సర్వసభ్య సమావేశము
భావితరానికి మద్దతుగా
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


భావితరానికి మద్దతుగా

యువత జీవితాలలోని అనుబంధాలు వారి ఎంపికలపై గొప్ప ప్రభావాన్ని కలిగియుంటాయి.

మీతో మాట్లాడటానికి సిద్ధపడటంలో, నేను అమ్మోనీయులకు చెందిన హీలమన్ మరియు అతని యువ కుమారుల వృత్తాంతానికి ఆకర్షించబడ్డాను. ఈ వృత్తాంతమును అధ్యయనం చేయడం ద్వారా తల్లిదండ్రులు, బిషప్పులు మరియు వార్డు సభ్యులకు బోధిస్తున్న మోర్మన్ గ్రంథ ప్రవక్తల ఆత్మను నేను అనుభూతి చెందాను.

యువ అమ్మోనీయులు నమ్మగల వ్యక్తి హీలమన్. వారు నీతిని వృద్ధి చేసి, పరిపక్వత చెందడానికి అతడు సహాయపడ్డాడు. వారు అతడిని ఎరిగి, ప్రేమించారు మరియు “[అతడు] వారికి నాయకునిగా ఉండవలెనని కోరారు.”1

హీలమన్ ఈ యువకులను కుమారుల వలె ప్రేమించాడు మరియు వారి సామర్థ్యాన్ని చూసాడు.2 ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా బోధించారు, “ఇతరులకు ప్రభావవంతంగా సేవ చేయుటకు మనము వారిని … పరలోక తండ్రి యొక్క కన్నుల ద్వారా చూడాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మ యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోవడం ప్రారంభించగలము. అప్పుడు మాత్రమే పరలోక తండ్రి తన పిల్లలందరి కోసం … కలిగియున్న ప్రేమను మనము గ్రహించగలుగుతాము.”3 నేటి బిషప్పులు వారి సంరక్షణలో ఉన్న యువత యొక్క దైవిక గుర్తింపును చూడగల వివేచనతో దీవించబడ్డారు.

హీలమన్ తన సంరక్షణలో ఉన్న యువకులను “లెక్కించాడు.”4 వారితో బలమైన అనుబంధాలను నిర్మించడానికి అతడు ప్రాధాన్యతనిచ్చాడు.

జీవన మరణాలు సమతుల్యతలో వేలాడుతున్న ఒక క్లిష్టమైన సమయంలో, హీలమన్ మరియు అతని యువ సైనికులు వారిని వెంబడిస్తున్న సైన్యము యొక్క జాడను కోల్పోయారు. హీలమన్ యువతతో సంప్రదించాడు:

“ఇదిగో, మనము వారికి వ్యతిరేకముగా వెళ్ళినప్పుడు వారు వలపన్ని మనలను పట్టుకొనగలుగునట్లు వారు ఆగియుండవచ్చు, …

“కావున నా కుమారులారా మీరేమందురు … ?”5

ఈ విశ్వాసులైన యువకులు ఇలా స్పందించారు, “తండ్రీ, మన దేవుడు మనతో ఉన్నాడు, మన ఓటమిని ఆయన అనుమతించడు; కావున మనము ముందుకు వెళ్ళెదము.”6 హీలమన్ చర్య తీసుకోవడానికి 7 ఈ యువకుల తీర్మానములో వారిని బలపరచినప్పుడు, యుద్ధము జయించబడింది.8

యువ అమ్మోనీయులు గొప్ప హేతువు కలిగియున్నారు మరియు “జనులకు సహాయపడుటలో”9 శూరులై ఉన్నారు. హీలమన్ చేత నడిపించబడిన “ఈ చిన్నసైన్యము” అనుభవంగల నీఫై సైన్యముల హృదయాలలోనికి “గొప్ప ఆశలను, అధిక సంతోషమును”10 తెచ్చెను. వార్డును దీవించడంలో మరియు ఇశ్రాయేలును సమకూర్చుటలో ఈ రోజు బిషప్పులు వారికి ప్రత్యేకంగా వరమివ్వబడిన యువతను నడిపించవచ్చు. “[వారు] భూమి మీదకు పంపబడిన ”11 కార్యము ఇదేనని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.

