సర్వసభ్య సమావేశము
సంతోషకరమైన స్వరము!
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సంతోషకరమైన స్వరము!

దేవాలయాలను నిర్మించుట, ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి ప్రవక్తలందరి యొక్క గొప్ప ప్రాధాన్యతలలో ఒకటిగా ఉన్నది.

”ఇప్పుడు, మనము పొందిన సువార్తలో మనం ఏమి వింటాము? సంతోషకరమైన స్వరము! పరలోకమునుండి కరుణగల స్వరము; భూమినుండి సత్య స్వరము; … మృతులకు మరియు సజీవులకు ఆనందం యొక్క స్వరము; మహా సంతోషకరమైన సువర్తమానము.”1

సహోదర సహోదరీలారా, ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి ఈ మాటలను విని, హఠాత్తుగా పెద్ద చిరునవ్వు నవ్వకుండా ఉండలేము.

మన పరలోక తండ్రియైన దేవుని గొప్ప సంతోష ప్రణాళికలో కనుగొనబడిన జోసెఫ్ యొక్క సంతోషకరమైన వ్యక్తీకరణ నిజంగా సంపూర్ణమైన మరియు గంభీరమైన ఆనందాన్ని సంగ్రహిస్తుంది, ఏలయనగా అతడు మనకిలా అభయమిచ్చాడు, “మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు, సంతోషమును కలిగియున్నారు.”2

మన పూర్వ మర్త్య జీవితంలో మనం దేవుని సంతోష ప్రణాళిక విన్నప్పుడు, మనమందరం సంతోషంతో కేకలు వేసాము3 మరియు ఆయన ప్రణాళిక ప్రకారము మనము జీవించినప్పుడు ఇక్కడ సంతోషంతో కేకలు వేయడం కొనసాగిస్తాము. అయితే ప్రవక్త నుండి ఈ సంతోషకరమైన ప్రకటనకు ఖచ్చితమైన సందర్భమేమిటి? ఈ లోతైన, హృదయపూర్వకమైన భావావేశాలను ప్రేరేపించినదేమిటి?

మృతుల కొరకు బాప్తిస్మము గురించి జోసెఫ్ స్మిత్ బోధిస్తున్నారు. ఇది వాస్తవానికి గొప్ప ఆనందంతో స్వీకరించబడిన మహిమకరమైన బయల్పాటు. సంఘ సభ్యులు వారి మృతుల కొరకు బాప్తిస్మము పొందవచ్చని మొదట తెలుసుకొన్నప్పుడు ఆనందించారు. విల్ఫర్డ్ వుడ్రఫ్ ఇలా అన్నారు, “దాని గురించి నేను విన్న క్షణం నా ఆత్మ ఆనందంతో గంతులు వేసింది!”4

మృతులైన మన ప్రియమైన వారి కొరకు బాప్తిస్మము మాత్రమే ప్రభువు బయల్పరచి, పునఃస్థాపించే సత్యము కాదు. దేవుడు తన కుమారులు మరియు కుమార్తెలపై అనుగ్రహించడానికి ఆతృతగా ఉన్న ఇతర బహుమానాలు లేదా వరములు అనేకమున్నాయి.

ఈ ఇతర బహుమానాలు యాజకత్వ అధికారము, నిబంధనలు మరియు విధులు, శాశ్వతంగా నిలిచియుండే వివాహాలు, దేవుని యొక్క కుటుంబంలో పిల్లలను వారి తల్లిదండ్రులతో ముద్రించుట మరియు చివరకు ఇంటికి, మన పరలోక తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళే దీవెనను కలిపియున్నాయి. ఈ దీవెనలన్నీ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యము చేయబడ్డాయి.

దేవుడు వీటిని తన మహోన్నతమైన, మిక్కిలి పవిత్రమైన దీవెనల మధ్య ఉంచాడు కనుక,5 ఆయన పవిత్ర భవనాలు కట్టబడాలని సూచించారు, అక్కడ ఆయన తన పిల్లలపై ఈ ప్రశస్థమైన బహుమానాలను అనుగ్రహించగలరు.6 ఈ భవనాలు భూమి మీద ఆయన గృహముగా ఉంటాయి. ఈ కట్టడములు దేవాలయాలుగా ఉంటాయి, అక్కడ ఆయన నామములో, ఆయన మాట ద్వారా, ఆయన అధికారముతో భూమిపై ముద్రింపబడినవి లేదా బంధించబడినవి పరలోకంలో బంధించబడతాయి.7

నేడు సంఘ సభ్యులుగా, మనలో కొందరికి ఈ మహిమకరమైన సత్యములను తేలికగా తీసుకొనుట సులభమనిపించవచ్చు. అది మనకు సహజ సిద్ధమైన స్వభావంగా మారింది. కొన్నిసార్లు మనము వాటి గురించి మొట్టమొదటిసారి నేర్చుకొంటున్న వారి దృక్కోణములో పరిగణించినప్పుడు అది సహాయకరంగా ఉంటుంది. ఇది ఇటీవలి అనుభవము ద్వారా నాకు స్పష్టమైంది.

