిగాను. ఆ స్త్రీ ప్రేమగా సమాధానం చెప్పింది, “మీ సమావేశాలలో మీరు యేసు క్రీస్తు గురించి మాట్లాడతారు గనుక నేను ఇక్కడకు రావడానికి ఇష్టపడతాను.”

స్పష్టంగా, స్పైయిన్‌లో ఆ విభాగములోని సంఘ సభ్యులు, వారి సమావేశాలలో క్రీస్తు గురించి మాట్లాడారు, బోధించారు, మరియు సాక్ష్యమిచ్చారు.

రెండవ మాదిరి: బ్రెజిల్ ప్రాంతంలో సేవ చేసిన తరువాత, సంఘ ప్రధాన కేంద్రాలలో సేవ చేయడానికి నేను ఒక క్రొత్త నియామకం పొందాను. ఈ సంవత్సరం జూలై చివరలో మేము సాల్ట్‌లేక్‌కు మారినప్పుడు, మా క్రొత్త, అద్భుతమైన వార్డు ఆదివారపు సమావేశాలకు మేము హాజరయ్యాము. ఈ సమావేశాలలో ఒకటి ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశము. భక్తిగల గౌరవంతో సంస్కారమును తీసుకొన్న తరువాత, సభ్యులు లేచి, ఒకరి తరువాత ఒకరు రక్షకుని గూర్చి హృదయపూర్వకమైన సాక్ష్యములను పంచుకున్నారు. సమావేశము యేసు క్రీస్తుపై కేంద్రీకరించబడింది, మరియు ఆత్మను మనం స్పష్టంగా అనుభూతి చెందగలము. మేము జ్ఞానవృద్ధి పొందాము, మరియు మా విశ్వాసము బలపరచబడింది. నిజాయితీగా సత్యమును వెదకు సంఘము యొక్క స్నేహితులు, ఆ సమావేశానికి హాజరైన యెడల, వారు ఇది యేసు క్రీస్తు యొక్క సంఘమని గుర్తించి ఉండేవారు.

మన సంఘ సమావేశాలు క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి మరియు ఆయన కుమారుని నామమును మనపై తీసుకోవడంలో మనము ఆనందిస్తున్నామని దేవునికి సూచించడానికి మనకు శ్రేష్ఠమైన అవకాశాలుగా చూడటం ఎటువంటి దీవెన.

ఇప్పుడు, క్రియల ద్వారా ఆయన గురించి సాక్ష్యమును చెప్పుట ద్వారా యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొన్న ఒక శక్తివంతమైన మాదిరిని నేను మీకు చెప్తాను.

గత ఆగష్టు, యుబా సిటీలో, ఫిథర్ రివర్ కాలిఫోర్నియా దేవాలయము యొక్క ప్రారంభానికి ముందు ఎల్డర్ జోనాతాన్ ష్మిత్‌కు తోడుగా నేను వెళ్ళాను. అక్కడ, దేవాలయ సందర్శనపై గుంపులను నడిపించే దీవెన నాకు కలిగింది. ఈ గుంపులలో చేర్చబడిన ఒకరు సంఘ సభ్యులు, వర్జిల్ అట్కిన్‌సన్, మరియు ఇతర విశ్వాసాలకు చెందిన ఏడుగురు స్నేహితులున్నారు. సందర్శనము ముగింపులో దేవాలయములో బంధించే గదిలో, ఆరోజు దేవాలయానికి వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రేమను వ్యక్తపరచినప్పుడు సహోదరుడు అట్కిన్‌సన్ భావోద్వేగం చెందాడు. దాదాపు అతడు ఆవిధంగా చేసిన వెంటనే, గుంపులో ఒక స్త్రీ లేచి నిలబడి ఇలా అన్నది, “మేమందరం వర్జిల్‌ను ప్రేమిస్తున్నాము. అతడు ఎన్నడూ తన విశ్వాసములను నమ్మమని మమ్మల్ని బలవంతం చేయలేదు. కానీ అతడు తన విశ్వాసము, నమ్మకాలను గూర్చి బహిర్గతంగా మాట్లాడాడు. అతడు తాను నమ్మిన దానిని జీవిస్తున్నాడు.”

సంవత్సరాలుగా, సహోదరుడు అట్కిన్‌సన్ యొక్క క్రీస్తువంటి జీవితం అతడి స్నేహితులకు శక్తివంతమైన సాక్ష్యముగా సహాయపడింది. అతడి మాదిరి అతడు క్రీస్తు యొక్క నామమును తనపై తీసుకొన్నాడనుటకు బలమైన నిదర్శనము.

