సర్వసభ్య సమావేశము
ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని ఎందుకు నమ్ముతానో మీకు తెలుసా?
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని ఎందుకు నమ్ముతానో మీకు తెలుసా?

భౌతిక మరణం నుండి మానవాళిని విమోచించడానికి మరియు దేవునితో నిత్యజీవాన్ని ఇవ్వడానికి యేసు క్రీస్తు బాధలు భరించి, మరణించి, తిరిగి లేవవలసి వచ్చింది.

చాలా సంవత్సరాల క్రితం, పని తర్వాత ఒక సాయంత్రం, నేను మామూలుగా న్యూయార్క్ నగరం నుండి న్యూజెర్సీకి వెళ్ళే నా బస్సు ఎక్కాను. నా పక్కన కూర్చున్న స్త్రీ, కంప్యూటర్‌లో నేను వ్రాసేదాన్ని గమనించి, “మీరు క్రీస్తును … నమ్ముతున్నారా?” అని అడిగింది. “అవును, నేను నమ్ముతాను!” అని చెప్పాను. మేము మాట్లాడుకున్నప్పుడు, ఆమె తన అందమైన ఆసియా దేశం నుండి న్యూయార్క్‌లోని అత్యంత పోటీతత్వ సమాచార సాంకేతిక రంగంలో పని చేయడానికి, అప్పుడే ఆ ప్రాంతానికి మారిందని నేను తెలుసుకున్నాను.

సహజంగానే, నేను ఆమెను ఇలా అడిగాను, “ఒక క్రైస్తవుడిగా నేను యేసు క్రీస్తును ఎందుకు నమ్ముతున్నానో మీకు తెలుసా?” ఆమె కూడా మామూలుగానే స్పందించి, చెప్పమని నన్ను ఆహ్వానించింది. కానీ నేను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, మీ మనస్సులలో అనేక ఆలోచనలు ప్రవహించే విధముగానే ఆ క్షణాలలో నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. క్రైస్తవ మతం గురించి ఏమీ తెలియని మరియు అత్యంత తెలివైన ఒక వ్యక్తికి, క్రైస్తవమతం “ఎందుకు” అని వివరించడం నాకు అదే మొదటిసారి. “నేను యేసు క్రీస్తును అనుసరిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా పాపాల కొరకు ఇష్టపూర్వకంగా బాధలు అనుభవించి మరణించారు” అని మాత్రమే నేను చెప్పలేను. ఆమె ఆశ్చర్యపోయి ఇలా అడగవచ్చు, “యేసు చనిపోవాల్సి వచ్చిందా? మనము ఆయనను అడిగితే దేవుడు మన పాపాలను క్షమించి, శుద్ధి చేయలేడా?”

కొన్ని నిమిషాల్లోనే మీరు ఎలా స్పందించివుంటారు? మీరు దీనిని ఒక స్నేహితుడికి ఎలా వివరిస్తారు? పిల్లలు మరియు యువత: దయచేసి మీరు మీ తల్లిదండ్రులను లేదా నాయకుడిని “యేసు ఎందుకు చనిపోవాలి” అని అడుగుతారా? సహోదర సహోదరీలారా, నేను ఒప్పుకోవాలనుకుంటున్నాను: సంఘ సిద్ధాంతం, సంఘ చరిత్ర, సంఘ విధానం మొదలైన వాటి గురించి నాకు తెలుసు అని నేను అనుకున్నప్పటికీ, మన విశ్వాసానికి కేంద్రమైన ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా రాలేదు. ఆ రోజు, నేను నిత్యజీవానికి అత్యంత ముఖ్యమైన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.

