లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 131


131వ ప్రకరణము

1843, మే 16 మరియు 17లలో రామస్, ఇల్లినాయ్ వద్ద ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడిన సూచనలు.

1–4, అత్యున్నతమైన పరలోకమునందు ఉన్నతస్థితికి సిలెస్టియల్ వివాహము ఆవశ్యకము; 5–6, నిత్యజీవము పొందుటకు మనుష్యులు ఏవిధముగా ముద్రింపబడుదురో వివరించబడినది; 7–8, ఆత్మ అంతయు పదార్థమైయున్నది.

1 సిలెస్టియల్ మహిమలో మూడు పరలోకములు లేదా తరగతులు కలవు;

2 వాటిలో అత్యున్నతమైన దానిని పొందుటకు ఒక మనుష్యుడు ఈ యాజకత్వపు క్రమములోనికి [అనగా వివాహము యొక్క నూతన మరియు శాశ్వతమైన నిబంధనలోనికి] ప్రవేశించవలెను;

3 అతడు ఆవిధముగా చేయని యెడల, దానిని అతడు పొందలేడు.

4 అతడు మరొకదానిలో ప్రవేశించగలడు గాని, అతని రాజ్యము దానితో అంతమగును; అతడు వృద్ధిని పొందలేడు.

5 (1843, మే 17న.) ప్రవచనపు నెరవేర్పు అనగా ఒక మనుష్యుడు నిత్యజీవము కొరకు పరిశుద్ధ యాజకత్వపు అధికారము ద్వారా బయల్పాటు మరియు ప్రవచనాత్మ వలన ముద్రింపబడెనని తెలుసుకొనుట.

6 అజ్ఞానమందు రక్షింపబడుట మనుష్యునికి అసాధ్యము.

7 భౌతికము కానీ పదార్థము అనేది ఏదియు లేదు. ఆత్మ అంతయు పదార్థమే, కానీ అది మరింత సున్నితమైనది లేదా శుద్ధమైనది, నిర్మలమైన కన్నులతో మాత్రమే గ్రహించవచ్చును;

8 దానిని మనము చూడలేము; కానీ మన శరీరములు శుద్ధిచేయబడినప్పుడు అది అంతయు పదార్థమని మనము తెలుసుకొందుము.