“వారికి అప్పగించబడిన ఏ విషయమందైనను అన్నిసమయములలో సత్యవంతులైయుండిన” 12 ఆ యువ అమ్మోనీయుల వలే హీలమన్ తన నాయకులను విశ్వాసంగా అనుసరించాడు. సవాళ్లు లేదా ఎదురుదెబ్బలను లక్ష్యపెట్టకుండా, వారి లక్ష్యమును ముందుకు తీసుకొని వెళ్ళడానికి హీలమన్ “బలమైన నిర్ణయముతో” 13 స్థిరంగా ఉన్నాడు. “[తన] చిన్న కుమారులతో నడవడానికి” 14 నిర్దేశించబడినప్పుడు అతడు విధేయుడయ్యాడు.

బిషప్పులు “వార్డు యువతుల అధ్యక్షురాలితో సంప్రదించడానికి” 15 మన నాయకుల నడిపింపును అనుసరించినప్పుడు నేటి యువత దీవించబడ్డారు. బిషప్పులు మరియు యువతుల అధ్యక్షులకు యువతపట్ల వారి బాధ్యతలను నెరవేర్చుటలో శిక్షణ ఇవ్వబడిందని స్టేకు అధ్యక్షులు నిశ్చయపరుస్తారు.16

హీలమన్ నిబంధనలను గౌరవించాడు. యువకుల తల్లిదండ్రులకు అమ్మోన్ సువార్తను బోధించినప్పుడు, ఈ తల్లిదండ్రులు దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారు నీతిగల శిష్యత్యము యొక్క క్రొత్త జీవితానికి ఎంతగా కట్టుబడి ఉన్నారంటే “వారు తమ తిరుగుబాటు ఆయుధములను విడిచిపెట్టుటకు”17 ఒక నిబంధన చేసారు. ఈ నిబంధనను ఉల్లంఘించడాన్ని వారు పరిగణించడానికి కారణమైన ఏకైక విషయం, నీఫైయులు అపాయములో ఉన్నారని చూసి, వారికి సుపరిచితమైన పోరాట గతానికి తిరిగి వెళ్ళడం.

వారికి ఒక సురక్షితమైన గృహాన్ని ఇచ్చిన ఈ జనులకు సహాయపడాలని అమ్మోనీయులు కోరుకున్నారు. ఇతరులతోపాటు హీలమన్, ఎప్పటికీ పోరాడము అనే వారి నిబంధనను పాటించమని వారికి బోధించాడు. ఈ అమ్మోనీయులు తమ ఖడ్గములు మరియు బాణములతో ఇవ్వగల బలము కంటే దేవుడు ఇచ్చే బలమునందు అతడు ఎక్కువగా నమ్మకముంచాడు.

హీలమన్ మరియు అతని యువ యోధులు భయంకరమైన సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు, హీలమన్ దృఢంగా ఉన్నాడు. “కానీ అది ముఖ్యము కాదు—దేవుడు మమ్ములను విడిపించునని మేము నమ్ముచున్నాము.”18 ఒక సందర్భములో, ఆకలితో మృత్యువుకు దగ్గరలో ఉన్నప్పుడు, వారి స్పందన ఏదనగా, “ఆయన [వారిని] బలపరచి, [వారిని] విడిపించవలెనని దేవునికి ప్రార్థనయందు [వారి] ఆత్మలను క్రుమ్మరించారు; … [మరియు] ప్రభువు … [వారిని] దర్శించి, విడిపించెదనని [వారికి] అభయమిచ్చెను,”19 ఎందుకనగా “విశ్వసించుటకు వారికి బోధించబడిన దానియందు వారి అధిక విశ్వాసము కారణముగా.”20

ఈ యువకులు వారి తల్లిదండ్రుల చేత బలపరచబడ్డారని హీలమన్ నుండి మనము తెలుసుకున్నాము. ఈ విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడానికి ప్రధానమైన బాధ్యతను కలిగియున్నారని వారికి తెలుసు. ఆజ్ఞలను పాటించమని మరియు దేవుని యెదుట “యథార్థముగా నడువవలెనని”21 వారు తమ పిల్లలకు బోధించారు. “వారు సందేహించని యెడల, దేవుడు వారిని విడిపించునని”22 వారి తల్లులు వారికి బోధించారు. వారి తండ్రులు నిబంధన చేయడంలో శక్తివంతమైన మాదిరిని ఉంచారు.23 ఈ మాజీ యోధులకు యుద్ధము యొక్క భయానకత తెలుసు. వారు అనుభవంలేని తమ కుమారులను హీలమన్ సంరక్షణలో అప్పగించారు మరియు “ఆహారసామాగ్రులు అనేకము”24 పంపుట ద్వారా వారిని బలపరిచారు.