సరే, నేను నా క్రొత్త స్నేహితురాలికి,1 మనకు శరీరంతో పాటు ఆత్మ కూడా ఉందని మరియు దేవుడు మన ఆత్మలకు తండ్రి2 అని చెప్పాను. ఈ మర్త్య ప్రపంచంలో మనం పుట్టక ముందు మన పరలోక తండ్రితో కలిసి మనం జీవించామని నేను ఆమెకు చెప్పాను.3 ఆమెను మరియు తన బిడ్డలందరినీ ఆయన ప్రేమిస్తున్నారు కనుక, తన మహిమా శరీరం యొక్క ప్రతిరూపంలో శరీరాన్ని పొందడానికి,4 ఒక కుటుంబంలో భాగమై,5 ఆయనలా మనము కూడా మన కుటుంబాలతో నిత్యజీవాన్ని ఆస్వాదించేందుకు6 ఆయన ప్రేమపూర్వక సన్నిధికి తిరిగి వెళ్ళడానికి ఆయన మనకోసం ఒక ప్రణాళికను రూపొందించారు.7 కానీ, నేను చెప్పాను, ఈ పతనమైన ప్రపంచంలో తప్పనిసరిగా మనం రెండు ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటాము:8 (1) భౌతిక మరణం—మన ఆత్మల నుండి మన శరీరాలు వేరుకావడం. అయితే, మనమందరం చనిపోతామని ఆమెకు తెలుసు. మరియు (2) ఆత్మీయ మరణం—మానవులుగా మన పాపాలు, తప్పులు మరియు దోషాలు ఆయన పరిశుద్ధ సన్నిధి నుండి మనలను దూరం చేయడం వలన దేవుని నుండి మనం వేరుచేయబడడం.9 ఇది కూడా ఆమెకు తెలుసు.

ఇది ధర్మశాస్త్రం యొక్క ప్రభావమని నేను ఆమెకు తెలియజేసాను. ఈ నిత్య ధర్మశాస్త్రం, మనలో ప్రతీఒక్కరి పాపాలకు లేదా దేవుని చట్టాలను, సత్యాన్ని ఉల్లంఘించినందుకు నిత్య పరిహారము చెల్లించాలని అడుగుతుంది, లేనిచో ఆయన పరిశుద్ధ సన్నిధిలో జీవించడానికి మనం ఎప్పటికీ అర్హులము కాలేము.10 అది అన్యాయం అవుతుంది మరియు దేవుడు “న్యాయాన్ని తిరస్కరించలేడు.”11 ఆమె దీనిని అర్థం చేసుకుంది, కాగా దేవుడు కూడా దయగలవాడని, ప్రేమగలవాడని మరియు మనకు నిత్యజీవమునిచ్చుటకు ఆసక్తిగా ఉన్నాడని ఆమె సులభంగా గ్రహించింది.12 చెడు మరియు అసత్యాలకు మూలమైన, మోసపూరితమైన, శక్తివంతమైన విరోధి కూడా మనకు ఉంటాడని, మనల్ని వ్యతిరేకిస్తాడని నేను నా స్నేహితురాలికి తెలియజేసాను.13 కాబట్టి, అటువంటి వ్యతిరేకత మరియు అడ్డంకులన్నింటినీ అధిగమించడానికి అనంతమైన దైవశక్తి ఉన్న ఎవరైనా మనల్ని రక్షించాలి.14

తర్వాత నేను ఆమెతో శుభవార్తని పంచుకున్నాను—“ప్రజలందరికిని … కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము”15—“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”16 నేను నా స్నేహితురాలుకి ఈ సాక్ష్యమిచ్చాను మరియు నేను మీకు సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తే ఆ రక్షకుడు, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం ద్వారా భౌతిక మరణం నుండి మొత్తం మానవాళిని విమోచించడానికి17 మరియు ఆయనను అనుసరించే వారందరికి దేవునితో మరియు మన కుటుంబాలతో జీవించేలా నిత్యజీవమును అందించడానికి18 ఆయన బాధలు భరించి, మరణించి, తిరిగి లేచారు. మోర్మన్‌ గ్రంథము ఇలా ప్రకటిస్తుంది, “ఆ విధముగా మరణముపై జయము పొందినవాడై … దేవుడు … ; నరుల సంతానము కొరకు విజ్ఞాపనము చేయుటకు కుమారునికి శక్తినిచ్చును; [దయ మరియు] కనికరము కలిగి … ; మరణబంధకములను త్రెంచి, వారి దోషములు, అతిక్రమములు తనపై వేసుకొని వారిని విమోచించి, న్యాయపు అక్కరలను తృప్తిపరచును.”19

