లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 26


26వ ప్రకరణము

1830 జూలైలో, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ, జాన్ విట్మర్‌లకు ఇవ్వబడిన బయల్పాటు. (24వ ప్రకరణ శీర్షిక చూడుము).

1, లేఖనములను అధ్యయనము చేయవలెనని, బోధించవలెనని వారు సూచించబడిరి; 2, ఉమ్మడి అంగీకార చట్టము రూఢిపరచబడినది.

1 ఇదిగో, తదుపరి సమావేశమును జరుపుటకు పశ్చిమమునకు వెళ్ళువరకు లేఖన అధ్యయనమునకు, బోధించుటకు, కొలిస్విల్లిలో సంఘమును నిర్ధారించుటకు, పొలములో ఏది అవసరమో ఆ పని చేయుటకు మీ సమయమును అంకితము చేయవలెను; తరువాత మీరేమి చేయవలెనో అది మీకు తెలియజేయబడును.

2 సంఘములో అన్ని సంగతులు ఉమ్మడి అంగీకారము వలన, అధిక ప్రార్థన, విశ్వాసముల వలన చేయబడును, ఏలయనగా అన్ని సంగతులు మీరు విశ్వాసము వలన పొందెదరు. ఆమేన్.