గత సంవత్సరం, జపాన్, టోక్యో దేవాలయ పునఃసమర్పణకు కాస్త ముందు, మన విశ్వాసమునకు చెందని అనేకమంది అతిథులు దేవాలయమును సందర్శించారు. అటువంటి ఒక సందర్శనములో మరొక మతము నుండి ఆలోచనపూర్వకమైన నాయకుడిని చేర్చారు. పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక, ఆ ప్రణాళికలో యేసు క్రీస్తు యొక్క విమోచన పాత్ర మరియు ముద్రణ విధి ద్వారా కుటుంబాలు శాశ్వతంగా ఏకము చేయబడతాయనే సిద్ధాంతము గురించి మా అతిథికి మేము బోధించాము.

సందర్శన ముగింపులో, తన భావాలను పంచుకోమని మా స్నేహితుడిని నేను ఆహ్వానించాను. గతము, వర్తమానము మరియు భవిష్యత్తులో----కుటుంబాలను ఏకం చేయడానికి సంబంధించి ఈ మంచి వ్యక్తి పూర్తి నిజాయితీతో ఇలా అడిగాడు, “ఈ సిద్ధాంతము ఎంత లోతైనదో మీ విశ్వాసము యొక్క సభ్యులు నిజంగా గ్రహించారా?” అతడింకా ఇలా అన్నాడు, “ఇది బాగా విభజించబడిన ఈ లోకమును ఏకము చేయగల ఏకైక బోధన అవుతుంది.”

ఎటువంటి శక్తివంతమైన పరిశీలన. ఈ వ్యక్తి దేవాలయము యొక్క సున్నితమైన హస్తకళతో ప్రభావితం చేయబడలేదు, కానీ కుటుంబాలు ఏకము చేయబడి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో శాశ్వతంగా ముద్రింపబడతాయనే అద్భుతమైన మరియు లోతైన సిద్ధాంతము చేత ప్రభావితం చేయబడ్డాడు.8

మన విశ్వాసమునకు చెందని వారు కూడా దేవాలయములో జరుగుతున్న దాని యొక్క గొప్పతనమును గుర్తించినప్పుడు మనము ఆశ్చర్యపడరాదు. మనకు సాధారణమైనది లేదా అలవాటైనది కొన్నిసార్లు మొట్టమొదటిసారి వినిన లేదా భావించిన వారి చేత వైభవంగా, ఘనమైనదిగా చూడబడుతుంది.

పురాతన కాలం నుండి దేవాలయాలు ఉనికిలో ఉన్నప్పటికీ, యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనతో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ కాలమునుండి దేవాలయాల నిర్మాణం ప్రవక్తలందరికి వారి అత్యంత ప్రాధాన్యతలలో ఒకటిగా ఉన్నది. మరియు అది ఎందుకో గ్రహించుట సులభమైనది.

మృతుల కొరకు బాప్తిస్మము గురించి జోసెఫ్ స్మిత్ బోధించడం ప్రారంభించినప్పుడు, అతడు మరొక గొప్ప సత్యమును బయల్పరిచాడు. అతడు ఇలా బోధించాడు: “ఇవి మన రక్షణకు సంబంధించి మృతులు మరియు సజీవులకున్న సంబంధమును తెలుపు సూత్రములని, అవి తేలికగా తీసుకొనబడజాలవని మీకు నిశ్చయపరచనీయుడి. ఏలయనగా మన రక్షణ కొరకు వారి రక్షణ అవసరము మరియు ఆవశ్యకమైయున్నది, … మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు—అలాగే మనము కూడా మన మృతులు పరిపూర్ణులు కాకుండా పరిపూర్ణులము కాలేము.”9

మనము చూడగలిగినట్లుగా, దేవాలయముల కొరకు మరియు సజీవులు, మృతులు ఇరువురి కొరకు చేయబడిన కార్యము యొక్క ఆవశ్యకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అపవాది అప్రమత్తంగా ఉన్నాడు. దేవాలయాలలో చేయబడిన విధులు, నిబంధనల చేత అతడి శక్తి భయపెట్టబడింది మరియు కార్యమును ఆపేందుకు ప్రయత్నించడానికి అతడు దేనినైనా చేస్తాడు. ఎందుకు? ఎందుకనగా ఈ పవిత్ర కార్యము నుండి వచ్చే శక్తి అతడికి తెలుసు. ప్రతీ క్రొత్త దేవాలయం ప్రతిష్ఠించబడినప్పుడు, ప్రత్యర్థి యొక్క ప్రయత్నాలను ఎదుర్కోవడానికి మరియు మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు మనలను విమోచించడానికి యేసు క్రీస్తు యొక్క రక్షణ శక్తి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. దేవాలయములు మరియు నిబంధన పాటించువారి సంఖ్య పెరిగినప్పుడు, అపవాది బలహీనమవుతాడు.