యేసును అనుసరించడానికి మరియు నిత్యజీవాన్ని పొందేందుకు మనం తప్పక తీసుకోవాలని దేవుడు వెల్లడించిన దశలను క్రీస్తు సిద్ధాంతం అంటారు. వాటిలో “యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై విశ్వాసం, పశ్చాత్తాపం, [యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములోనికి] బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందడం మరియు అంతము వరకు సహించడం”20 ఉంటాయి. నేను ఈ దశలను నా స్నేహితురాలితో పంచుకున్నాను, అయితే ప్రవక్తలు మరియు అపొస్తలులు ఇటీవల క్రీస్తు సిద్ధాంతం దేవుని పిల్లలందరినీ ఎలా ఆశీర్వదించగలదోయని బోధించిన కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ఉపదేశించారు: “క్రీస్తు యొక్క స్వచ్ఛమైన సిద్ధాంతం శక్తివంతమైనది. దానిని గ్రహించి, అతని లేదా ఆమె జీవితంలో దానిని అన్వయించుకోవాలని కోరిన ప్రతీఒక్కరి జీవితాన్ని అది మారుస్తుంది.”21

ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా బోధించారు, “యౌవనుల బలము కొరకు [మార్గదర్శిని] క్రీస్తు సిద్ధాంతాన్ని ప్రకటించడంలో [మరియు] మిమ్మల్ని [యువతను] [దాని] ఆధారంగా ఎంపికలు చేయడానికి ఆహ్వానించడంలో దిట్ట.”22

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా బోధించారు, “సువార్తికులు వారు బోధించే వారు ఏమి చేయాలని ఆశిస్తారో దానినే చేయమని మేము వారిని ఆహ్వానిస్తున్నాము: క్రీస్తు సిద్ధాంతాన్ని వారి జీవితాలలో వర్తింపజేయండి [మరియు] నిబంధన మార్గంలో ప్రవేశించి, దానిలో ఉండండి.”23

క్రీస్తు సిద్ధాంతము, సంఘమునకు చెందిన వారము కాదని భావించే వారికి లేదా ప్రయాసపడుతున్న వారికి బలమును ఇస్తుంది, అది వారికి సహాయం చేస్తుంది గనుక, ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ పేర్కొన్నట్లుగా, “ధృవపరచండి: యేసు క్రీస్తు నా కోసం మరణించారు … [మరియు] నన్ను ప్రేమిస్తున్నారు.”24

తల్లిదండ్రులారా, మీ బిడ్డ ఒక సువార్త సూత్రం లేదా ప్రవచనాత్మక బోధనతో పోరాడుతున్నట్లయితే, సంఘము లేదా సంఘ నాయకుల పట్ల ఏ రకమైన చెడు మాట్లాడినా దయచేసి నిరోధించండి.25 ఈ తక్కువ, లౌకిక విధానాలు మీ క్రింద ఉన్నాయి మరియు మీ పిల్లల దీర్ఘకాలిక విశ్వాసానికి ప్రాణాంతకం కావచ్చు.26 ఇది, మీరు మీ విలువైన బిడ్డను రక్షించుకుంటారని లేదా మధ్యవర్తిగా ఉంటారని, అతనితో లేదా ఆమెతో సంఘీభావాన్ని చూపుతారని మీ గురించి చాలా బాగా మాట్లాడుతుంది. కానీ, మనందరికీ యేసు క్రీస్తు ఎందుకు అవసరమో మరియు ఆయన సంతోషకరమైన సిద్ధాంతాన్ని ఎలా అన్వయించాలో మీ ప్రియమైన బిడ్డకు నేర్పడం అతడు లేదా ఆమెను బలపరుస్తుంది మరియు స్వస్థపరుస్తుంది అని నేను, నా భార్య జేన్ వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకున్నాము. తండ్రి యొద్ద వారి నిజమైన ఉత్తరవాది అయిన యేసు వైపుకు వారిని మళ్ళిద్దాం. అపొస్తలుడైన యోహాను ఇలా బోధించాడు, “క్రీస్తు బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు.” “ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు” అని అతడు మనల్ని హెచ్చరించాడు.27

