లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 123


123వ ప్రకరణము

లిబర్టీ, మిస్సోరి చెరసాలలో ఖైదీగా నుండగా ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత వ్రాయబడిన విధముగా, వారిని హింసించువారి పట్ల పరిశుద్ధుల యొక్క బాధ్యత. ఈ ప్రకరణము 1839, మార్చి 20న సంఘమునకు వ్రాసిన పత్రిక యొక్క సంగ్రహము (121వ ప్రకరణ శీర్షిక చూడుము).

1–6, పరిశుద్ధులు తమ బాధలు, హింసల యొక్క వృత్తాంతమును సేకరించి, ప్రచురించవలెను; 7–10, అసత్య మతసిద్ధాంత సూత్రములను ఏర్పరచిన ఆత్మయే పరిశుద్ధుల హింసలకు కారణమగును; 11–17, మతవిభాగములన్నింటిలో అనేకమంది ఇంకను సువార్తను పొందవలసియున్నది.

1 మరలా, ఈ రాష్ట్ర ప్రజలచే వారికి కలిగిన బాధలు, హింసలన్నింటి జ్ఞానమును పరిశుద్ధులందరు సేకరించుట;

2 పరువు ప్రతిష్టలు, వ్యక్తిగత గాయాలు, అసలైన ఆస్థులకు వారు కలుగజేసిన నష్టమును గూర్చి కూడా సేకరించుట;

3 వారిని పట్టుకొని, గుర్తించగలిగినంత వరకు, వారి హింసలలో హస్తమున్న వారందరి పేర్లు సేకరించుట సరియో కాదో మీరు పరిగణించవలెనని మేము సూచించుచున్నాము;

4 ఈ సంగతులన్నింటిని తెలుసుకొనుటకు వాంగ్మూలములను, లిఖిత వాంగ్మూలములను పొందుటకు; ప్రచారములోనున్న అపఖ్యాతిపాలుచేయు వ్రాతపూర్వక ప్రకటనలు సేకరించుటకు ఒక కమిటీ నియమించబడవచ్చును.

5 పత్రికలలోను, విజ్ఞానసర్వస్వములలోను ఉన్న సమస్తము, ప్రచురింపబడిన, వ్రాయబడిన అపఖ్యాతిపాలుచేయు వృత్తాంతములు, అవి ఎవరిచేత వ్రాయబడెనో వారిని, ఈ ప్రజలపై ప్రయోగించబడిన దుష్టపూర్వక, మరణపాశమైన బలవంతపు చర్యలు, అపవాది సంబంధమైన మూర్ఖపు సంఘటనల్నింటిని ప్రవేశపెట్టవలెను—

6 తద్వారా తన రహస్యప్రదేశము నుండి ఆయనను పిలుచు ఆ వాగ్దానమును మేము సంపూర్ణముగా ఆపేక్షించక మునుపు పరలోకపు తండ్రిచేత కోరబడి, మేము చేయవలసిన ఆఖరి ప్రయత్నముగా మేము సర్వలోకమునకు ప్రచురించుటయే కాక, సమస్త అంధకారమైన నరకపు ఆచ్ఛాదనములతో వాటిని ప్రభుత్వ ప్రధానులకు సమర్పించెదము; ఆయన బలమైన హస్తము యొక్క శక్తిని పంపకమునుపు సమస్త దేశము క్షమాపణలేకయుండును.

7 మరణము, అధికార దుర్వినియోగము, అన్యాయము యొక్క మిక్కిలి నాశనకరమైన చేతివలన వేదన, దుఃఖము, దిగులుకు గురై, పిల్లల హృదయాలలో అబద్ధములను వారసత్వముగా ఇచ్చి, లోకమును అనిశ్చితితో నింపి, అంతకంతకు బలముగా ఎదుగుచుండి, ఇప్పుడు సమస్త అవినీతికి కారణభూతమై, తండ్రుల శాసనములు బలముగా నాటుకుపోయినట్లు చేసిన ఆ ఆత్మ ప్రభావముచేత సహకరింపబడి, వేడుకొనబడి, బలపరచబడి బాధతో, వేదనతో సాగిలపడిన మన భార్యాపిల్లలు, ఎవరితోనైతే మనము నిలబడుటకు తేబడెదమో ఆ దేవదూతలు, దేవుడు మరియు మనపట్ల మనం కలిగియున్న అతి ముఖ్యమైన బాధ్యత ఇది మరియు భూమి మొత్తము దాని పాప భారముపై మూలుగుచున్నది.

8 ఇది ఇనుప కాడియు, బలమైన బంధకమైయున్నది; అదియే నరకపు చేతి సంకెళ్ళు, గొలుసులు, కొక్కెములు, కాళ్ళ సంకెళ్ళునై యున్నది.

9 కాబట్టి ఇది మన భార్యలు, పిల్లలకు మాత్రమేకాక, విధవరాండ్రు, తండ్రులు లేనివారి యెడల మనము అచ్చియున్న ఆవశ్యకమైన బాధ్యత, వారి భర్తలు, తండ్రులు దాని ఇనుప హస్తముచే చంపబడిరి;

10 ఆ చీకటి మరియు అంధకార కార్యములు నరకమును కంపింపజేసి, విస్మయమును కలుగజేసి, వర్ణమును కోల్పోవునట్లు చేసి, ఆ అపవాది చేతులు వణకునట్లు, పక్షవాతము వచ్చునట్లు చేయగలవు.

11 రాబోవు తరములన్నిటికి, హృదయశుద్ధిగల వారందరికి మనము అచ్చియున్న ఆవశ్యకమైన బాధ్యత ఇది—

12 ఏలయనగా భూమిపైనున్న అన్ని మతవిభాగములలో, పక్షములలో, మతశాఖలలో ఇంకను అనేకమంది మనుష్యుల మాయోపాయముల చేత, వంచనతోను గ్రుడ్డివారిగా చేయబడియున్నారు, వాటిద్వారా మోసము చేయుటకు వేచియున్నారు, వారు కేవలము సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు—

13 కాబట్టి, మనమెరిగినంత వరకు వాటిని అనగా దాచబడియున్న చీకటిసంబంధమైన సంగతులన్నింటిని వెలుగులోనికి తెచ్చుటకు మన జీవితములను నలుగగొట్టుకొనవలెను; అవి యథార్థముగా పరలోకము నుండి ప్రత్యక్షపరచబడును—

14 అప్పుడు ఇవి నిండు మనస్సుతో పాటించబడవలెను.

15 ఏ మనుష్యుడు వాటిని తక్కువగా యెంచకూడదు; ఏలయనగా ఈ సంగతులపై ఆధారపడి, పరిశుద్ధులకు సంబంధించినది చాలావరకు భవిష్యత్తులోనున్నది.

16 సహోదరులారా, తుఫాను వచ్చినప్పుడు గాలి అలలతో సరైన దిశలో ముందుకు సాగుటకు అతి పెద్ద ఓడ మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత త్రిప్పబడునని మీరెరుగరా?

17 కాబట్టి, మిక్కిలి ప్రియమైన సహోదరులారా, మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయుదము; అప్పుడు దేవుని రక్షణను చూచుటకును, ఆయన బాహువు బయలుపరచబడుట కొరకును మనము మిక్కిలి నిశ్చయముతో నిలిచియుండెదము.