అతడు యువ సైన్యమునకు సేవ చేసినప్పుడు హీలమన్ ఒంటరిగా లేడు. అతడు సహాయము మరియు నడిపింపు కోసం అడగడానికి తన చుట్టూ జనులను కలిగియున్నాడు. అతడు సహాయం కోసం సైన్యాధిపతి మొరోనైను సమీపించాడు మరియు అది దొరికింది.

ప్రభువు రాజ్యములో సేవ చేసేవారు ఎవరూ ఒంటరిగా సేవ చేయరు. ప్రభువు వార్డులు మరియు స్టేకులతో మనల్ని దీవించారు. ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి, పునఃస్థాపించబడిన ఆయన నిర్మాణము ద్వారా మనము వనరులు, వివేకము మరియు ప్రేరేపణను కలిగియున్నాము.

ఒక బిషప్పు సలహాసభల ద్వారా వార్డు కొరకు నడిపింపును అందిస్తాడు.25 అతడు త్రైమాసిక పరిచర్య ఇంటర్వ్యూలను ప్రోత్సహిస్తాడు మరియు కుటుంబాలకు పరిచర్య చేసే వారి బాధ్యతను నెరవేర్చడానికి పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజమును ప్రోత్సహిస్తాడు. ఈ అధ్యక్షత్వములు అవసరాలను అంచనా వేసి ప్రేరేపించబడిన పరిష్కారాలను కనుగొనడంలో ముందుంటాయి. ఈ బాధ్యతలలో పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములకు బోధించుట ద్వారా స్టేకు అధ్యక్షులు సహాయాన్ని అందిస్తారు.

నాయకులు, తల్లిదండ్రుల కోసం అవసరమైన నడిపింపు సువార్త గ్రంథాలయం మరియు Gospel Living apps లో కనుగొనబడుతుంది. ఈ ప్రేరేపించబడిన వనరులలో, లేఖనాలు, ఆధునిక ప్రవక్తల బోధనలు మరియు సంఘ చేతిపుస్తకములను మనం కనుగొనగలం. సువార్త గ్రంథాలయంలోని యువత విభాగములో సమూహము మరియు తరగతి అధ్యక్షత్వముల కోసం అనేక వనరులు ఉన్నాయి26 మరియు యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయడానికి ఒక మార్గదర్శి కూడా ఉంది. వార్డు యొక్క సభ్యులందరు ఈ ప్రేరేపించబడిన వనరులను అధ్యయనం చేసి, ఆత్మ నుండి నడిపింపును వెదకినప్పుడు, యువతను బలపరచుటలో ప్రభువు చేత ప్రతీఒక్కరు నిర్దేశించబడగలరు.

సభ్యులు యువతరముపై దృష్టిసారించినప్పుడు వార్డు మొత్తము దీవించబడుతుంది మరియు బలపరచబడుతుంది. మనలో అసంపూర్ణతలు మరియు లోపాలు ఉన్నప్పటికీ, ఇతరులను సమీపించమని ఆయన ఆత్మ యొక్క సహవాసము ద్వారా పరలోక తండ్రి మనలో ప్రతీఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణలను మనం అనుసరించినప్పుడు మనము పరిశుద్ధపరచబడతామని మరియు వృద్ధి చెందుతామని ఆయనకు తెలుసు.27 మన ప్రయత్నాలు అసంపూర్ణంగా ఉన్నా ఫరవాలేదు. మనము ప్రభువుతో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు, యువతతో ఆయన చేయగలిగిన దానితో ఏకరీతిగా మన ప్రయత్నాలున్నాయని మనం నమ్మగలము.

యువతను సమీపించడంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుసరించుట ద్వారా, మనము వారి జీవితాలలో పరలోక తండ్రి యొక్క ప్రేమకు సాక్షులము అవుతున్నాము. ప్రభువు నుండి ప్రేరేపణలపై చర్య తీసుకొనుట ప్రేమ, నమ్మకంగల అనుబంధాలను ఏర్పరుస్తుంది. యువత జీవితాలలోని అనుబంధాలు వారి ఎంపికలపై గొప్ప ప్రభావాన్ని కలిగియుంటాయి.