జేన్ మరియు నేను ఇటీవల అరణ్యాన్ని సందర్శించాము, అక్కడ సంచరిస్తున్న ఇశ్రాయేలు పిల్లల ముందు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తిపట్టుకున్నాడు. దాని వైపు చూస్తే, విషపూరితమైన పాము కాటుకు గురైన వారందరికీ స్వస్థత చేకూరుస్తానని ప్రభువు వాగ్దానం చేశారు.28 క్రీస్తు సిద్ధాంతాన్ని మనకు బోధించడంలో, “దేశాలను స్వస్థపరిచేలా” ప్రభువు ప్రవక్త అదే చేస్తున్నారు.29 ఈ మర్త్య అరణ్యంలో మనం అనుభవించే కాటులు లేదా విషం లేదా పోరాటాలు ఏవైనా, ప్రాచీన మరియు ప్రస్తుతకాలంలో స్వస్థత పొందుకొనే అవకాశం ఉండి కూడా “చూడకుండా … ఎందుకంటే అది వారికి నయం చేస్తుందని నమ్మకుండా” స్వస్థత పొందని వారిలాగా మనం ఉండకూడదు.30 మోర్మన్‌ గ్రంథము ఇలా ధృవీకరిస్తుంది: “ఇప్పుడు, … ఇదియే మార్గము; దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షింపబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన మరే ఇతర మార్గము గాని నామముగానీ లేదు; ఇదే క్రీస్తు యొక్క సిద్థాంతమైయున్నది.”31

ఆ సాయంత్రం న్యూజెర్సీలో, మనకు యేసు క్రీస్తు ఎందుకు అవసరమో పంచుకోవడం జరిగింది మరియు ఆయన సిద్ధాంతం నాకు క్రొత్త సోదరిని మరియు ఆమెకు క్రొత్త సోదరుడిని ఇచ్చింది. మేము పరిశుద్ధాత్మ యొక్క శాంతియుతమైన, నిర్ధారించు సాక్ష్యాన్ని అనుభవించాము. సహజంగానే, ఆమె సంప్రదింపు సమాచారాన్ని పంచుకోమని మరియు మా సువార్తికులతో సంభాషణను కొనసాగించమని నేను ఆమెను ఆహ్వానించాను. అలా చేసేందుకు ఆమె సంతోషించింది.

మనం అన్ని సంఘాలలో మరియు కుటుంబాలలో ఇశ్రాయేలీయులను సమీకరించేటప్పుడు ప్రేమించడం, పంచుకోవడం మరియు ఆహ్వానించడం చేయాలని32 మోర్మన్‌ గ్రంథము ప్రకటిస్తుంది—“అందువలన పరిశుద్ధ మెస్సీయ యొక్క మంచితనము, కనికరము మరియు కృప [ మరియు సిద్ధాంతం ] ద్వారా తప్ప దేవుని సన్నిధిలో ఏ శరీరియు నివసించలేడని వారు తెలుసుకొనునట్లు భూనివాసులకు ఈ విషయములను తెలియజేయుట ఎంతో ముఖ్యమైనది.”33 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. నేను నా స్నేహితురాలి పేరును ప్రచారం చేయకూడదని లేదా కల్పిత పేరును ఉపయోగించకూడదని ఎంచుకున్నాను.

  2. రోమా 8:15-17; హెబ్రీయులకు 12:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:15 చూడండి.

  3. యిర్మియా 1:4–5; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:55–56; అబ్రాహాము 3:22–23, 26; Guide to the Scriptures, “Premortal Life,” scriptures.ChurchofJesusChrist.org; “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel: A Guide to Missionary Service (2019), 48.