ముగింపులో, క్రీస్తు నామమును మనపై ఎలా తీసుకోవాలి మరియు సంఘము యొక్క సరైన పేరును ఉపయోగించుట ద్వారా ఆయన గురించి సాక్ష్యమిచ్చుటను నేను నేర్చుకొన్న పాఠము మీతో పంచుకుంటాను.

దేవుని యొక్క జీవిస్తున్న ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్, 2018 సర్వసభ్య సమావేశములో “సంఘము యొక్క సరైన పేరు,” అనే ప్రసంగములో ఇలా చెప్పారు: “అది ఒక దిద్దుబాటు. అది ప్రభువు యొక్క ఆజ్ఞ. జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన సంఘమును అతడు పేరు పెట్టలేదు; లేదా మోర్మన్ పేరు పెట్టలేదు. రక్షకుడే స్వయంగా చెప్పారు, ‘ఏలయనగా అంతిమ దినములలో నా సంఘము ఈ విధముగా పిలువబడును, అదేమనగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము’ (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4).”6

ఆరోజు మనమందరం సర్వసభ్య సమావేశాన్ని విడిచి, ప్రవక్తను అనుసరించడానికి మరియు అప్పటి నుండి సంఘము యొక్క బయల్పరచబడిన పేరును ఉపయోగించడానికి నిబంధన చేసాము మరియు తీర్మానించుకున్నాము. సంఘము యొక్క సరైన పేరును నేను ఉపయోగిస్తున్నానని నిర్ధారించుకోవడానికి నన్ను నేను నిజంగా గమనించుకున్నాను. మొదట కొన్నిసార్లు, నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది మరియు పాత విధానాలలోనికి వెళ్ళడానికి నన్ను నేను అనుమతించుకోలేదు. మొదటి ప్రయత్నాల తరువాత, సంఘము యొక్క బయలుపరచబడిన పేరును ఉపయోగించడానికి నేను మరింత సౌఖ్యంగా భావించాను. అనేకసార్లు సంఘము యొక్క పేరును నేను వేగంగా చెప్తానని నేను అంగీకరిస్తున్నాను. సంఘము యొక్క పూర్తి పేరుకు జనులు ఎక్కువ ఆసక్తి చూపరని మరియు అది కాస్త పొడుగైనదని అనుకుంటారని నేను చింతిస్తున్నాను.

అయినప్పటికినీ, సంఘము యొక్క పూర్తి పేరును ఉద్దేశముతో చెప్పుట యేసు క్రీస్తు యొక్క నామమును మాట్లాడటానికి మరియు వాస్తవానికి ఆయన సంఘము యొక్క నామములో ఆయన నామమును ప్రకటించుట ద్వారా రక్షకుని గూర్చి సాక్ష్యమివ్వడానికి విలువైన అవకాశాలను నాకిచ్చిందని తరువాత నేను గ్రహించాను. ఇతరులతో నేను సంఘము యొక్క సరైన పేరును చెప్పినప్పుడు, నేను యేసు క్రీస్తును ఎక్కువ తరచుగా జ్ఞాపకముంచుకున్నానని మరియు నా జీవితంలో ఆయన ప్రభావాన్ని అనుభూతి చెందానని కూడా నేను గమనించాను.

ప్రవక్తను అనుసరించుట ద్వారా, సంఘము యొక్క పేరును ఉపయోగించుట ద్వారా మనమందరం యేసు క్రీస్తును గూర్చి ఎక్కువగా సాక్ష్యమివ్వగలము, తద్వారా ప్రభువు యొక్క నామమును మరింత సంపూర్ణంగా మనపై తీసుకుంటున్నాము.

ఈ విశ్రాంతిదినము ఉదయాన, అధ్యక్షులు నెల్సన్ దేవుని యొక్క జీవిస్తున్న ప్రవక్త అని, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘమని నేను సంతోషంగా సాక్ష్యమిస్తున్నాను. దేవుని యొక్క కుమారుని మరియు ఆయన దైవత్వమును గూర్చి నేను సవినయముగా సాక్ష్యమిస్తున్నాను. ఆయన దేవుని యొక్క ప్రథమ సంతానము మరియు అద్వితీయ కుమారుడు, మన రక్షకుడు, విమోచకుడు, ఇమ్మానుయేలు.7 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.