ఇతరులకు సేవ చేయడానికి ప్రేరేపణలను వెదకి, చర్య తీసుకొనే ప్రక్రియలో వారు మనతో పాల్గొన్నప్పుడు యువత బయల్పాటు యొక్క మాదిరిని నేర్చుకుంటారు. ఈ ప్రేరేపించబడిన నడిపింపు కొరకు యువత ప్రభువు వైపు తిరిగినప్పుడు, ఆయనతో వారి అనుబంధాలు మరియు విశ్వాసము మరింతగా బలపడతాయి.

మనము వారిని నియంత్రించకుండా, సహకారము మరియు నడిపింపును ఇవ్వడం ద్వారా యువతపై మన విశ్వాసాన్ని తెలియజేస్తున్నాము.28 మనము నియంత్రించకుండా, కలిసి సంప్రదించుట ద్వారా నేర్చుకుని, ప్రేరేపించబడిన గమనాన్ని ఎంపిక చేసి, వారి ప్రణాళికను అమలు చేయటానికి అనుమతించినప్పుడు, వారు నిజమైన సంతోషాన్ని మరియు అభివృద్ధిని అనుభవిస్తారు.

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు, “చాలా ముఖ్యమైనది ఏదనగా, వారు నిజముగా ఎవరు మరియు వారు నిజంగా ఏమి కాగలరో [మీ] నుండి వారు నేర్చుకొన్నది. నేను ఊహించేది ఏమిటంటే, ప్రసంగాలనుండి వారు ఎక్కువగా దానిని నేర్చుకొనరు. మీరు ఎవరు, వారు ఎవరని మీరనుకుంటున్నారు మరియు వారు ఏమి కాగలరని మీరనుకుంటున్నారనే భావనల నుండి వారు దానిని పొందుతారు.”29

మన యువత వారి ధైర్యము, వారి విశ్వాసము మరియు వారి సామర్థ్యములతో మనల్ని ఆశ్చర్యపరుస్తారు. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా వారు పూర్తిగా నిబంధన చేసినప్పుడు, ఆయన సువార్త వారి హృదయాలపై చెక్కబడుతుంది. ఆయనను అనుసరించడం వారు చేసే దానిలో మాత్రమే కాకుండా, వారు ఎవరనే దానిలో భాగమవుతుంది.

యేసు క్రీస్తు యొక్క పరాక్రమ శిష్యుడు ఎలా జీవిస్తాడో చూడడానికి హీలమన్ యువ అమ్మోనీయులకు సహాయం చేశాడు. నేడు క్రీస్తు యొక్క శిష్యులు ఎలా జీవిస్తున్నారనే దానికి యువతకు మనం శక్తివంతమైన మాదిరులుగా ఉండవచ్చు. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలలో ఇటువంటి మాదిరుల కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రేమగల, నిబంధనను-పాటించే పెద్దల ప్రభావమును ఏ కార్యక్రమము భర్తీ చేయదు.

యాజకుల సమూహము అధ్యక్షునిగా, బిషప్పు నీతిగల విధానాలలో రక్షణ కల్పించడం, పోషించడం మరియు అధ్యక్షత్వము వహించుట ద్వారా31 ఒక నమ్మకస్థుడైన భర్తగా మరియు ఒక ప్రేమగల తండ్రిగా ఎలా ఉండాలో30 అలా జీవించి యువతకు మాదిరిగా ఉండగలడు. బిషప్పులు, “యువతపై బలంగా దృష్టిసారించుటతో,”32 తరములుగా నిలిచిపోయే ప్రభావాన్ని కలిగి ఉంటారు.

నేటి యువత పరలోక తండ్రి యొక్క మిక్కిలి ఘనులైన ఆత్మల మధ్య ఉన్నారు.33 పూర్వ మర్త్య లోకంలో సత్యమును మరియు కర్తృత్వమును కాపాడిన ధైర్యస్థుల మధ్య వారున్నారు.34 ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి వారి శక్తివంతమైన సాక్ష్యము ద్వారా ఇశ్రాయేలును సమకూర్చడానికి ఈ రోజులలో వారు పుట్టారు. ఆయన వారిలో ప్రతీఒక్కరిని ఎరుగును మరియు వారి గొప్ప సామర్థ్యాన్ని ఎరుగును. వారు ఎదుగుచుండగా ఆయన ఓపికగా ఉన్నారు. ఆయన వారిని విడిపించి, కాపాడతారు. ఆయన వారిని స్వస్థపరుస్తారు మరియు వారిని నడిపిస్తారు. ఆయన వారిని ప్రేరేపిస్తారు. వారి తల్లిదండ్రులుగా మరియు నాయకులుగా మనము, వారికి సహాయపడటానికి సిద్ధపరచబడ్డాము. తరువాతి తరమును మనము పెంచినప్పుడు మనకు సహాయపడటానికి మనం రక్షకుని సంఘాన్ని కలిగియున్నాము.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడిందని, నేడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నడిపించబడుతుందని, ఈ కడవరి దినాలలో వారి గొప్ప ఉద్దేశాన్ని యువత నెరవేర్చేలా సహాయపడటానికి స్థాపించబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ఆల్మా 53:19.