  4. See “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 48.

  5. తండ్రి యొక్క పరిపూర్ణ ప్రణాళిక—ఇతర సూచనలతో పాటుగా సంతోషం యొక్క గొప్ప ప్రణాళిక, రక్షణ ప్రణాళిక మరియు విమోచన ప్రణాళిక అని పిలువబడింది—మర్త్యత్వంలోకి వచ్చిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కుటుంబంలోకి ప్రవేశించేలా నిర్వహించబడుతుంది మరియు ప్రతీఒక్కరూ ఒక కుటుంబంలో భాగము. వాస్తవానికి, అన్ని కుటుంబ పరిస్థితులు ఆదర్శంగా ఉండవు లేదా తన పిల్లలందరి కొరకు మన తండ్రి యొక్క ప్రేమపూర్వక దృష్టికి అనుగుణంగా ఉండవు మరియు కొన్ని పరిస్థితులు విషాదకరమైనవి. అయినప్పటికీ, మనం క్రీస్తు సిద్ధాంతాన్ని జీవిస్తున్నప్పుడు, తన దయగల మరియు సమగ్రమైన ప్రణాళిక ద్వారా తండ్రి తన పిల్లల కొరకు కలిగి ఉన్న అన్ని ఆశీర్వాదాలను పొందడానికి యేసు క్రీస్తు మనకు సహాయం చేస్తారు. ముగింపు గమనిక 6 కూడా చూడండి.

  6. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలలో ఒకటి, మనకు ఆయన ఇచ్చిన అన్ని బహుమతులలో గొప్పది: ఉన్నతస్థితి లేదా నిత్యజీవము, అనగా శాశ్వతంగా “దేవుని సన్నిధిలో నివసించడం మరియు కుటుంబాలుగా కొనసాగడం” (Gospel Topics, “Eternal Life,” topics.ChurchofJesusChrist.org; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 కూడా చూడండి). “కుటుంబాలలో” భర్త, భార్య మరియు పిల్లలు ఉన్నారు, అలాగే క్రీస్తు సిద్ధాంతాన్ని అంగీకరించి జీవించే మన సజీవులైన మరియు మరణించిన బంధువులు ఉన్నారు. ఈ జీవితంలో క్రీస్తు సిద్ధాంతాన్ని స్వీకరించలేకపోయి ఇప్పటికే మరణించి ఆత్మ లోకంలో ఉన్న కుటుంబ సభ్యులు బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందడం మరియు అంతము వరకు సహించడానికి మనకు సహాయపడే ఇతర విధులను ఆత్మ లోకంలో పొందవచ్చు, అవి వారికి బదులుగా జీవించియున్న బంధువులచేత యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములోని దేవాలయాలలో ప్రేమపూర్వకంగా నిర్వహించబడతాయి. అదనంగా, నిత్యజీవం యొక్క వాగ్దానం ఈ జీవితంలో వివాహం చేసుకున్న వారికి మాత్రమే కాదు. అధ్యక్షులు ఎం. రస్సెల్ బాల్లర్డ్ ఇలా బోధించారు, “సువార్త నిబంధనలను పాటించడంలో విశ్వాసపాత్రంగా ఉన్న ప్రతీఒక్కరికి ఉన్నతస్థితి లభించే అవకాశం ఉంటుందని లేఖనాలు మరియు కడవరి-దిన ప్రవక్తలు ధృవీకరిస్తున్నారు” (“క్రీస్తునందు నిరీక్షణ,” లియహోనా, మే 2021, 55; వివరణ చేర్చబడింది). అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్‌ను ఉటంకిస్తూ, అధ్యక్షులు బాల్లర్డ్ ఇలా కొనసాగించారు, “ఉన్నతస్థితి యొక్క ఆశీర్వాదాలు అందించబడే ఖచ్చితమైన సమయం మరియు విధానం అన్నీ బహిర్గతం కాలేదు, అయితే అవి హామీ ఇవ్వబడ్డాయి” (“క్రీస్తునందు నిరీక్షణ,” 55; వివరణ చేర్చబడింది). అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “ప్రభువు యొక్క సొంత విధానంలో మరియు సమయములో, ఆయన నమ్మకమైన పరిశుద్ధుల నుండి ఎటువంటి [ఆశీర్వాదం] నిలిపివేయబడదు. ప్రభువు ప్రతీవ్యక్తికి హృదయపూర్వక కోరికతో పాటు కార్యాన్ని బట్టి తీర్పు ఇస్తారు మరియు ప్రతిఫలం ఇస్తారు ” (“Celestial Marriage,” Liahona, Nov. 2008, 94). మరియు అధ్యక్షుడు ఓక్స్ ఇలా వివరించారు, “మర్త్యత్వం యొక్క చాలా ముఖ్యమైన నష్టాలలో అనేకం వెయ్యేండ్ల పాలనలో సరిచేయబడతాయి, మన తండ్రి యొక్క యోగ్యులైన పిల్లలందరి కొరకు సంతోషం యొక్క గొప్ప ప్రణాళికలో అసంపూర్ణంగా ఉన్నవన్నీ నెరవేర్చే సమయమది” (“The Great Plan of Happiness,” Ensign, Nov. 1993, 75). ముగింపు గమనిక 5 కూడా చూడండి.