సంఘము యొక్క ప్రారంభ దినాలలో, ఒక క్రొత్త దేవాలయము ప్రకటించబడినప్పుడు కొందరు కలవరపడి ఇలా చెప్పేవారు, “నరకపు గంటలు మ్రోగనారంభించకుండా మనము ఎన్నడూ ఒక దేవాలయాన్ని కట్టడం ప్రారంభించము.” కానీ బ్రిగమ్ యంగ్ ధైర్యముగా ప్రత్యుత్తరమిచ్చారు, “అవి మరలా మ్రోగాలని నేను కోరుతున్నాను.”10

ఈ మర్త్య జీవితంలో, మనము ఎన్నడూ యుద్ధమును తప్పించుకోము, కానీ మనము శత్రువుపై శక్తిని కలిగియుండగలము. మనము దేవాలయ నిబంధనలు చేసి పాటించినప్పుడు, ఆ శక్తి మరియు బలము యేసు క్రీస్తు నుండి వస్తుంది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ప్రభువుకు విధేయులు కాని వారి నుండి విధేయులైన వారు వేరే చేయబడే సమయం రాబోతున్నది. మనకు మిక్కిలి భద్రత కలిగించేది, ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశానికి యోగ్యులుగా ఉండుటను కొనసాగించడమే.11

దేవుడు తన ప్రవక్త ద్వారా మనకు వాగ్దానం చేసిన కొన్ని అదనపు ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి:

మీకు అద్భుతాలు అవసరమా? మన ప్రవక్త చెప్పారు: “ఆయన దేవాలయాలలో సేవ చేయడానికి మరియు ఆరాధించడానికి మీరు త్యాగాలు చేసినప్పుడు మీకు అవసరమని ఆయన ఎరిగిన అద్భుతాలను ప్రభువు తెస్తారని నేను మీకు వాగ్దానము చేస్తున్నాను.”12

రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క స్వస్థపరిచే, బలపరిచే శక్తి మీకవసరమా? అధ్యక్షులు నెల్సన్ మనకు ఇలా భరోసా ఇస్తున్నారు, “దేవాలయంలో బోధించబడే ప్రతీ విషయము … యేసు క్రీస్తు గురించి మన అవగాహనను పెంచుతుంది. … మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు. ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.”13

మొదటి మట్టల ఆదివారమున యేసు క్రీస్తు విజయోత్సాహముతో యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క శిష్యుల గుంపు సంతోషించారు మరియు “ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని … మహా శబ్దముతో దేవునికి స్తోత్రము చేసారు.”14

1836 యొక్క మట్టల ఆదివారము, కర్ట్‌లాండ్ దేవాలయము ప్రతిష్ఠించబడుట ఎంత యుక్తమైనది. ఆ సందర్భమున యేసు క్రీస్తు యొక్క శిష్యులు అదేవిధంగా సంతోషించారు. ఆ ప్రతిష్ఠాపన ప్రార్థనలో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఈ స్తుతి మాటలను ప్రకటించారు:

“ఓ ప్రభువా, సర్వశక్తిమంతుడవైన దేవా, మా విన్నపములను విని, … నీ పరిశుద్ధ నివాస స్థలమైన పరలోకము నుండి ప్రత్యుత్తరమిమ్ము, అక్కడ నీవు మహిమ, ఘనత, శక్తి, వాత్సల్యము, బలము, … కలిగి సింహాసనాసీనుడవై ఉన్నావు. …

“… చప్పట్లతో స్తుతించుచు, దేవునికి గొఱ్ఱెపిల్లకు హోసన్నాయని పాడుచు నీ సింహాసనము చుట్టూనుండు కాంతివంతమైన, ప్రకాశించుచున్న సెరాపులతో మా స్వరములను మేము కలుపుటకు నీ ఆత్మ శక్తిచేత మాకు సహాయము చేయుము!

“నీ పరిశుద్ధులు … సంతోషముతో బిగ్గరగా అరిచెదరు గాక.”15

సహోదర సహోదరీలారా, ఈరోజు ఈ మట్టల ఆదివారమున యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనము మన పరిశుద్ధ దేవుడిని స్తుతించి, మనపట్ల ఆయన మంచితనమునందు ఆనందిద్దాము. “మనము పొందిన సువార్తలో మనం ఏమి వింటాము?” నిజంగా “సంతోషకరమైన స్వరము!”16

ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరాలలోనికి మీరు ప్రవేశించినప్పుడు ఈ సంతోషాన్ని మీరు మరింత ఎక్కువగా అనుభూతి చెందుతారని నేను నా సాక్ష్యమును ప్రకటిస్తున్నాను. ఆయన మీ కొరకు ఉంచిన సంతోషమును మీరు అనుభవిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.