  2. “మీరు ఎంపిక చేస్తే, మీరు కోరిన యెడల, … మీరు ఏదైన పెద్దది, ఏదైన మహాగొప్పది, ఏదైనా అద్భుతమైన దానిలో పెద్ద భాగముగా ఉండగలరు! … ఈ లోకమునకు ప్రభువు ఎప్పటికీ పంపిన శ్రేష్టమైన వారిమధ్య మీరున్నారు. మీరు తెలివిగా, జ్ఞానం కలిగియుండే సామర్థ్యమును కలిగియున్నారు, మరియు లోకముపై ముందు తరము కంటె ఎక్కువ ప్రభావాన్ని కలిగియున్నారు!” (Russell M. Nelson, “Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], Gospel Library).

  3. Dale G. Renlund, “Through God’s Eyes,” Liahona, Nov. 2015, 94.

  4. ఆల్మా 56:55.

  5. ఆల్మా 56:43–44.

  6. ఆల్మా 56:46.

  7. “తల్లిదండ్రుల పెంపకం విషయములో మన పరలోక తండ్రి యొక్క లక్ష్యం, తన పిల్లలు సరైనది చేయడం కాదు; అది ఆయన పిల్లలు సరైనది చేయడానికి ఎన్నుకోవడం (ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్, “నేడు మీరు కోరుకొనుడి,” లియాహోనా, నవ. 2018, 104).

  8. “యువతను ఆహ్వానించడం మరియు చర్య తీసుకోవడానికి వారిని అనుమతించడం ద్వారా మనము వారిని శక్తివంతం చేస్తున్నప్పుడు, సంఘము అద్భుతమైన విధానాలలో ముందుకు సాగుతుంది” (ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్‌తో ఒక సమావేశం నుండి; see also 2020 Temple and Family History Leadership Instruction, Feb. 27, 2020, Gospel Library).

  9. ఆల్మా 53:22.

  10. ఆల్మా 56:17.

  11. Russell M. Nelson, “Hope of Israel,” Gospel Library.

  12. ఆల్మా 53:20.

  13. ఆల్మా 58:12.

  14. ఆల్మా 56:30.

  15. ప్రధాన చేతిపుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘంలో సేవ చేయుట, 7.1.2 సువార్త గ్రంథాలయం.

  16. ప్రధాన చేతి పుస్తకం, 6.7.2 చూడండి.

  17. ఆల్మా 23:7.

  18. ఆల్మా 58:37.

  19. ఆల్మా 58:10–11.

  20. ఆల్మా 57:26.

  21. ఆల్మా 53:21.

  22. ఆల్మా 56:47.

  23. ఆల్మా 23:7; 24:17–19 చూడండి.

  24. ఆల్మా 56:27.

  25. ప్రధాన చేతి పుస్తకం, 7.1.1 చూడండి.

  26. “మనం నిత్య సత్యమును వెదకుతున్నప్పుడు, ఒక భావన దేవుని నుండి వచ్చినదా లేదా మరొక మూలం నుండి వచ్చినదా అని గుర్తించడంలో క్రింది రెండు ప్రశ్నలు మనకు సహాయపడతాయి: భావన లేఖనాలలో మరియు జీవిస్తున్న ప్రవక్తల ద్వారా ఏకరీతిగా బోధింపబడినదేనా? పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము ద్వారా ఆ భావన ధృవీకరించబడిందా? దేవుడు ప్రవక్తల ద్వారా సిద్ధాంతపరమైన సత్యాలను బయలుపరుస్తారు, మరియు పరిశుద్ధాత్మ ఆ సత్యాలను మనకు ధృవీకరిస్తాడు మరియు వాటిని అన్వయించడంలో మనకు సహాయం చేస్తాడు” (జాన్ సి. పింగ్రీ జూ., “నిత్యమైన సత్యము,” లియహోనా, నవ. 2023, 100).