  7. See Guide to the Scriptures, “Plan of Redemption,” scriptures.ChurchofJesusChrist.org; see also Gospel Topics, “Plan of Salvation,” topics.ChurchofJesusChrist.org; “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 48–50, 53.

  8. See “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 49.

  9. See “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 47–50.

  10. See “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 47–50.

  11. మోషైయ 15:27. శాశ్వత న్యాయం లేదా దేవుని న్యాయం గురించిన ప్రస్తావనలు గ్రంథాలలో పుష్కలంగా ఉన్నాయి, కానీ ప్రత్యేకించి ఆల్మా 41:2–8 మరియు ఆల్మా 42 చూడండి.

  12. ఆల్మా 42:14–24; మోషే 1:39 చూడండి.

  13. See “Lesson 2: The Plan of Salvation,” Preach My Gospel, 47–50.

  14. ఆల్మా 34: 9–13 చూడండి; మోషైయ 13:28, 34–35; 15:1–9; ఆల్మా 42:15 కూడా చూడండి.

  15. లూకా 2:10.

  16. యోహాను 3:16.

  17. హీలమన్ 14:15–17; మోర్మన్ 9:12–14. చూడండి.

  18. ముగింపు గమనిక 5 మరియు 6 కూడా చూడండి.

  19. మోషైయ 15:8–9.

  20. What Is My Purpose as a Missionary?,” Preach My Gospel, 1; see also “Lesson 3: The Gospel of Jesus Christ,” Preach My Gospel, 63.

  21. రస్సెల్ ఎమ్. నెల్సన్, “శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు,” లియహోనా, నవ. 2021, 6; వివరణ చేర్చబడింది.

  22. డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “యేసు క్రీస్తే యౌవనుల బలము,” లియహోనా, నవ. 2022, 11; For the Strength of Youth: A Guide for Making Choices (2022), 4 కూడా చూడండి.

  23. Dale G. Renlund, “Lifelong Conversion of Missionaries” (address given at the mission leadership seminar, June 25, 2021), 1, Church History Library, Salt Lake City.

  24. డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “చెందియుండడం యొక్క సిద్ధాంతం,” లియహోనా, నవ. 2022, 56; డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “పరిశుద్ధుల యొక్క సంతోషము,” లియహోనా, నవ. 2019, 15–18 కూడా చూడండి.

  25. యాకోబు 4:11; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:54 చూడండి; Guide to the Scriptures, “Evil Speaking,” scriptures.ChurchofJesusChrist.org.

  26. See Ahmad S. Corbitt, “Activism vs. Discipleship: Protecting the Valiant” (address given at the chaplains’ seminar, Oct. 2022), cdn.vox-cdn.com/uploads/chorus_asset/file/24159863/Brother_Corbitt_Chaplain_seminar.pdf; video: media2.ldscdn.org/assets/general-authority-features/2022-chaplain-training-seminar/2022-10-1000-activism-vs-discipleship-1080p-eng.mp4.

  27. 2 యోహాను 1:9-10.

  28. సంఖ్యాకాండము 21:5-9 చూడండి.

  29. 2 నీఫై 25:20.

  30. ఆల్మా 33:20.

  31. 2 నీఫై 31:21.

  32. See “2021 Broadcast: Principles of Love, Share, and Invite,” broadcasts.ChurchofJesusChrist.org; గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “ప్రేమించు, పంచు, ఆహ్వానించులియహోనా, మే 2022, 84-87 కూడా చూడండి.

  33. 2 నీఫై 2:8.