  27. సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2--4 చూడండి.

  28. “[మన] యువత [దేవుని యొక్క కార్యము చేత] తక్కువగా ప్రభావితం చేయబడితే, బహుశా వారు లోకము చేత ఎక్కువగా క్షీణింపజేయబడతారు. … ఎంతమంది పరిచారకులు మరియు బోధకుల సమూహముల అధ్యక్షత్వములు కేవలము ఒక ప్రార్థన చేసే లేదా సంస్కారమును అందించే పిలుపు మాత్రమే కలిగియున్నారు? సహోదరులారా, వీరు నిజంగా ప్రత్యేక ఆత్మలు మరియు అవకాశమివ్వబడితే వారు ప్రాముఖ్యమైన విషయాలను చేయగలరు!” (Neal A. Maxwell, “Unto the Rising Generation,” Ensign, Apr. 1985, 11).

  29. Henry B. Eyring, “Teaching Is a Moral Act” (address given at the Brigham Young University annual conference, Aug. 27, 1991), 3, speeches.byu.edu.

  30. See “Aaronic Priesthood Quorum Theme,” Gospel Library.

  31. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయం చూడండి.

  32. “బిషప్పులు యువకుల యొక్క యాజకత్వ బాధ్యతలకు అధిక ప్రాధాన్యత మరియు దృష్టిసారింపు ఇచ్చి, వారి సమూహ బాధ్యతలలో వారికి సహాయము చేస్తారని మేము ఆశిస్తున్నాము. అహరోను యాజకత్వ సమూహపు అధ్యక్షత్వములకు మరియు బిషప్పులకు వారి బాధ్యతలలో సహాయపడుటకు సామర్థ్యము గల వయోజన యువకుల సలహాదారులు పిలువబడతారు. ఎక్కువమంది యువకులు మరియు యువతులు ఈ సవాలుకు అనుకూలంగా వ్యవహరిస్తారని మరియు యువతపైన పెట్టు ఈ బలమైన దృష్టిసారింపు వలన నిబంధన మార్గములో ఉంటారని మేము విశ్వాసంగా ఉన్నాము” (క్వింటిన్ ఎల్. కుక్, “యువతను బలోపేతం చేయడానికి సర్దుబాట్లు,” లియహోనా, నవ. 2019, 41).

  33. “మన పరలోక తండ్రి తన మిక్కిలి ఘనమైన ఆత్మలలో అనేకమందిని—బహుశా, ఈ చివరి దశ కొరకు—ఆయన శ్రేష్టమైన జట్టును దాచి ఉంచారని నేను చెప్పగలను. ఆ ఘనమైన ఆత్మలు—ఈ శ్రేష్టమైన ఆటగాళ్లు, ఆ నాయకులు— మీరే!” (Russell M. Nelson, “Hope of Israel,” Gospel Library).

  34. “మీరు ప్రేమించే యుక్తవయస్కులు కర్తృత్వము మరియు సత్యము వైపున ఉన్న పరాక్రమవంతులైన యోధుల మధ్య ఒకరిగా ఉన్నారు. … వారికై వారు ఎంపిక చేయడంలో వారి తీర్మానానికి మనము స్పందించే విధానములో మనం వారికి సహాయం చేయగలము. మర్త్యత్వానికి ముందు ఉనికి నుండి విశ్వాసులైన యోధులలో ఒకరిగా వారు ఉండి, నైతిక కర్తృత్వమును కాపాడటానికి నిబద్ధత కలిగియున్నారని మరియు వారికి ఆనందాన్ని తీసుకొనిరావడానికి దాని గొప్ప విలువ గురించి తెలుసుకున్నట్లుగా మనము చూస్తున్నామో లేదో వారు గ్రహించగలరు. మర్త్యత్వానికి ముందు ఉనికి నుండి విశ్వాసులైన యోధులుగా మనం వారిని చూడగలిగిన యెడల, వారి స్వాతంత్ర్య వాదనలను వారి సాధ్యత యొక్క సూచనగా కూడా మనం చూడవచ్చు, అది వారికి సంతోషాన్ని తెచ్చే కర్తృత్వము యొక్క శక్తిని వారు పరీక్షిస్తున్నారనడానికి ఒక సూచన” (Henry B. Eyring, “A Life Founded in Light and Truth” [Brigham Young University devotional, Aug. 15, 2000], 3, 4, speeches.byu.edu).